Thursday, 31 January 2013

కులం

చాతుర్-వర్ణ విధానం లో శూద్రులను తక్కువ చూపారు అని తెగ విమర్శిస్తారు చాలా మంది.
మనుస్మృతి లో విష్ణువు భుజాల నుండి క్షత్రీయులు,తల నుండి బ్రాహ్మణులు తొడలనుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు పుట్టారు అంటారు కదా...ఇందులో తప్పేముంది?అసలు మన దేశాన్ని విడదీయాలని పొరుగు దేశస్తులు  ఈ విధానం లో తక్కువలు ఎక్కువలు శృష్టించారు ,ఇందులో ఎక్కువ తక్కువ అనుకోవడానికి  లేదు, ఎందుకంటే
" మనం గుడికి వెళ్తే దేవుడి తల పట్టుకుని మొక్కం భుజాలు తడిమి మొక్కం పాదాలు తాకుతాం దేవుణ్ణి మొక్కడం అంటే వంగి-పాదాలు తాకడం" అంటే ఇక్కడ శూద్రున్ని మొక్కుతున్నాం గాని క్షత్రీయున్ని కాదే ?.
మరి చిల్లరగా ఈ తెడాలేంటి.

అసలు రిజర్వేషన్లు ఇచ్చింది అభివృద్దికి గాని మన దేశ  జనాభాని మన సంస్కృతిని చంపుకోవడానికి కాదే!మరి ఈ కులాలకి "కొలతలిచ్చి" వాటిని ఓట్ల సమూహం గా  చూడడం ఎందుకు?.

తప్పు రిజర్వేశాన్లది కాదు- మతానిది కాదు ......................మనిషి ఆశది.

ఈ ఆశ అనేది ఎంత దరిద్రపు గొట్టు పనులనైనా చేయిస్తుంది అందుకే  మన వేదాలు ఎప్పుడు ఘోషిస్తాయి నీలోనికి చూడు నిన్ను గుర్తించు అప్పుడు ఈ ఆశల నుండి  దూరంగా దైవం వైపు నీ ప్రయాణం మొదలౌతుంది అని వింటామా లేదు నాకు ఇది కావాలి అదికావాలి   పిచ్చి పరుగులు  తీస్తాం! 

కులం అనేది జన్మతః వస్తుంది  అది నీకు  ఒక కళ ని కూడా  ఇస్తుంది మీరు ఒకసారి గమనించినట్లయితే... ప్రతి కులం లో ఒక కళ ఉంటుంది .....కుమ్మరి ,కమ్మరి,మంగలి (విదేశాల్లో కేశాలంకారణ కి మాంచి డిమాండ్ ఉంటుంది ) ఒక కళాకారుడు  తన తండ్రి ద్వారా తాత ద్వారా కళని పొందుతాడు తరతరాలు గా కళలో జీవనాధారం వెతుక్కుని జీవిస్తారు!

"వేరే మతాలల్లో కులాలు లేవు అనేది గొప్ప విషయం కాదు" ...అది వారి దూరదృష్టి  లోపం అరె ఇంత  గొప్పగా జీవనాధారం ఇచ్చే ఈ కులం - కులవృత్తి కాన్సెప్ట్ కి కూడా మన వాళ్ళు వక్ర భాష్యాలు ఇచ్చి దుర్వినియోగం చేసుకుంటా రేమిటో  అర్థం కాదు!.

మంగలి వాడు ప్రపంచంలో ఏ దేశం లోనైనా   కులవృత్తి చేసుకుని బ్రతకగలడు   అలాగే కమ్మరి, చెప్పులు కుట్టేవాడు ...ఇలా ఎవరైనా  ఆర్ధిక మాంద్యం  తో పని  లేకుండా హాయిగా బతక గలరు!.

"కులవృత్తి మరవకురా గువ్వల చెన్నా!" 

ఇదొక మాంచి నానుడి కాని మనిషి కులవృత్తి లొ లేని లోపాలని వెతికి చిన్న చూపుతో  వాటికి దూరం అయ్యి సంఖనాకి పోతున్నాడు మాంచి కళ గల కమ్మరులు లేక నేడు ఏంతో  మంది ఇష్టం లేకున్నా రెడీ మెడ్ నగల తో అడ్జస్ట్ అవుతున్నారు.

విదేశాలలో ఈ ప్రత్యామ్నాయ విధానం లేక ఎవడు ఎం చేస్తాడో తెలియక ప్రతి పదేళ్లకోసారి ఆర్ధిక మాంద్యానికి కారకులవుతున్నారు! అంతే  గాని మన దగ్గర ఉన్నట్లు వీడు దీనికి బాగా పనికొస్తాడు అని ,వీడికి ఈ పనిలో ప్రావీణ్యం ఉంది అని లేదు.
అంటే  మన పూర్వీకులు మన కులం లో ఒక కళ ని ఇన్-స్టాల్  చేశారు అన్నమాట!.  

అసలు మనిషి ని తక్కువ చూడ్డం  అనే కాన్సెప్ట్ మంచిది కాదు , దానికి కులం అనేది కొలతకాదు, కలిమి-లేమి అనే వాటి కారణంగా ప్రతీ మతం లో ప్రతీ దేశంలో ఉండేవే అంత  మాటకి వస్తే మన హిందుత్వం లో కులం ద్వారా కళ- కళా కారులని గౌరవించాలి అనే మాట ద్వారా ప్రతి మనిషి గౌరవిన్చాబడుతాడు దానికి కలిమి లేములు బేస్ కాదు.
ఉదా:మన పూర్వీకులు "మాంచి పనితనం ఉన్నోడు " అని తక్కువ కులస్తులకి కూడా మర్యాద ఇచ్చి న సంఘటనలు చాలా ఉంటాయి. ఈ పని తనం ఎక్కడినుండి వస్తుంది కులం నుండే గదా!.
నేటి తిక్క భారతీయుడు అనుకున్నట్టు గా కులరహిత సమాజం ఒక కళని మనిషికి ఇవ్వలేక పోయింది,డబ్బు ఉంటె మర్యాద లేకుంటే లేదు అనే స్థితి వచ్చింది. అదే డబ్బు లేకున్నా పనితనం ఉన్న వాడు అని మర్యాదగా చూస్తున్నారా  పనితనం ఉన్నావానికి మర్యాద దొరక్కపోతే వాడు పనిచేయడని వాడి తో కాస్త మర్యాదగానే వ్యవహరిస్తారు.
ఇక ఆస్తులు ఎదుగుదల...అంటే చేసే పనిని ఎంత విభిన్నంగా చేస్తావు అనే దాని తో నీ ఎదుగుదల ఉంటుంది ఉదా:నిక్ షూ  ల కంపనీ ఒక శూద్రుడు (చెప్పులు కుట్టే వాడు) పెట్టి ఎదిగితే బాగానే ఉంటుంది కదా నీ ప్రోడక్ట్ ని నువ్వు ఎలా ప్రమోట్ చేస్తావు అనేది నీ తెలివి తేటలని బట్టి ఉంటుంది కాని కులం అడ్డుకోదు  గదా!.


ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ కులాల కంపు ఎన్నికల ముందే లేస్తుంది మళ్ళీ 5 ఎళ్ళ వరకు బాగానే ఉంటుంది మరో 10-11 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అంటే ..కులం కంపు లేవ్వనుంది!!!!!!!.

Wednesday, 30 January 2013

బ్రతుకు

ఆత్మహత్య చేసుకునే ధైర్యం లో సగం బతకటానికి ఉంటే  జీవితానికి చుక్కలు చూపించొచ్చు!------->క్లాస్ గా ఉండే డైలాగ్.
చచ్చేంత ధైర్యం ఉంటే .... దాంట్లో సగం బతకటానికి చూపించు.....జీవితానికి ఉచ్చ పోయించవచ్చు!----->మాస్ డైలాగ్.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే చచ్చెంత, ధైర్యము లేక బ్రతికేంత పట్టుదల లేక....నలిగి పోతూ ఉండే కన్నా బాగా ఆలోచించి ఫుల్లో - హాఫో ధైర్యం అరువు తెచ్చుకోవటం మేలు!...ఎక్కడంటార? ఏమో వెతకండి వెతికితే దొరుకుతుంది కదా ఈ లోకం లో!!!

Tuesday, 29 January 2013

మనిషి

మనిషిని మనిషి గా చూసేదెందరో! ఎందుకంటే సినీ తారాలకి అందరు మనుషులు అబిమానులుగా,ఫాల్లోవర్లు  గా ,ఈ మధ్య భక్తులుగా కనిపిస్తారు,క్ రికెటర్లకు అంతా - అభిమానులుగా వారి బ్రాండ్లు కొనే వినియోగదారులుగా కనిపిస్తారు!.
రాజకీయనాయకులకి ఓటర్లుగా కనిపిస్తారు కొందరు నాయకులకి (నారయణ దత్  తివారి లాంటి వారికన్నమాట....ఈయన చాలా ఎన్నికలలో కాంగిరేసును ఒంటి చేత్తో గెలిపించారు మరి!!!!)బానిసలుగా కూడా కనిపిస్తారు!.
ఇహ వ్యాపారస్తులకి కేవలం వినియోగాదారులుగానే కనిపిస్తారు అందుకే కొనక చస్తావా?అంటూ విదేశీ బ్రాండ్ల ని తెగ దింపుతున్నారు!
ఇలా అందరికి మనుషులు అవసరం లానో ,డబ్బు లానో కనిపిస్తారు-చూస్తారు తప్ప మనిషిని మనిషిగా చూసేదేప్పుడు?ఈ మద్య రీసోర్స్ గా కూడా చూస్తున్నార్ట! ఏంటో లోకం అర్థం కావటం లేదు!!!!!.

Friday, 25 January 2013

సంస్కృతి

ఆస్తులివ్వలేదని అమ్మ-నాన్నలని ,మార్కులివ్వలేదని ఉపాద్యాయులను ...మారుస్తూ పొతే సంఖనాకిపోతావ్ రేయ్ ....
బ్రతకటానికి జీవితాన్ని ఇచ్చి , స్వేచ్చని ఇచ్చిన స్వధర్మాన్ని వదిలి పరధర్మం పంచన చేరే ఎదవళ్ళారా...ఆశ కి అంతులేదని, అవసరాలవెంట పరిగెత్తితే దొరికేది అలసట మాత్రమె నని గ్రహించండి ......!!
బాధలు కష్టాలు ఎదురవ్వని ప్రాణం ఉండదు వాటిని ఎదుర్కోవడం ఒక్కటే మార్గం అలా  కాదని టాయిలెట్ క్లీనర్లని నమ్మి మీరు పాపులు, మీరు నీచులు అంటే నమ్మితే.....అలానే అయిపోతారు ! మనకు పుట్టుకతో వచ్చిన మన సంస్కృతి ని పాటిస్తే అది ఉత్తమమైన మార్గం.
కనుక మతం మారి పోతె అన్ని పోతాయి అంటే .....పోతాయి  నీవి అనదగ్గ నీ అస్తిత్త్వాలు పోతాయి కాని దరిద్రాలు కాదు.నీ ఇతిహాస ధర్మాలు పరిశీలిస్తే దొరికే సమాధానాలతో ఎన్ని  సమస్యలనైనా ఎదుర్కోగలవు...తెలుసుకోతెలుసుకుని మసలుకో!!!!

గమనిక:ఇక్కడ స్వధర్మం అన్నాను...అనగా పుట్టుకతో,జన్మస్థలం తో లభించేది గాని నేను ఎక్కడా హిందుత్వం అని వాడలేదు!!!.అనగా "be a rome-in-rome"అన్న మాట.

సంస్కృతి

నాది అనుకున్న సంస్కృతి నశిస్తోంది అని ఎవరో అంటుటే కలవరపడ్డాను కాని నాకుఎదురుగా వస్తున్నా పీర్ల పండగని చూసి మురిసిపోయా ఎందుకంటే నాది అని అనాదిగా గుహల్లొఅ చిత్రీకరించుకుని, గుళ్ళు కట్టి ఆరాదించిన  విగ్రహారాధన ఇంకా పోలేదని,పైగా అది పరమతం లో  ఇమిడిపోయి విలసిల్లుతోంది అని!

అరె.... బానిసత్వం తో పాటుగా అంటించిన పాపులమనే తత్త్వం - మూడత్వం కలవరపెడుతోంటే అప్పుడే అంతా కలిసి చేసుకుంటున్న ఆరోగ్యమాత  ఉత్సవాలు చూసి మళ్ళీ నాదే గెలిచినిది అనుకున్నా...సేవ పేరులో చేసిన మోసం ఎన్నో ఏళ్ళు దాగదని తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం  నా సంస్కృతికి బాగా తెలుసనీ అందుకే ఇన్నెళ్ళైనా అలా  నెగ్గుకొస్తూనే  ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నా!.

అసలు ఎవరన్నారండి ఈ దేశం లో సంస్కృతి  కి ఆపద వచ్చింది అని,జిజియా పన్ను పేరు తో రక్తాన్ని ధనరూపం లో తాగిన శతాబ్దాల రాచరిక దాస్యం నుండి విముక్తిని పొంది సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం  తో పోరాడి చివరికి స్వాతంత్ర్యం సాదించి సగర్వంగా నిలిచిన భూమి ఇది!
పోరాడి పోరాడి పోరాటం నాలో నిండింది కనుక ఈ అవినీతి నల్ల జీవులు ఆ తెల్ల(ఇటలీ ) జీవులతో కలిసి  చేసే అరాచాకాలని కూడా పోరాటం తోనే కడిగేస్తాం...కాని ఈ పోరాటం వోటు తో చేసేది ..!

"అసలు దొంగలెవరు  దోచుకోలేనిది విద్య" అనేది సత్యం అయితే లార్డ్ మెకాలే గారు విశ్వా ప్రయత్నం చేసినా మన రక్తం నుండి తొలగిపోనిది జ్ఞానమే కదా..అదే జ్ఞానం తో ప్రపంచాన్ని నడుపుతున్నాం ....శాంతి ని సహనాన్ని చేతకానితనం అనుకుంటే అది అనుకునే వాని పొరబాటు కాని మంది కాదు కదా...!

మీరు పాపులు,పాపపు మరకలు మేం  క్లీన్ చేస్తాం అంటూ వచ్చే టాయిలెట్ క్లీనర్లకి సమాధానం ఇస్తూ తర తరానికి ఒక జ్ఞాన జ్యోతి ఈ గడ్డ మీద నిరంతరం వెలుగుతూనే ఉంది.ఒక రామకృష్ణ పరమ హంస, స్వామీ వివేకానంద ,ఒక రవి శంకర్ ,ఒక జిడ్డు కృష్ణ మూర్తి ....ఒక రమణ మహర్షి ...నేటికీ చాలా మంది తత్వ విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూనే ఉన్నారు,శాస్త్ర విజ్ఞానం లో తిరుగు లేని విదంగా రాణించే విద్యా కుసుమాలు విరబూస్తూనే ఉన్నాయి!అవార్డు లే జ్ఞానానికి ప్రమాణం అనుకుంటే పొరబాటే అవుతుంది ఎందు కంటే ఉత్తర కొరియా లో పని చేసే శాస్త్రవేత్తలకి అమెరికా అవార్డులివ్వడు  కదా!అలానే మన వ్యవస్థ కూడా.

కాని మన రక్తం లో 1000 ఏళ్ళు గా నింపిన దాస్యాన్ని కడాగాల్సిన అవసరం ఉంది నీవు సింహానివి...జగద్గురువు అయిన భారతీయ జ్ఞాన జ్యోతివి బానిసవు కాదు.అని  చైతన్యాన్ని   దీపాన్ని దేశం  నలుమూలలా ప్రకాశింపచేయవలసిన ఆవసరం ఉంది. 
ఏంటో పచ్చకామెర్ల వాడికి అంటా పచ్చగా నెఅ కనబడుతుంది అన్నట్లు నా కు అంటా బాగానే కనబడుతోంది అంతా  హిందూస్తాన్ లో హిందుత్వమే కనపడుతోంది ..ఎవరు  మతం తెచ్చినా అది   "HINDIVAISATION "(అదేనండి! INDIANAISATION ).

చివరాకర్ణ..................... "హిందువుగా జీవించు హిందువునని గర్వించు."

Thursday, 24 January 2013

పేరడీ


ఓటర్ - మహెష్ బాబు అయ్యి,కాంగ్రేస్ - ఇలియన అయ్యి పోకిరి లో ఉప్మా సీన్ కి పేరడీ ఇలా ఉంటే....

ఓటర్(మహెష్ బాబు) :5ఏళ్ళ కోసారి వస్తారు...చేతి చూయించి పడగొడతారు అధికారం చేజిక్కించుకొని,ఉడాయిస్తారు ఎప్పుడైనా అధికారం రుచి చూపించారా?ఓ....ఫ్యామిలీ ఫ్యామిలీ అధికారం తినే బతికేస్తారే..!అరె పాపం ఓటర్ నమ్మి ఇది ఇచ్చాడు కాస్త వాడి బాగు చూద్దాం అని ఎప్పుడైనా అనుకున్నారా?
లేదు...మళ్ళే దాని టేస్ట్ అడిగితే విషం, చేదు అంటారు!అరె మీరంతా చేసే కష్టం దాని కోసమే గదా!జిమ్మిక్కులు, ఎత్తులు,పొత్తులు.

ఇలియనా(కాంగీ):అదేం లేదు మేమూ చాలా టెన్షన్స్ అనుభవిస్తాం  మీకేం తెలుసు మా కష్టాలు!

ఓటర్(మహెష్ బాబు):ఆ..ఏముంటాయి  మీ కష్టలు మా డబ్బు దొబ్బి ఏ బ్యాంకులో దాచాలి కొత్త స్కాముకు ఏం పెరుపెట్టాఅలి అనే కదా!...2జి,కామవెల్త్,...ఇలా వెతికి వెతికి ఎన్నికలంటేనే విసుగొచ్చేలా చేశారు.

ఇలియనా(కాంగీ):మేమేనా పాలించింది దేశం లో ఎన్ని లోకల్ పార్టీలు లేవు?

ఓటర్(మహెష్ బాబు):ఆ ఉన్నాయి...అన్నీ  మీవే ఎన్.సి.పి,టి.ఎం.సి,ఎస్.పి బి.ఎస్.పి,అని ఎన్నికల ముందు ఒక ముఖం,ఎన్నికల తర్వాత మీ ముఖం మధ్యలో ఓట్లు వేసి మేం ఎదవలమైతాము ఇక్కడ,అరె 65 ఏళ్ళల్లో 55ఏళ్ళకు పైగా మీదేగా...అందులో మళ్ళీ 17+15+6+10 ఒకే ఫ్యమిలీ వి..అరే గోడకు బల్లి అతుక్కున్నట్టు అలా అధికారం కే అతుక్కుంటే మా జనం బాదలు తెలిసేదెలా.....ప్రతీ ఎన్నికలకు వస్తారు,మా బలహీనతలను పసిగట్టి మీకు కలిసొచ్చే విషయాలను ఎక్స్-పోసింగ్ చేస్తారు(గాంధీ,ఇందిరా.నెహ్రూ-గాంధీ అని!)మేం పడిపోతాం,ఇహ మీ దంచుడు మొదలెడతారు!!!!


వస్తుంది మాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు రోజులు మారాయి అని "మనుషులు మారాలి "సినిమా మీకు చూపిస్తాం!.(మనుషులు మారాలి  సినిమా బాగుంటుంది వీలైతే చూడండి అది చూస్తే ఎలాంటి వారికి అయినా ఏడుపొస్తది!).

Sunday, 20 January 2013

అసలు మన నోట్ల మీద గాంధీజీ బొమ్మ మాత్రమె అర్హమైనది ఎందుకంటే ఆయన మాత్రమే మనిషి డబ్బు కోసం చేసే తుచ్చమైన పనులని ఓర్పు సహనం తో క్షమించగలడు ,ఆయన చెప్పిన సహనానికి పరీక్ష పెడుతూ మనిషి చేసే తప్పులు పోటీ పడుతున్నాయి.
డబ్బు మీద గాంధి బొమ్మ స్వచ్చమైన చిరునవ్వుతో ఉంటుంది,అది చూసయినా  ఆఖరి నిమిషం లోనైనా మనిషి తను డబ్బుకోసం చేసే తప్పుడు పనులని అపుతాదేమో నని ఆశ.కానీ మనిషి మారడు గదా !
గాంధీజీ ని కాకుండా మరెవరినైనా నోటు మీద ప్రింట్ చేస్తే వారి ఆత్మా ఘోషిస్తుంది!ఈ  సొమ్ము కోసం మనిషి చేసే నీచాతి నీచమైన కృత్యాలు చూడలేక వారు మళ్ళీ మళ్ళీ చస్తూంటారు.భగత్ సింగ్ ,సుభాష్ చంద్రబోస్ ,అంబేద్కర్ లాంటి వారి చిత్రం నోటు మీద ఉంటె అది వారికి అవమానం  తో సమానం ....ఎందుకంటే వారు ఈ నోటు పాల్గొనే నీచమైన పనులను చూసి తట్టుకోలేరు!
గాంధీజీ హృదయం విశాలమైనది,కనుక తను ఖచ్చితంగా క్షమిస్తాడు!అందుకే గాంధిజీ చిత్రమే సరైనడి.

చాల మంది నోట్ల మీద వేరు వేరు వ్యక్తుల బొమ్మలుండాలి అని వాదిస్తుంటారు!అది తప్పు అని నా అభిప్రాయం.

Wednesday, 2 January 2013

నా జీవిత ప్రయాణం లో నేను తప్పు బస్సు ఎక్కాను,నా దారి మరిచాను ....కాని నా గమ్యం గుర్తుంది అందుకే ఈ బస్ దిగాలనుకుంటున్నాను  కాని దిగి ఏ  బస్ ఎక్కాలో తెలియదు,ఎక్కడ దిగాలో తెలియదు......ఎంత కాలమో ఈ తెలియని దారి లో ప్రయాణించడం ..............నా గమ్యాన్ని చేరుకోవడం  ఎలానో?