Monday, 27 January 2025

పుష్ప - పుష్ప2

 సూర్య సన్ ఆఫ్ ఇండియా అని ఒక మంచి సినిమా .... మంచి పాత్ర ... మంచి సందేశం తో సినిమా తీస్తే ..... ఫ్లాప్ చేశారు 

ఆనాడు ఎవరూ మద్దతుగా నిలవలేదు .... మంచి కథ ..మంచి సినిమా  అని చూడండి అని ప్రచారం చేయలేదు.

కాని పుష్ప అని .... ఒక గుర్తింపుకోసం సామాన్యుడు చేసిన అసాధారణ ప్రయాణాన్ని సినిమా తీస్తే .... జనాలకు నచ్చి చూస్తే ... ఒకటే ఏడుపు !! 

ఎఱ్రచందనం దుంగల దొంగ కథ .... దొంగను హీరోగా చూపిస్తారా అని ఏడుపు .... జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అని మొరగడం !! 

నాయకుడు అనే కమల్ హాసన్ సినిమాకు ...కమల్ నటనకు జాతీయ అవార్డు ఇచ్చారు .... ఆనాడు ఎవరూ ఏమీ అనలేదు .... నాయకుడు సినిమా ఒక రౌడీ కథ .... 2 రాష్ట్రాల మధ్య గొడవలకు మూలమైన వ్యక్తి కథ .... మరి అవార్డు ఇచ్చారు ...

పుష్ప పైన గరికపాటి నుండి IPS ల వరకు నోరు పారేసుకున్నారు !!

"అవినీతిపరులకు డబ్బులు దొరుకుతాయి కానీ గౌరవం దొరకదు" అని పుష్ప పాత్ర స్పష్టం చేస్తుంది అయినా కూడా కొందరు ఐపీఎస్ లు పుష్పాపై పగ పట్టారు ...అది వాస్తవ స్థితిగతులకు దర్పణం పడుతుంది!!

జనాలు... సమాజం దొగ్లాపన్.....లో దొర్లాడుతోంది.