స్పెషల్ ఎకనామిక్ జోన్ లా ....... స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ కేటాయించరు ఎందుకని?
భవిష్యత్తు లో అంతా రియల్ ఎస్టేట్ చేసుకుని నోట్లు ఉడికించుకు తింటారా? అసలు హైదరాబాద్ శివారు లో రంగా రెడ్డి జిల్లలో ఎన్ని ప్రాంతాల్లో పంట భూములు రియల్ ఎస్టేట్ భూదందాలో కనుమరుగు అయ్యాయి? ఎంతమంది లోకల్ చోటా రాజకీయనాయకులు వారి పబ్బం గడవడానికి ఎంత పంట భూమిని స్వాహా చేసారు?
ఇలా రోజు రోజుకీ కనుమరుగు అవుతున్న పంట భూమిని కాపాడే భాద్యత ఎవరికీ లేకుంటే, వచ్చే తరాలు తిండి కోసం - పంట కోసం ఎంత దూరం వెళ్ళాలి?
ఎన్నికల ముందు ఒకప్పుడు జనాలు వసతులు అడిగే వారు కానీ నేడు జనం ఎవ్వరి స్వార్థం వాళ్ళు చూసుకుని వోటుకెంత ఇస్తారు అని చూసుకుంటున్నారు నాశనమౌతున్న నేటి ని చూస్తూ భయంకరమైన రేపటిని ఊహించుకోవటం కష్టం!!.
అసలు ఎవరైనా నాయకుడు భవిష్యత్తు గురించి ఆలోచనలు చెస్తున్నడా .... అంతా ఇప్పుడు పబ్బం ఎలా గడవాలి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే చూసుకుంటున్నారు.
జనం కూడా అలవాటుపడిపొయారు పాలన అంటే ఏంటో మర్చిపోయారు 10 ఏళ్లల్లో మారిన మనిషి తీరు అసహ్యాన్ని కలిగించక మానదు.
ప్రతి జిల్లకీ కొంత ప్రాంతాన్ని వ్యవసాయ ప్రాంతం గా ప్రకటించి అక్కడ వ్యవసాయ క్షేత్రాలను - వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, అక్కడ రైతుల వద్ద నుండి భూమిని లాక్కొకూడదు.... SEZ ల పేరిట, కంపనీ ల పేరిట భూమిని గుంజుకొకుండా జాగ్రత్త పడాలి, లేకుంటె పంటలు పండించడానికి భూమి లేకుండా పోతుంది.