Friday, 19 July 2013

ఎన్నికల పరీక్ష

ఊరికె తమాషాకి.... 
ఎలెక్షన్ కమిషన్ ఒక రూల్ తెచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఒక ఎక్సాం రాయాలి అంటే మన రాష్ట్రం లొని పార్టీలు వాటి అభ్యర్ర్థుల తీరు ఊహించి....
టి.డి.పి... : భార్య నామినేషన్ వెస్స్స్తుంది భర్త ఎక్సాం రాస్తాడు.(అన్న ఎంటీ ఆర్ పార్టీ పెట్టాక అన్న కంటే ఎక్కువ పాలించిన ఘనత అల్లుడిది కనుక!).

ప్రా రా.పా: ఎక్సాం పేపెర్ ఇచ్చాక సేఫ్టీ కోసం కాంగ్రేస్ పక్కన కూచుంటాడు. 

సి.పి.ఎం / సి.పి.ఐ: వీళ్ళు ఒక్క పేపెర్ లోనే ఎక్సాం రాస్తాము అని ఒకరు ముందునుంచి ... మరొకరు వెనకనుంచి మొదలెట్టి మధ్యలోకొచ్చాక లాక్కునీ పీక్కునీ సమయం అయిపోగొడతారు. (పేపర్ చినిగే అవకాశాలు ఎక్కువ!).

ఎం.ఐ.ఎం: ఒకటే పేపార్ లొ రాస్తారు రాసిన పేపర్ వాళ్ళే తీసుకుపోతారు ఎవ్వరూ ఎమని అడగారు... ఇన్విసిలేటార్ ఎంటని అడ్దిగితే బుర్ర పగలగొడతా అంటారు(గుర్తుందా y.s.R హాయాం లో హెల్మెT తప్పనిసరి అని రూల్ చేస్తే అక్బరుద్దీన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు "ఎవడన్నా హెల్మెత్ అడిగితే తల పగలకొట్టండీ నే చూస్కుంటా అని... దన్న్ని బట్టీ.").

భా.జా.పా: పపం వీళ్ళు అడిష్నల్ మీద అడ్దిష్నల్లు తీసుకుని బాగానే సబ్జెక్ట్ రాస్తారు కానీ జె.ఎన్.టి.యు పేపర్ లాగా స్పెక్ట్రాం కంటెంట్ ఉండదు అంతా టెక్స్ట్బుక్ నాలెడ్జ్ రాసి మార్కులు పోగొట్టుకుంటారు.

ఖాంగ్రెస్స్(నా ఫవరెట్): వీళ్ళు పేపర్ ని కిటికీ లోంచి బయటికి పంపి వెరే వారితో(ముఖ్యంగా భా.జా.పా వారితో ) రాయించి ఆ రాయించిన దాన్ని మార్చి ఇన్విసిలేటర్ కి ఇచ్చెముందు ఒక సాఅరి అమ్మకి (మేడం కి ) చూపిచ్చి సబ్మిట్ చేస్తారు.

టీ.ఆర్.ఎస్: వీళ్ళు ఎక్సాం రాయటానికి ఒక జే ఏ. సీ పెడతారు అందులో మళ్ళీ కార్మిక... జే.ఏ.సి, సింగరేణి జే.ఏ.సి....ఆర్.టీ.సి జే.ఏ.సి... ఉద్యోగ సంఘాల జే.ఏ.సీ. విద్యార్తి సాంఘాల జే.ఏసీ... రాజకీయ జే.ఏ.సి అని జే.ఏ.సి లక్యూ తయారయ్యక ఇటు గుంజీ అటు గుంజీ ఎక్సాం డేట్ మర్చిపోయి రాయలేఅక పోయినందుకు పక్క పార్టీ వాఅరి మీద కోపం చూపిస్తారు!.

లోక్సత్త : ఇది అల్టిమేట్ భయ్యా.... ఒద్దికగా కూర్చుని ఎక్సాం లో ఇచ్చిన ప్రశ్నా పత్రం చూసి అడిష్నల్ మీద అడిష్నల్ తీసుకుని ఒక బుక్కే రాసి పడేస్తారు, ఎమన్నా అంటే ప్రశ్నలకి తగ్గ సబ్జెక్ట్ పుస్తకాల్లో లేదనీ మేమే చక్కటి విషయాలని రాస్తామనీ చెప్పి పేపర్ ఇచ్చి వెల్తారు ఆఖరికి ఆ దిద్దే వాడికి ఆ బుక్కు చదివె ఓపిక లేక ఆర్థం చేసుకునే ఙానం లేక పక్కన పెట్టేసి లోక్సాత్తా నmబెర్ రెసుల్ట్ పేపార్ లో లేకుండా చేస్తాడు.
ఇక రెసుల్ట్ ముందు అంతా ఎదురుచూస్తుంటే కాంగ్రేసు వారు మాత్రం.... papers దిద్దే చొట వెల్లి లంచాలు ఇచీ భయపెట్టో వారికి మంచి మార్కులు వచ్చేలా సెట్ చ్చ్చేస్సుకుంటారు(p.chidambaram 2009 ఎన్నికల్లో అక్రమంగా గెలిచాడు అనే కేసు ఇప్పటికీ కోర్టులో నానుతుంది!).

ఈ స్టోరీ మరెక్కడన్న కనిపిస్తే ఆ లింకు కామెంట్ లో ఇవ్వాగలర్రు choosiఆనందిస్తా!

Monday, 15 July 2013

సున్నా పుట్టుక

హైందవ సంస్కృతి, మానవ సమాజానికి దిశానిర్దేశంగా ఉండటానికి 4 వేదాలు ఇచ్చింది. మనిషికి అవి అర్దం 

కాలేదు .... సరే 4 వేదాలు తేలికగా అర్థం కావడానికి 6 వేదాంగాలని ఇచ్చింది మన హైందవ 

సంస్కృతి......అయినా అర్దం కాలేదు, సరే మట్టి బుర్రలు అనుకుని 16 ఉపనిషత్తులని ఇచ్చింది....... క్రతువుల 

గురించి సమూలమైన వివరణ తో కూడిన ఈ ఉపనిషత్తులు కూడా మనిషికి ఎక్కలేదు..... ఇలా కాదని 18 

పురాణాలు ఇచ్చింది..... ప్రకృతి లక్షణాల కాన్నుంచి వేద సారాన్ని నిజ జీవితం లో ఎలా పాటించాలొ 

తెలియడానికి కధలు కథలు గా వివరించింది... అయినా మనిషి మారలేదు వాటిని అర్థం చేసుకోలేదు... 

పాటించలేదు.

మరీ 18 అయితే ఎక్కువ అయాయి అనుకుని ...ఇలా కాదని రివర్స్ లో 2 ఇతిహాసాలిచ్చి మనుషుల ద్వారా 

చెపితే అర్త్దం అవుతుందని సీతారాములు.... ... భరత, శతౄఘ్న, లక్ష్మణ ... అనే మనుషులు వేద సారాన్ని 

చక్కగా పాటించి దేవతలు గా ఎలా మారారో రామాయణం ద్వారా .... భీష్ముడు, ధర్మరాజు, భీముడు,అర్జునుడు, 

నకుల సహదేవులు... శ్రీ కృష్ణుడు అని మహాభారతం ద్వారా మనిషి ఉన్నతంగా జీవించి సార్థకత ఎలా 

సాధించవచ్చో చెప్పింది.


ఊహూ ..... ఈ సారీ అర్థం  చేసుకోక అదే తీరు అదే అరిశడ్వర్గాలతో యుద్ధం  .... సరె ఒక్కటి  ఇస్తే 

సులువుగా అర్థం చేసుకు జీవితాన్ని సఫలం చేసుకుంటాడు .... అని ఈ సారి కన్ఫ్యూషన్ ఉండొద్దని 

శ్రీమద్భగవద్గీతా ఇచ్చింది మన హైందవ సంస్కృతి...... షరా మామూలే బాగా బలిసి మనిషి ఈ భగవద్గీతని 

కూడా అర్థం చేసుకోలేదు ... ఒకాటే అయినా సరళంగా ఉన్నా అరిశడ్వర్గాలు  ఆక్రమించిన 

కారణంగా గీతా సారం కూడా తెలియలెదు.

ఈ సారి చిరాకు వేసి మీ మనుషులు ఒట్టి వెధవలొయ్!(కన్యాశుల్కం గిరీశం లెవెల్లో!-వెధవలమే మరీ!) అని 

శూన్యం చూపించింది.... అంటే సున్నా ఇచ్చింది.

ఇదిగో ఈ సున్నాని పట్టుకుని మనిషి రకరకాలుగా వాడటం మొదలెట్టి ఈ డిజిటల్ ప్రపంచాన్ని శృష్టించాడు.... 

అత్యంత సరళమైన మానవ జీవితాన్ని సాఫీగా బతకమని భారత సంస్కృతి 4.....16....18....2.....1....0 అని 

సరళీకరిస్తే బాగా మతితప్పి కాంప్లెక్స్ ప్రపంచాన్ని మనిషి సృష్టించాడు!. 

ఇది దారుణం కదా!.

Friday, 12 July 2013

పాఠశాల కాస్తా స్కూల్ అవుతుంది!.

జీవితం అనే సముద్రం లో అభివృద్ధి అనే  అలల తాకిడికి జ్ఞాపకం అనే ఓడ కొట్టుకుపోయింది ..... చెల్లా చెదురై .... కనుమరుగయ్యింది!.
మరేం లేదు .... మా ఊరిలో ప్రాథమిక పాఠశాల కూలగొట్టి కొత్తది కట్టడం మొదలుపెట్టారు  .... నేను అ ఆ ... ల నుండి 5 వ తరగతి వరకు ఆ పాఠశాలలో చదివాను ఆ బడి నేడు గతం లో  కలిసింది జ్ఞాపకం కాస్తా గతం అయింది .... ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

అప్పట్లో ఆ గేటు ఉప ద్వారం లోంచి వెళ్తూ ఎగిరి పైన కొట్టడం టార్గెట్ ఇప్పుడు మోకాలు వంచి మెడ వంచి దాటాలి .... అంతే  గదా మరి 3 ఫీట్ల నుండి 6 ఫీట్ల కి పెరిగే సరికి .... దాన్ని కూలగొట్టారు :( .
 కింది చిత్రంలోనిది పీర్ల కొట్టం ..... మొహర్రం పండగ అప్పుడు మాత్రమె, మిగతా రోజుల్లో 1 వ తరగతి గది!.

ఈ కింది చిత్రం లోని...   పెద్ద వేప చెట్టు  పురాతనమైనది ,  6 సంవత్సరాలు ఆ నీడలో...  ఆ గాలికి ఆడుకున్నాం నేడు కూలగొడతారేమో!??
 ఈ కింది చిత్రం లో ఉన్న పిల్లల లాగానే మేమూ కూచుని పలక తో కుస్తీ పట్టేవాళ్ళము :) .
వ్యాఖ్యను జోడించు

అసలు నా అనుమానం ఏంటంటే ఆ భవనం బాగానే ఉంది కానీ కొంత మంది రాజకీయం కోసం .... కొందరు కమీషన్ కోసం కలిసి కొత్త భవనం కావాలి అని ఈ పని చేశారు అని.  ఏదైతేనేమి .....ఉన్న ఆ కాస్త గ్రౌండ్ పోయి అచ్చం సిటీ లో ఉండే ఇరుకు స్కూలు అవుతున్ది. 

అంటే పాఠశాల కాస్తా స్కూల్ అవుతుంది!. 

Wednesday, 3 July 2013

ఎన్నికల పండగ(అప్పుడెప్పుడో రాసింది సీసన్ అని మళ్ళీ పోస్ట్ చేశా!)

ఎన్నికల పండగ .... ఎలాచ్చన్న్లు ఒస్తున్నాయహొ....!

అవునండి ఈ గ్రామపంచాయతి ఎన్నికలు అంటే మహా ప్రాధాన్యం ఎందుకంటే ఓటు హక్కు ఉండి తాగే అలవాటు  ఉన్న ప్రతోడూ తాగి తందానాలాడొచ్చని.

నిజం ...నిజ్జంగా నిజం 15ఏళ్ల పైబడ్డ వారికి ఈ కాలం లో మందు మహా  తేలికగా- తెరగా దొరుకుతుంది పైగా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్టు గదా ఇక పండగే అన్నమాట!.

నా గతానుభం ద్వారా ఇక్కడ చెప్పగలుగుతున్నాను(అంటే నేను బానిసనని కాదు నా ఫ్రెండ్స్ కొందరు ఇలాంటి సందర్భం లో చెడిపోయారు అలా!) ...కొత్తగా తాగుడు మొదలెట్టే కాలమిది, చాలామంది ఈ కాలం లోనే  మొదటిసారి మందు  ముడుతారు ఇక చూస్కో ఇప్పుడు మొదలెడితే సుమారు చచ్చే దాకా వదలరు ఇప్పుడు పడే బీజం మహత్తరమైనది మరి!!.

కాస్త సీరియస్ గా  రాస్తను....
నిజంగా ఎవరైనా సర్వ్యే  చేస్తే నిప్పులాంటి నిజాలు తెలుస్తాయి ఈ నిప్పులు  అడవిని కాల్చేవి కాదు కొంపలు కాల్చేవి ఇప్పుడు తేరగా వస్తుంది కదా అని అలవాటు లేని వాళ్లు కూడా తాగటం మొదలుపెడతారు,తర్వాత బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటారు .ఈ పాపం అన్ని పార్టీ లది.

చిన్న చిన్న గ్రామాల్లో యువత తాగుడు మొదలెట్టే కాలం ఈ ఎన్నికల ప్రచారం తో ప్రారంభమౌతుందిం. అన్ని పార్టీల  లోకల్ నాయకులు వారి బావుల కాడ  -పొలాల వద్ద రాత్రి పూట రంజుగా ఈ "వైతరణీ నదిని పారిశ్తారు!!@!".

ఎవరూ దీన్ని ఆపలేరు ఎందుకంటే ఎన్నికల సంఘం కనుక ఎవరినైనా నియమిస్తే  వాడు అన్ని పార్టీల వద్ద ఇంత  తీస్కుని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంతే .....  మిగతాది ఎప్పటిలానే.

మరి ఆపటం ఎలా..... హి హే  హె .... చెప్పటం కష్టం .
మీ కింద ఎవరైనా 15 ఎల్లా పైబడి ఇంకా మందేయటం నేర్వలేదంటే వారిని కాస్త 45 దినాలు కట్టడి చేస్తే చాలు.


లేదు మనమే మాచి ఎమ్.ఎస్ లము అయితే ఇంకేముంది నా రాజ కుమ్మిక ఎత్తే సీసకి దించే సీస కీ టైం గ్యాపు ఇవ్వకుండా .... పంచె నేతకి తాతలు గుర్తొచ్చేలా తాగింది ఎక్కడాని -దిగడాని కి కూడా కన్ఫ్యూస్ అయ్యేలా కుమ్మొదులు  అంతే !!!.