Sunday, 23 May 2021

ప్రజాస్వామ్యం -వరకట్న పథకం

 సరైన విషయం ఆఖరు పేరాగ్రాఫ్ లో ఉంది చివరిదాకా చదవండి :) 


ఒక ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లు పెరిగిన నాడు దొంగల అంతా కలిసి వారికి అనుకూలమైన చట్టాలు చేసుకుంటారు. నడివీధిలో దొంగతనం చేసినా శిక్ష పడకుండా చక్కటి Exceptions తో దొంగ కి ఎటువంటి శిక్షణ లేకుండా చట్టాలు చేసుకుంటారు ఇది ప్రాక్టికల్ గా సాధ్యం.... 

పాకిస్తాన్ ఏర్పడినది ఇలాంటి ఆలోచన విధానం తోనే.


మొదటిసారి కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము షాదీ ముబారక్ అనే ఒక పథకాన్ని మొదలుపెట్టింది అది ఏమిటంటే ముస్లిం వివాహ వ్యవస్థ ప్రకారం పెళ్లికి ముందు ఆడపిల్ల, అబ్బాయి కుటుంబానికి కొంత ఆర్థిక రుసుము చెల్లించాలి...... వారి వివాహ వ్యవస్థ ఈ విధానం కలిగి ఉంది కాబట్టే కర్ణాటక సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు షాది ముబారక్ మేర లక్ష రూపాయల డబ్బు విడుదల చేసేవారు... ప్రతి  ముస్లిం యువతి వివాహానికి ఒకటో పెళ్ళాం రెండో పెళ్ళాం మూడో పెళ్ళాం నాలుగు పెళ్ళాం.....నియమాలకతీతంగా :)


 రిటైర్మెంట్ అయిన తర్వాత బడ్జెట్ పెన్షన్ కూడా నలుగురు పెల్లాల కి విభజించబడుతుంది 40 ఏళ్ల వరకు అయినా సరే ఆఖరిపెళ్ళాం  బ్రతికున్నంత వరకు చెల్లించబడుతుంది ...ఆవరేజ్ ప్రకారము ఒక రిటైర్డ్ ముస్లిం వ్యక్తి ఎక్కువ పెన్షన్ డ్రా చేసుకుంటాడు ...అదే ఒక హిందూ వ్యక్తి ఒక పెళ్ళాం  కారణంగా భార్య-భర్త లైఫ్ టైం ప్రకారం తక్కువ పెన్షన్ తీసుకోగలరు..... 


ఎడ్యూరప్ప విపరీతంగా ప్రభుత్వం యొక్క మత సంతుష్టీకరణను విమర్శించడం కారణంగా సిద్ధరామయ్య కాస్త తగ్గి కళ్యాణ భాగ్య పేరిట కేవలం ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల నగదు ఇవ్వడం మొదలుపెట్టారు.


తర్వాత ఈ పథకం బాగుంది కదా అని మోదీ కూడా కళ్యాణ లక్ష్మి కి శ్రీకారం చుట్టి కొంత డబ్బును విడుదల చేయడం ఆరంభించారు ..... ఎడ్యూరప్ప వచ్చిన తర్వాత హిందువుల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏసీ/ఎస్టీల కీ ఓబీసీలకు కల్యాణ భాగ్యాని అమలు చేశారు.


ఇప్పుడు దేశమంతటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వివాహం సందర్భంగా కళ్యాణ లక్ష్మి పథకం అమలులో ఉంది లక్ష రూపాయల నగదు ఇవ్వబడుతుంది(కుల మతాలను బట్టి 1,50,000 నుండి 1,16,000 వరకు మారుతది).


90వ దశకంలో వరకట్నమనేది సమాజానికి పట్టిన పెద్ద శాపం ఎన్నో హత్యలు ఎన్నో కేసులు , Fake కేసులూ ...ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి ఈ వరకట్నం జాఢ్యం మూల కారణం.

2000 నుంచి 2005 మధ్యలో పాఠశాలల్లో కూడా వరకట్న వ్యతిరేక వ్యాసాలు ఉపన్యాసాలు పోటీ పెట్టేవారు అంటే సుమారు 2010 వరకు వర కట్నం అనేది ఒక సామాజిక దురాచారం. 

( నాకు వ్యక్తిగతంగా వరకట్నం పట్ల వ్యతిరేకత ఏర్పడడానికి ఒకానొక కారణం జంధ్యాల గారి సినిమాలు... :) ఎన్నో సినిమాలలో తమాషాగా వరకట్నం కి సంబంధించిన సన్నివేశాలను చక్కగా సినిమాలో ఇమడిచేవారు ఆయన దర్శకత్వం వహించిన సొంత సినిమాలేకాకుండా ....మాటలు, కథ అందించిన సినిమాలలో కూడా !!).


కానీ ప్రజాస్వామ్యం ద్వారా ఈ వర కట్న దాహం కలిగిన ఓటర్లు సాధించిన పెద్ద విజయం ఏంటంటే 1985లో ఎన్టీఆర్ అనే సి యం వరకట్న వ్యతిరేక నియమాలను ఏర్పరిచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ వరకట్నానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన- ఆచరణ  ను ముందుకు తోశారు.


2015 వచ్చేసరికి ప్రభుత్వమే వరకట్నం చెల్లిస్తోంది ఇది ప్రజాస్వామ్యం లో ఓటరు దిగజారితే వచ్చే మార్పులు.


వర కట్నం  అనేది "దురాచారం"నుండి ప్రభుత్వ ప్రోత్సాహం గా మారడానికి పట్టిన కాలం కేవలం 30 సంవత్సరాలు మూడు దశకాలు ....6 ఎన్నికలు... కేవలం 6 ఎన్నికలలో ఒక దురాచారం కాస్త ..... "ప్రోత్సాహక పథకం" గా మారింది!!!


==== ఇటువంటిదే ఉచిత విద్యుత్తు కూడా!!!====


90వ దశకంలో మీటర్ పెట్టి  విద్యుత్తు తీసుకుని నెలనెలా విద్యుత్తు రుసుము చెల్లించడం తలకు మించిన భారం... అందుకని మెయిన్ విద్యుత్ వైర్లకు  దొంగ కనెక్షన్లు తగిలించి విరివిగా విద్యుత్తు వాడుకునేవారు ...అడపాదడపా విద్యుత్ శాఖ ఉద్యోగులు వస్తే,  క్షణాల్లో వైరు లాగేసుకుని.. తప్పించుకునే వారు.  కానీ ఓటర్ మహాశయుల పోరాటంతో ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇచ్చే స్థితికి దిగజారింది.


#######


వచ్చే పది సంవత్సరాలలో ఎన్నికలకు ముందు మద్యం, బిర్యానీ పంచడం ఓటు వేయడానికి ప్రోత్సాహక పథకం గా మారిన ఆశ్చర్యం లేదు.


అలాగే 15 సంవత్సరాలలో ఎన్నికలకు ముందు ఓటుకు ఇంత డబ్బు అని చెల్లించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రోత్సాహక పథకం మారిన ఆశ్చర్యపోనవసరం లేదు దిగజారుతున్న ఓటరు ప్రజాస్వామ్యంలో సాధించలేని అవలక్షణం అంటూ ఏమీ లేదు. 


నేను జనాన్ని తిడుతున్నాను అనుకుంటే ఈ పోస్ట్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు!! నేను తప్పు పడుతోంది డెమోక్రసీ ని ...అవును ప్రజాస్వామ్యాన్ని!!  ప్రజాస్వామ్యం అనేది విగ్నత కలిగిన తెలివైన పౌరులున్న  సమాజానికి మంచిది..... అంతేకానీ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న అవినీతిమయమైన సమాజానికి ప్రజాస్వామ్యము మంచిని చేయదు.


పైగా భారతీయ సంతృష్టీకరమైన రాజకీయాల కారణంగా షరియా .. ఇస్లామీకరణ వైపు తోయబడుతుంది... ఒక చక్కటి ఉదాహరణ ఈ నెలలోనే పంజాబ్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పరచడం రంజాన్ కానుకగా !!


భారతదేశ పౌర సమాజానికి చైనా వంటి కమ్యూనిస్టుల పరిపాలన అవసరం చాలా ఉన్నది!!! కానీ అది భారత దేశం కోసం పని చేయాలి .....దురదృష్టవశాత్తు భారతదేశ కమ్యూనిస్టులు అందరూ చైనా మాతృదేశంలా భావిస్తారు... రష్యా వారికి పితృ దేశం!! భారతీయ కమ్యూనిస్టులు అందరికీ భారతదేశం అన్నా భారతీయ వ్యవస్థ అన్నా... ఏవగింపు..వెగటు... ద్వేశం....పగ. 


""తెలంగాణ 90mlపింకీలు.... తెలియకపోతే మూసుకొని ఉండండి కళ్యాణలక్ష్మి మూలం సిద్ధరామయ్య... మీ కచర దొర కాదు. ఇదొక కాపీపథకం, మీదొర మొదలుపెట్టింది రైతుబంధు మాత్రమే"".

Wednesday, 31 March 2021

తెరాస కల్వకుంట్ల సామ్రాజ్య వైఫల్యం

 నిండా 90 ఎమ్మెల్ ఏసీ ఒక #TRS  పింకీ గారు రాసిన పోస్ట్ ని మెల్లిగా అటు ఇటు ఎడిట్ చేస్తే కింది పోస్ట్ తయారయింది.


కింద ఉన్న పథకాలన్నీ మా కచరా దొర ముక్కు చీది ఇస్తున్నాడు ఒప్పుకుందాం.... మోదీ ఒక్క పైసా ఇవ్వలే ....కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకున్నా  సరే కచరా మాత్రం 90 జుర్రి పథకాలు ఇస్తున్నాడు అనుకుందాం.... మరి అలాంటప్పుడు కచరా నే ఉద్యోగాలు ఇవచ్చుగా?  ఉద్యోగాలు లేక పోవడానికి... అభివృద్ధి లేకపోవడానికి మాత్రం మోదీ కారణం.. బిజెపి మాత్రమే కారణం కానీ జనాన్ని సోమరుల చేసే  లంచగొండి పథకాలకు సర్వ కారణం మాత్రమ కచరా దొర  ఇదెక్కడి నిజం రా? 


10 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా ని మూడు లక్షల కోట్ల అప్పుల తెలంగాణ గా మార్చిన 90 ఎమ్మెల్ నాయకుడు.... అధికారం నిలుపుకోవడం కోసం జనానికి ఉచిత పథకాల బొక్కలు విసురుతున్నాడు... భానిస జనం ఉచితాలకు అలవాటుపడి తెలంగాణ భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారు.


మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ జల యుక్త్ శివిర్ చేస్తే ...తెలంగాణ నుంచి అఫీషియల్ గా పోయి పరిశీలించి కాపీ కొట్టి ... ఉల్టా బిజెపినే అంటున్నారు.


గుజరాత్ అర్బన్ ప్రాంతాలలో మంచినీటి ప్రణాళిక కాపీ కొట్టి ఉల్టా బిజెపిని అంటున్నారు!!


నీళ్లకు projects 

కరంటుకు production& supply 


రైతుబంధు

రైతుభీమా


కేసీఆర్ కిట్  

కళ్యాణలక్ష్మి సాయం


ఆసరా ఫించను

దివ్యాంగుల ఫించను


మిషన్ కాకతీయ

మిషన్ భగీరధ


గురుకులాలు

బాలికల హెల్త్ కిట్లు


హాస్టల్ విద్యార్థులను మతవిద్వేషం తో  పెడదోవ పట్టించుడు


ఇయ్యాల 24 గంటల కరంటు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన భగీరధ నల్లానీళ్లు


60 ఏండ్లల్ల కాని పనులు 

ఆరేండ్లల్ల చేసిండు కేసీఆర్ !! మరి ఇందులో కేంద్రం భాగస్వామ్యం ఏమీ లేదా కేంద్ర సహకారం లేనిదే దొర పొలం నుంచి ఇవన్నీ చేస్తున్నాడా? 


కరోనాతో కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేస్తే  

కచరా మాత్రం ముక్కుచీది అన్ని పథకాలకు పైసల్  సల్లుతున్నడు !!


సంక్షోభంలోనూ సంక్షేమం మరవకుండా పథకాలను అమలు చేసి సోమరుల తెలంగాణ ని అప్పులపాలు చేస్తూన్నది ప్రభుత్వం కాదా ?


నడిరోడ్డు మీద నరుక్కోవడాలు... నచ్చని వాళ్ళని చంపేయడాలు... 


నయీమ్ ఆస్తులు మింగేయడం..


111GO పేరుమీద డ్రోన్ కెమెరా లో పట్టనంత భూమి ఆక్రమించడం

 

మియాపూర్ భూములు ఆక్రమణ

 

ఇబ్రహీంపట్నం భూముల ఆక్రమణ


 చెరువుల భూములు ఆక్రమణ


 బైంసా అల్లర్లలో శిక్షలు పడకపోవడం


 హైదరాబాద్ నగరంలో ఒక వర్గానికి చలాన్లు పడకపోవడం ఒక వర్గం టాక్సులు, పిల్లులు కట్టకపోవడం...


ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు బడుగు బలహీన వర్గాల జనానికి న్యాయం జరగక పోవడం.


పోలీసు వ్యవస్థలో అవినీతి తట్టుకోలేక పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం


 ఇసుక దందా లో అక్రమాలు హత్యలు ఇసుక లారీలు జనాల్ని తొక్కేయడం 


ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన జరగడం ...జరిగిన కొద్ది ఉద్యోగ నియామకాలు "స్వజనులకు" మాత్రమే అవకాశాలు రావడం


 కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా మార్చే క్రమంలో రిజర్వేషన్ దామాషాలు పాటించకపోవడం


భూముల కబ్జా లనుండి విద్యాసంస్థల చంపేయడం వరకు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఈ కచరా ప్రభుత్వం


 ప్రభుత్వ విద్యా సంస్థలను మూసి వేస్తూ తెరాస ఎమ్మెల్యేలు మంత్రుల విద్యాసంస్థలకు ప్రమోషన్లు ఇవ్వడం 


ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు నియంత్రించకుండా ... వారికి సహకరించడం


ప్రభుత్వ విద్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్న కూడా ఎటువంటి నిధులు ఇవ్వకుండా భూస్థాపితం చేయడం.... 


తెలంగాణ ఉద్యమం పేరు మీద అనేకమంది బలిదానాల పునాదులపై అధికారం పొందిన కల్వకుంట్ల కుటుంబం తమ సామ్రాజ్య స్థాపన లో తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరచిపోవడం ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టి అధికారాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అవమానించడం.


తాగుబోతుల జనాన్ని తయారుచేస్తూ గల్లీకో మద్యం షాపు పట్టిస్తూ 90 ఎమ్మెల్ పార్టీ కర్త 90 ఎమ్మెల్ తెలంగాణ గా మార్చే ప్రయత్నాల్లో ఉంది బానిస బతుకులు అలవాటు పడ్డ జనం ఓటు విలువ మర్చిపోయి దొరల తెలంగాణకు దాసోహం అంటున్నారు!!


తెరాస పాలకులు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ కనీసం మూడు తరాల వరకు ఒకే కుటుంబం తెలంగాణను పరిపాలిస్తూ వందకోట్ల ప్రగతి భవన్ ను కల్వకుంట్ల గడీగా మార్చే ఈ ప్రయత్నంలో ఉన్నారు.


 పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని అధికారం పొంది కేంద్రం ఇస్తున్న సింగిల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వకుండా తమ కుటుంబానికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్లు కట్టుకున్న కల్వకుంట్ల కుటుంబం!!  సిగ్గులేని బానిస పింకీ ఆ సామ్రాజ్యం పాలనకు సామంత బానిసత్వం చేస్తున్నారు.


 కులగజ్జి వెల్లగక్కుతూ బానిసత్వం ప్రదర్శిస్తున్న అలాగా జనానికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ తమ కుటుంబానికి-  అధికారానికి ఎవరు అడ్డు పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు!! నిజం జనం గ్రహించాలి.


తెరాస నిజంగా అద్భుతాలు చేస్తూ ఉంటే తెలంగాణ జనం ఎందుకు వలస పోతున్నారు తెలంగాణాలో ఉద్యోగాల్లేక అవకాశాలు లేక వలస వెళ్లి పోతున్న జనానికి పింకీలు చెప్పే సమాధానం ఏమిటి? 


తెరాస నుండి తెలంగాణకు వీసమెత్తు మేలు జరగదు


తెలంగాణా తస్మాత్ జాగ్రత్త


#Telangana


#TRSFailedTelangana 


#TRSPARTYONLINE ఈమధ్య పింకీ పేజీలు లెస్స లొల్లి చేస్తున్నాయి... బహుశా ఫైనాన్స్ ఇయర్ ఎండ్  టాక్స్ క్లియరెన్స్ డబ్బు మళ్లింపు ల కారణంగా గొంతు పెరిగింది అనుకుంటా...