శివ శివ అనడానికి తరతరాలు గా శిస్తు కట్టే కర్మ నా హైందవ సమాజానికి ఎందుకు పట్టింది?
నాడు పరాయి పాలనలో జిజియ పన్ను కట్టిన హైందవ సమాజం తర్వాత ఆంగ్లేయుల పాలనలో దోపిడీకి గురైన హైందవ దేవాలయాలు నేటికీ ఆ తొత్తులు చేసిన చట్టాల కారణంగా నేటికీ దోపిడీకి గురి అవుతున్నాయి ....పాలకులు మనవాళ్ళే అయినా దేవాలయాల పై దోపిడీ మారలేదే!
నేడు కూడా "దేవాదాయ" శాఖ పేరుతో దైవ భక్తి కి కూడా పన్ను వసూలు చేస్తున్న హైందవ శతృ ప్రభుత్వాల ఆటలకు అంతు లేద?
ప్రపంచం మొత్తం లో దైవ దర్శనం మీద .... దైవ కార్యాల పై ఖర్చు కు పన్ను వసూలు చేసే నీచాతి నీచ ప్రభుత్వాలు నా దేశం లోనె ఎందుకున్నయి?
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ ఉండేవు రామ చంద్ర అని ఒక భక్తుడు అంటే శరానికి ఒక్క రాత్రి లో అప్పు మొత్తం మొహాన కొట్టిన నా రామున్ని మొక్కుటకు నా పేద హైందవ సమాజం శిస్తు ఎందుకు కట్టాలి?
గుళ్ళు కూలకుండా చర్యలు తీసుకుంటున్నరా ... నిత్యకార్యాలకి డబ్బు ఇస్తున్నార... లేదే ప్రతి గుడిని సిమెంటు దిబ్బలుగా మారుస్తూ మరిన్ని రూములు మరింత భక్తులు మరింత డబ్బు అని విర్ర వీగుతున్న పాలకుల ఆశకి అంతు లేదా .... దేవాలయాలు విడిది గదుల మద్యలో కుంగుతుంటే మరుగు నీటి కంపు భూగర్భం లో నిండి గుడి అడుగు భాగాలు కృంగుతుంటే ఈ పాలకుల డబ్బు ఆశ నశించదా .... ప్రభుత్వం పేరుతో జరుగితున్న అరాచకాలకు అంతు లేదా?
ఉండదు ఎందుకంటే మనిషి స్వార్థం తో నిండి కుళ్ళిపోతుంటే మార్పు అసాద్యం.
ఈ పిరికి సమాజం నశించి కుళ్ళి పోతె అప్పుడు వచ్చే కొత్త సమజం అన్నా జవసత్వాలు కలిగి ఉంటుందేమో!
బానిస బ్రతుకుల .... బ్రతుకులు బ్రతుకంతా బ్రతుకీడ్చటానికే.