నిండా 90 ఎమ్మెల్ ఏసీ ఒక #TRS పింకీ గారు రాసిన పోస్ట్ ని మెల్లిగా అటు ఇటు ఎడిట్ చేస్తే కింది పోస్ట్ తయారయింది.
కింద ఉన్న పథకాలన్నీ మా కచరా దొర ముక్కు చీది ఇస్తున్నాడు ఒప్పుకుందాం.... మోదీ ఒక్క పైసా ఇవ్వలే ....కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకున్నా సరే కచరా మాత్రం 90 జుర్రి పథకాలు ఇస్తున్నాడు అనుకుందాం.... మరి అలాంటప్పుడు కచరా నే ఉద్యోగాలు ఇవచ్చుగా? ఉద్యోగాలు లేక పోవడానికి... అభివృద్ధి లేకపోవడానికి మాత్రం మోదీ కారణం.. బిజెపి మాత్రమే కారణం కానీ జనాన్ని సోమరుల చేసే లంచగొండి పథకాలకు సర్వ కారణం మాత్రమ కచరా దొర ఇదెక్కడి నిజం రా?
10 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా ని మూడు లక్షల కోట్ల అప్పుల తెలంగాణ గా మార్చిన 90 ఎమ్మెల్ నాయకుడు.... అధికారం నిలుపుకోవడం కోసం జనానికి ఉచిత పథకాల బొక్కలు విసురుతున్నాడు... భానిస జనం ఉచితాలకు అలవాటుపడి తెలంగాణ భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారు.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ జల యుక్త్ శివిర్ చేస్తే ...తెలంగాణ నుంచి అఫీషియల్ గా పోయి పరిశీలించి కాపీ కొట్టి ... ఉల్టా బిజెపినే అంటున్నారు.
గుజరాత్ అర్బన్ ప్రాంతాలలో మంచినీటి ప్రణాళిక కాపీ కొట్టి ఉల్టా బిజెపిని అంటున్నారు!!
నీళ్లకు projects
కరంటుకు production& supply
రైతుబంధు
రైతుభీమా
కేసీఆర్ కిట్
కళ్యాణలక్ష్మి సాయం
ఆసరా ఫించను
దివ్యాంగుల ఫించను
మిషన్ కాకతీయ
మిషన్ భగీరధ
గురుకులాలు
బాలికల హెల్త్ కిట్లు
హాస్టల్ విద్యార్థులను మతవిద్వేషం తో పెడదోవ పట్టించుడు
ఇయ్యాల 24 గంటల కరంటు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన భగీరధ నల్లానీళ్లు
60 ఏండ్లల్ల కాని పనులు
ఆరేండ్లల్ల చేసిండు కేసీఆర్ !! మరి ఇందులో కేంద్రం భాగస్వామ్యం ఏమీ లేదా కేంద్ర సహకారం లేనిదే దొర పొలం నుంచి ఇవన్నీ చేస్తున్నాడా?
కరోనాతో కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేస్తే
కచరా మాత్రం ముక్కుచీది అన్ని పథకాలకు పైసల్ సల్లుతున్నడు !!
సంక్షోభంలోనూ సంక్షేమం మరవకుండా పథకాలను అమలు చేసి సోమరుల తెలంగాణ ని అప్పులపాలు చేస్తూన్నది ప్రభుత్వం కాదా ?
నడిరోడ్డు మీద నరుక్కోవడాలు... నచ్చని వాళ్ళని చంపేయడాలు...
నయీమ్ ఆస్తులు మింగేయడం..
111GO పేరుమీద డ్రోన్ కెమెరా లో పట్టనంత భూమి ఆక్రమించడం
మియాపూర్ భూములు ఆక్రమణ
ఇబ్రహీంపట్నం భూముల ఆక్రమణ
చెరువుల భూములు ఆక్రమణ
బైంసా అల్లర్లలో శిక్షలు పడకపోవడం
హైదరాబాద్ నగరంలో ఒక వర్గానికి చలాన్లు పడకపోవడం ఒక వర్గం టాక్సులు, పిల్లులు కట్టకపోవడం...
ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు బడుగు బలహీన వర్గాల జనానికి న్యాయం జరగక పోవడం.
పోలీసు వ్యవస్థలో అవినీతి తట్టుకోలేక పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం
ఇసుక దందా లో అక్రమాలు హత్యలు ఇసుక లారీలు జనాల్ని తొక్కేయడం
ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన జరగడం ...జరిగిన కొద్ది ఉద్యోగ నియామకాలు "స్వజనులకు" మాత్రమే అవకాశాలు రావడం
కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా మార్చే క్రమంలో రిజర్వేషన్ దామాషాలు పాటించకపోవడం
భూముల కబ్జా లనుండి విద్యాసంస్థల చంపేయడం వరకు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఈ కచరా ప్రభుత్వం
ప్రభుత్వ విద్యా సంస్థలను మూసి వేస్తూ తెరాస ఎమ్మెల్యేలు మంత్రుల విద్యాసంస్థలకు ప్రమోషన్లు ఇవ్వడం
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు నియంత్రించకుండా ... వారికి సహకరించడం
ప్రభుత్వ విద్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్న కూడా ఎటువంటి నిధులు ఇవ్వకుండా భూస్థాపితం చేయడం....
తెలంగాణ ఉద్యమం పేరు మీద అనేకమంది బలిదానాల పునాదులపై అధికారం పొందిన కల్వకుంట్ల కుటుంబం తమ సామ్రాజ్య స్థాపన లో తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరచిపోవడం ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టి అధికారాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అవమానించడం.
తాగుబోతుల జనాన్ని తయారుచేస్తూ గల్లీకో మద్యం షాపు పట్టిస్తూ 90 ఎమ్మెల్ పార్టీ కర్త 90 ఎమ్మెల్ తెలంగాణ గా మార్చే ప్రయత్నాల్లో ఉంది బానిస బతుకులు అలవాటు పడ్డ జనం ఓటు విలువ మర్చిపోయి దొరల తెలంగాణకు దాసోహం అంటున్నారు!!
తెరాస పాలకులు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ కనీసం మూడు తరాల వరకు ఒకే కుటుంబం తెలంగాణను పరిపాలిస్తూ వందకోట్ల ప్రగతి భవన్ ను కల్వకుంట్ల గడీగా మార్చే ఈ ప్రయత్నంలో ఉన్నారు.
పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని అధికారం పొంది కేంద్రం ఇస్తున్న సింగిల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వకుండా తమ కుటుంబానికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్లు కట్టుకున్న కల్వకుంట్ల కుటుంబం!! సిగ్గులేని బానిస పింకీ ఆ సామ్రాజ్యం పాలనకు సామంత బానిసత్వం చేస్తున్నారు.
కులగజ్జి వెల్లగక్కుతూ బానిసత్వం ప్రదర్శిస్తున్న అలాగా జనానికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ తమ కుటుంబానికి- అధికారానికి ఎవరు అడ్డు పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు!! నిజం జనం గ్రహించాలి.
తెరాస నిజంగా అద్భుతాలు చేస్తూ ఉంటే తెలంగాణ జనం ఎందుకు వలస పోతున్నారు తెలంగాణాలో ఉద్యోగాల్లేక అవకాశాలు లేక వలస వెళ్లి పోతున్న జనానికి పింకీలు చెప్పే సమాధానం ఏమిటి?
తెరాస నుండి తెలంగాణకు వీసమెత్తు మేలు జరగదు
తెలంగాణా తస్మాత్ జాగ్రత్త
#Telangana
#TRSFailedTelangana
#TRSPARTYONLINE ఈమధ్య పింకీ పేజీలు లెస్స లొల్లి చేస్తున్నాయి... బహుశా ఫైనాన్స్ ఇయర్ ఎండ్ టాక్స్ క్లియరెన్స్ డబ్బు మళ్లింపు ల కారణంగా గొంతు పెరిగింది అనుకుంటా...