Thursday, 28 March 2013

బాధ

మట్టి దిబ్బ్బల్లాగా.... రాళ్ళ తోనిండి  కుప్పల్లాగా ఉంటె గడ్డపార పోటు .....చదునుగా ఉంటె నాగలిపోటు ...తప్పదు భూమికి గాయాల బెడద .... మంచిగా ఉండి  నిజాలు పలికితే మనిషికి ఆటు పోటుల  బెడద !

భూమి నొచ్చుకుంటే ఫలితం పంట..... మనిషి మనసు నొచ్చుకుంటే ఫలితం వ్యధ ఎందుకీ తేడా?
నిజం పలికితే శిక్ష పడుతుంది అని తెలిసిన తర్వాత నిజానికి మిగిలే విలువ ఏమిటి?
అబద్దం చెబితేనే జీవితం అన్నప్పుడు ..... మంచిపనికోసం అబద్దమాదవచ్చు అని గుర్తుచేస్తారు ఇక్కడ మంచి ఎది... ఎవరికొసమ్..... నాకోసం జరిగే మంచి స్వార్థం అవుతుంది కదా....

Friday, 22 March 2013

ఓటరు - నాయకుడు - రాష్ట్ర పరిస్తితులు ఒక సరదా వాదం!

సరాడా కి వచ్చిన డౌటు .... గతం లో మా గ్రామం లో నేను ఒక వ్యక్తీ తో ఎన్నికల గురించి మాట్లాడా అది 2003-4 ఎన్నికల సమయం లో అప్పటికి నాకు ఓటు హక్కు లేదు ,నేను 8వ తరగతి లో ఉన్నాను అనుకుంటా .... అప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడి గారికి సపోర్ట్ గా మాట్లాడితే ... ఆ వ్యక్తీ నాతో వాదించాడు అప్పటికే ప్రతి రోజు పేపర్ చదివే అలవాటు ఉన్న కారణంగా కాస్త గట్టిగానే సమాధానం చెప్పా అయితే ఆ వ్యక్తీ అన్నాడు నీకేం తెలుసు ఓటు హక్కు కూడా లేదు గానీ చెప్పొచ్చావు అని అప్పుడు తను కాంగ్రెస్స్ కి - వై.ఎస్. రాజశేఖర రెడ్డి కీ సపోర్టు గా మాట్లాడుతుంటే నేను కాంగ్రెస్స్ - సోనియా గురించి విమర్శిస్తున్నాను.

అతను ఒక కొత్త పాయింటు చెప్పాడు అదేమంటే .... చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులపాయిన అతనికి వరుణ  దేవునికీ పడలేదు కనుక రైతులు అల్లాడుతున్నారు నువ్వు తినే తిండి గింజలు రైతుల కష్టమే వారికి అససలు అనుకూలంగా లేదు నీ చంద్రబాబు పేరు మీద వర్షాలు లేవు కనుక మా వై.ఎస్. రెడ్డి వస్తే ఆటను రైతు బిడ్డ కనుక వారున దేవుడు కరునిస్తాడు ఆయన రాష్ట్రాని కి అధికారి అయితే ఆయన రైతు మనిషి కష్ట జీవి కనుక అలానే రాష్ట్ర పరిస్థితులు ఉంటాయి అని ! .
ఓరి నీ తెలివి కూల రాష్ట్రం లో వర్షాలు పడనిది చెట్లు లేక పర్యావరణం బాగా లేక వరునదేఉడికి కులాలేంటి బాబు అనుకుని .... వర్షాలు లేవనే చంద్రబాబు చెట్లు నాటే పని చేసాడు కనుక అవి పెద్ద అయ్యి వర్శాలిస్తాయి ఈ తరం గెలిస్తే వర్షాలు బాగానే ఉంటాయి అని నేనంటే చెట్లకి వర్శాలకీ సాంబ,మదం ఏమిటి అని దబాయించాడు నేను ఏమనలేక్పోయాను అప్పట్లో చిట్టి 8వ తరగతి బుర్రకి వాదించడానికి పాయింటు దొరకలేదు!

అయితే ఈ వాదన చేసింది రెడ్డి కాదు అతను ఒక హరిజనుడు కాంగ్రెస్స్  కి వీరాభిమాని/.  ఇందిరమ్మ మహాత్మా గాంధీ కోడలని,  గాంధీకి సపర్యలు చేసిందనీ వాదిస్తాడు.  సోనియా గాంధి మహాత్మా గాంధీ  చుట్టమని వాదిస్తే విపరీతంగా వాదించే వాడిని ఫిరోజ్ గాంధీని దత్తతకి తీసుకోలేదు గాంధీ ఇందిరాగందీ పెళ్లి గాంధీకి సంబంధం లేదు ఆమె పెల్లప్పటికి గాంధీ స్వాతంత్ర్యపోరాటం లో బిజీ గా ఉన్నాడు  అని ..... కానీ ఆ మహానుభావుడు వినలేదు ఇలానే చాలా మంది వృద్దులు సోనియా గాంధీ లోని గాంధీ అనే పదం మహాత్మా గాంధీ లోని పదం ఒకటే కనుక వారు గాంధీ వంశస్తులు అని భావించి ఓటేస్తూ వస్తున్నారు.! ఇప్పటికీ తన ఇంటి గోడలకి కాంగ్రెస్స్ రంగు వేసుకుని వోటేసే అమాయక ఓటరు !.

అయితే ఈ మొత్తం సంభాషణ లో నన్ను బాగా తికమక పెట్టిన మాట రెడ్డి గారు రైతు కనుక వర్షాలు బాగా పడతాయి  ఒకవేళ రాజశేఖర రెడ్డి కాక పొతే డి. శ్రీనివాస్ కానీ రోశయ్య కానీ అయితే కాస్త వేరుగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ రోశయ్య వస్తే రాష్ట్రం లో వ్యాపారం బాగుంటుంది అని జోస్యం చెప్పాడు .....

ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందంటే మన ప్రియతమా నేత మనం ఓటేసి తిరుగులేకుండా గెలిపించుకున్న చిరంజీవిగారు (ఓటేసామా .....ఓ రాజ్యసభ కదూ ... ఈసారి లోక్సభ ఎన్నికలకొస్తే తెలుస్తుంది అసలు విషయం! ) మన దేశ పర్యాటక మంత్రి గా నియమితులయ్యారు ... .సొ మాంచి జనాకర్షణ గల నేత కనుక విదేశీయులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది పైన చీపిన జోస్యం ప్రకారం . కానీ ప్రస్తుతం జరుగుతున్న అంశాలు చూస్తుంటే  ఎక్కడో తేడా కొడుతుంది ------మరీ ఈ ఆక్రుత్యా లేం  టం డి  బాబు విదేశీ పర్యాటకులు బెమ్బెలేట్టేలా ఈ అఘాయిత్యాలేంటి .... పై జోస్యం ప్రకారం ఈయన తీరు అంచనా వెస్తే  బాబోయ్  తట్టుకోలేను తెలివోచ్చిన  నాటి నుండి 15 సంవత్సరాలు అభిమానిగా ఉన్న నా హృదయం చిన్నబోతోంది !.

అయినా ఒక సాధారణ ఓటరు ఇంత దారుణమైన అనాలసిస్ తో ఓటేస్తే జయప్రకాశ్ నారాయణ గారు ఎంత కష్టపడితే నోటుకు ఓటు ను ఎదిరించగలడు ..... మోడీ ఎంత పని చేసి ఎంత ప్రచారం చేసినా ఇలాంటి వారి ఓటును పొంద గలడు ?

అసలు రామా రావు గారు మహానుభావుడండీ ఎంత గొప్ప ప్రయత్నం చేసుంటే  ఇందిరమ్మ ని ఎదుర్కొన గలిగాడు !.
ఎన్నికల తర్వాత 1 సంవత్సరం లోపే వర్షాలు విస్తారంగా పడడటం ఆ కాగ్రేస్స్ సపోర్టరు నా వంక చూస్తూ గర్వం ప్రదర్శించడం అలా జరిగిపోయాయి .... ఎం చేస్తాం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి .... ! :)
ఓటరు - నాయకుడు - రాష్ట్ర పరిస్తితులు ఒక సరదా వాదం!





దురాచారం

మన ఇతిహాసాలలో కానీ, ఆధునిక చరిత్రలో కానీ (క్షమించాలి ఇదొక బండ తప్పు చరిత్ర అంటేనే గతం మళ్ళీ ఆధునిక చరిత్ర ఏంటి?)కట్నం ప్రసక్తి వచ్చినట్లు నే వినలేదు .... కుచేలుడు ఎంత కట్నం పొందాడు,త్యాగరాజు పొందిన కట్నం ఎంత ..... పోనీ సాధారణ జనానీకం లో వధువు చెల్లించిన ధనం ఎంత ఉండొచ్చు ఎక్కడ తగు ఆధారాలు లేవు.
ఈ కట్నం అనే దరిద్రం పరాయి పాలనలో ముఖ్యంగా స్త్రీ అంటే పరదాల చాటున ఉండాలి అనే వారి పాలన లో మన బారతీయ సంప్రదాయం లో ప్రవేశించింది .
ఇన్నేళ్ళ దాస్యం ముగిసినా నేటికీ అవసరాల కి అనుగుణంగా మారుతూ అలా మన సంప్రదాయం లో కలిసిపోయిన ఒక దురాచారం  ఈ వరకట్నం ...... అబ్బాయి వయసులో ఉంటే కట్నం .... అబ్బాయి ముసలివాడయితే కన్యాశుల్కం .

ఇప్పటికీ దుబాయికి అమ్మాయిలని అధికారికంగా అమ్ముకుంటున్న పేద కుటుంబాలు ఎన్నో ..... మరి పోరాడి స్వేచ్చని తెచ్చుకున్న భారతీయులు 65 ఏళ్లయినా ఈలాంటి కొన్ని దురాచారాలని చేరపలేదు ఎందుకు .

Thursday, 21 March 2013

ప్రభుత్వోద్యోగి

కొన్ని లక్షణాలు ఎన్నేళ్ళైనా పోకుండా అలా ఉండిపోతాయి
స్వాతంత్ర్యం రాక ముందు ఏదైనా ప్రభుత్వ పని మీద ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్తే అక్కడ సిబ్బంది కాస్త కటువుగా వ్యవహరించడం జరిగేదట మరి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ కటువుగా వ్యవహరించడం అన్న లక్షణం మనలో పోలేదు ఈ మాట బలరాం  సహాని గారి  ఉపన్యాసం లో చదివా !

అది ఇప్పుడు కాస్త పెరిగి ప్రభుత్వోద్యోగి అంటే పొగరుగా వ్యవహరించడం లా తయారైంది ఎదుటి వారు  ఎంత వారైనా చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస మర్యాద లేకుండా మాట్లాడడం సర్వసాధారణం.ఎరా -పోరా కూడా అప్పుడప్పుడు వింటుంటాం ,ఒక సాధారణ పౌరుడికీ ప్రభుత్వోద్యోగికి మధ్య ఉండే సంబందం భయం తో కూడి ఉంది ఎందుకు?

బ్రిటీషు వాడు వద్దు కానీ వాడి భాష కావాలి - వాడి వేశాదారాణ  కావాలె.

ఈ మధ్య పెళ్లి విందు లో చక్కగా మన బట్టలేసుకోక కోటు ధరించడం  సాంప్రదాయం అయిపొయింది.  ఈ ధర లో కోటు ఉండాలి అని అమ్మాయి వారిని ఇబ్బంది కి గురిచేయడం కూడా జరుగుతుంది ఈ  వేడి దేశం లో నిండుగా కోటు ధరించి చెమటలు కక్కుతూ ఫొటోలకి పొజులు ఇవ్వడం ఏంటో అర్థం కాదు.

కాస్త గమనిస్తే మనిషి వస్త్రాధారణ  చూసి ప్రభుత్వోద్యోగి అని పసిగట్టగలం ఏతా  వాతా  నే చెప్పాలనుకునేది ప్రభుత్వ రంగ  ఉద్యోగులు మిగతా జనానీకం తో కలవక ఏదో కొంత ప్రత్యేకత చూపుతూ ఉంటారు.

మిగతా పౌరులతో కుదిరినంత నిర్లక్ష్యంగా ఉంటారు !. 

ఒక మాట

చావడానికి బతకాలి అంటే .... చచ్చే దాకా బతకాలి కానీ బతకడానికి చావకూడదు అంటే చస్తూ బతక కూడదు
ఎందుకు వచ్చిందో ఈ వాక్యం నా మెదడు లోకి తెలియదు కానీ ఇక్కడ భద్రపరిస్తే ముందు ముందు చూసుకుని మురవచ్చ్చని రాసేశా !!

Wednesday, 20 March 2013

బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్

జర్మనీ లో రైల్వే ట్రాక్ బ్రిటీషువాడు వేయలేదు, అయినా జర్మనీ అభివృద్దిని సాదించింది కదా మరి ఇప్పటి తరం "బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ ", రైళ్ళు వాయించారు ,బ్రిడ్జీలు వేయించారు అని వాదిస్తారు కాలేజీలేదా ప్రాంగణ  నియామకాల్లో జరిగే బృంద చర్చల్లో అతి సాధారనంగా వినిపించే పొగడ్తాపూర్వక వాక్యాలివి కేవలం ఉద్యోగం కోసం / గుర్తింపుకోసం బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అనగలిగే నేటి యువత బ్రిటీషర్స్ ఆర్ థీవ్స్ /బుర్గ్లేర్స్ .... నా దేశాన్ని దోచుకుంటున్న దొంగల్లారా పారిపోండి అని పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలం అయినా స్వేచ్చా స్వాతంత్ర్యాలని అనుభవించ అర్హులా  వారికి వారసులా ?

సరే మన నేతలు దోచుకుంటున్నారు వారికి దోచుకునే అధికారం, అవకాశం ఇచ్చింది మనం కాదా...
ఇక్కడ తప్పు, మన జనం , మన దేశాస్తులైన నేతలది అంటే కానీ హటాత్తుగా బ్రిటీషు వాడు గొప్పవాడు అయిపోదు కదా !
ఒక వేల గొప్ప వాడు అనుకుంటే మన పూర్వీకుల పోరాటం చెడ్డదా ..... కాదు కదా మరి బ్రిటీషర్స్ ఆర్  గ్రేట్ అని ఎలా అనగలరు ?

కొన్ని వందల ఏళ్ళు కొన్ని వందల రాజ్యాల రక్తం తాగిన బ్రిటీషు సమాజం నేటికీ ధనిక దేశం గా ఉండగలుగుతుంది
అంటే ఎంత సంపద దోచారు అని అర్థం.  ఇంగ్లాండ్ జనాభా - పంట భూమి నిష్పత్తి ఏ  పాటిది,అయినా సకల సౌకర్యాలతో తులతూగుతుంది అంటే ఎన్ని ఏళ్ల కి సరిపడ సంపద దోపిడీకి గురైందో కదా. మరి గొప్పతనం ఎక్కడినుండి వచ్చింది దాస్యానికి తహ తహ లాడుతున్న కొంతమంది ని చూస్తె జాలి వేస్తుంది కానీ కోపం రాదు కానీ ఎదుటివాడికి ఆ జాలి కోపం లా కనపదుతుంది .
ఇంగ్లాండ్ లో దొరికే ఖనిజ సంపద ... శిలజ ఇంధనం .... సహజ సంపదలు ఏ పాటివని ధనిక దేశం లా ఉంది పెట్టుబడి దారుగా మనగల్గుతుంది ?
అరబ్ దేశాలని, ఆఫ్రికా దేశాలనీ గత కొన్ని  దశాబ్దాల వరకు పాలించిన రక్కసులు నేటికీ అనధికారికంగా కొన్ని దేశాల ని శాసించే స్థితిలో ఉన్న జలగా లాంటి వారు గొప్ప ఎలా అవుతారు.
ఇలాగని వారంటే నాకు పర్సనల్ కసి ఉందని కాదు వారిని నా నిజ జీవితం లో చూస్తె గొడవ పడతానని కాదు కానీ నా ముందు ఎవడన్నా బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అంటే కోపం ఆగదు ,అవినీతి గురించి-నల్ల ధనం గురించి చర్చ వస్తే బ్రిటీషర్స్  ఆర్ గ్రేట్ అంటారు వెధవది ఎం జన్మ .... వాడు దొచుకొలెదా... అయినా దోపిడీ జరుగుతుంది అని తెల్సినా ఓటు వెయ్యరు (నేటికీ లోక్సభ ఎన్నికల్లొ నమోదయిన ఓటింగ్ శాతం 70 దాతలేదంటే ఎంత నిర్లక్ష్యం!). మంకు ఒకే పార్టీ కావలి అనుకుంటే మరి ప్రజాస్వామ్యం ఎన్నికలు ఎందుకు సరే బహు పార్టీలు ఎన్నో ఉన్నాయి అంటే జనం ఎందుకు దొంగలకి పట్టం గడుతున్నారు దొంగలకి ప్ర్రతినిధ్యం వహించే అవకాశం ఎందుకిస్తున్నారు ...

INDIA IS GREAT BUT NOT INDIANS అనేది నిజం, అక్షరసత్యం. శత్రువుని ప్రశంసించడం(శత్రు పొగడ్తకన్నా)  కన్నా ఆత్మ నింద ,ఆత్మ విమర్శ మేలు.
  

వ్యవసాయం - వెతలు


గెరిల్ల పోరాటం చేసిన రైతాంగం నేడు మళ్ళీ మరోపోరాటం చేస్తే గానీ మారని స్తితిలో ఉన్నారు మన నాయకులు.  కానీ దురదృష్టవ శాత్తు పోరాడి రైతుగా నిలవాలనుకుంటున్న యువత నేడు దేశం లో లేదు.  దేశం మొత్తం లో ఏ  15 ఏళ్ళ  బాలున్ని పెద్దయ్యాక ఎమౌతావ్ అని అడిగితె రైతు ని అయ్యి బాగా పంట పండిస్తా అనే సమాధానం రాదు భూమి ఉన్నోడి  కొడుకు అమెరికా, విదేశీ  కలలు కంటాడు - భూమిలేని వాడి కొడుకు బ్రతుకుదెరువు కలలు కంటాడు. 
అసలు వ్యవసాయ ఆధారిత దేశాన్ని స్కాముల ఆధార - విదేశీ మారకం ఆధారిత దేశంగా మార్చిన ఘనత మన నాయకులది కాదా? 
FDI లు వస్తే రైతులకి మంచిది అని అనుకునే స్థితి  ఎందుకు వచ్చింది ?

ఈ నాయకుల కక్కుర్తి  కారణంగా కనుమారుగైన పొలాల భూముల్ని నేడు దేశ పఠం లో చూపగలరా? భూమి ని కూడా మింగుతూ ఉన్న వీరి ఆకలి కి అంతు  లేదా?... పండిచే పంట లేనప్పుడు తినడానికి గింజలెలా  వస్తాయి?
కాక్రీటు అడవులు డబ్బుల్ని కాయించ గలవు కానీ తిండి గింజలని కాదు ప్రపంచమంతా నగరాలైతే డబ్బులెన్ని పోసినా తిండి దొరకదు/ముట్టదు  . 
మరి మన నేతలు పల్లెలని మునిసిపాలిటీ లుగా -మునిసిపాలిటీలని నగరాలూ గా మార్చడానికి ప్రయత్నిస్తారు ఎందుకు ? నేడే పేపర్ లో చూసా వరంగల్లు చుట్టుపక్కల 42 గ్రామాలని గ్రేటర్ వరంగల్లు గా మారుస్తూ జి.ఒ జారీ చేసారని. 
జి.ఒ లు జారీ చేసే వీరికిఓటరు కూడా నిండు సహకారం అందిస్తాడు ఏం  కోరుకుని ..... ?
వ్యవస్థ పరుగు ఎటువైపు సగటు మనిషి చూపు దేని వైపు ఆకలి వైపా ...... సౌక్యాల వైపా ? 
మునిసిపాలిటీలు గా మారితే వ్యవసాయ భూములకి వచ్చిన తిప్పలెంటనా డౌటు ..... వ్యవసాయ భూముల్ని ముఖ్యంగా చేరువులని ఆక్రమించి భూ కబ్జా అని ప్లాట్లు చేసి తినేస్తారు గదా.....! 
పేపర్ లో చూడటం లేదా చెరువులు మాయం అయిన వార్తలు! మునిసిపాలిటీ అయ్యాక మెల్లిగా పంట పొలాలని ప్లాట్లు చేసి వ్యాపారాత్మక ప్రదేశాలు గా మార్చి రియల్ ఎస్టేట్ దండా పేరిట పంట భూములని స్వాహా చేస్తారు!. 

అన్న దాత ఆకలి కేకలు పట్టని ఈ నేతల పాట్లు ఇంకేవరికోసం వీరి చట్టాలు  దేనికి ?
ఒక ఆటగాడు కొన్ని సిరీస్ లలో విఫలం అయితే తీసేస్తారు ఒక నటుడికి విజయాలు లేకపోతె అవకాశం  లభించదు మరి నా నాటి కీ దేశం లో రైతులు దీనావస్థ లోకి దిగజారుతుంటే .... 10 ఏళ్ళు గా ఆ మంత్రిత్వశాఖ  ఒకే వ్యక్తీ ఆధీనం లో ఉండటం ఎందుకు దాన్ని వదలని  ఆ వ్యక్తి  ఉద్దేశ్యం ఏమిటి? తన విధానాలు రైతుల ఆత్మా హత్యలని తగ్గించాయనా.... 

ప్రతి ఏటా రైతుల ఆత్మా హత్యలు పెరుగుతూన్నా రైతుకు కనీసం న్యాయం జరగకున్నా ఒక వ్యక్తి  మాత్రమె వ్యవసాయ శాఖా మంత్రిగా కొనసాగటం విడ్డూరం. 
టెర్రరిస్టులు వచ్చి కొంతమందిని చంపుతారు ... 2 లేదా 3 దాడులకొక సారి భాద్యత వహించి హోంశాఖా మంత్రి -రక్షణ శాఖా మంత్రి రాజీనామా చేస్తారు లేదా తొలగిస్తారు .... మారాతారు కానీ, ఏళ్ల తరబడి లక్షల మంది రైతులు మరణించినా మంత్రి మారడేమి మీడియా అరవదేమి, గోలచేయదేందుకు?. 
టెర్రరిస్టుల చర్యలకిచ్చిన ప్రాధాన్యత రైతు మరణాలకి లేదెందుకు?
గత 10 ఏళ్ల ల్లో ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్య గాయ పడ్డవారి సంఖ్యా   కలిపినా - ఆత్మ హత్య చేసుకున్న రైతుల సంఖ్య నే అధికం కదా మరి రైతు మరణాలపై ఈ ప్రభుత్వం  తీసుకున్న చర్యలు అంత  వేగంగా లేవెందుకు?

వికీ పీడియా లో వెతికితే కింది లైన్లు దొరికాయి ఈ పెద్ద మనిషి వివరాలు . 
After 2004 Lok Sabha elections, he joined the United Progressive Alliance government headed by Manmohan Singh as the Minister of Agriculture.
On 29 November 2005, he was elected President of Board of Control for Cricket in India (BCCI).
He was appointed Union Minister of Agriculture and of Consumer Affairs, Food & Public Distribution on 28 May 2009.  






నల్లధనం

నల్లధనం - ఒక ఉద్యోగి 2 లేదా 3 లకారాలు ట్యాక్స్ తప్పించుకోవడానికి నానా తంటాలు పడి  దొంగ ఆధారాలు చూపి తక్కువ మొత్తం లో నల్లదనాన్ని కూడబెడితే మన ప్రియతమ రాజకీయనాయకులు తమ తమ స్థాయిని బట్టి ఒక సున్నా పెంచుకుంటారు .....
3 లకారాలు -ఉద్యోగి
30 లకారాలు -ఎమ్మెల్యే
3 కోళ్ళు  -రాష్ట్ర మంత్రి
30 కోళ్ళు -ఎమ్.పి
300 కోళ్ళు - జాతీయ స్థాయి మంత్రి ...... కాస్తా అటుఇటు గా ఉన్నా లక్షల కోట్ల డబ్బు మాయం అవడం మాత్రం అతిశయమే కానీ కాదేదీ వీరి కి  అసాధ్యం!

ఇప్పుడు నాదొక అనుమానం వచ్చే ఎన్నికల్లో ఎ. రాజా కనుక పొటీ చేస్తే ఓటర్లు గెలిపిస్తారా - ఓడిస్తారా కనిమొషి /కనిమొళి  పోటీ చేస్తే ఓటర్ల సమాధానం ఏమిటి?

నా చిన్ని మెదడుకి తట్టిన సమాధానం  గెలిపిస్తారు ఘంటా భజాయించి చుక్కలు చూసే మెజారిటీ తో గెలిపిస్తారు ఎందుకంటే దోపిడీ సాధారణం అయిపొయింది ...... ఎవడికాడు నొక్కడం నేర్చి, నల్లధనం  కామన్ అయి ..... గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి లాగా నల్లదనం, స్కాములు అతి సాధారణ విషయాలు వీటిని అడిగే వారే బుద్ది తక్కువ జీవులు అవుతారు.

రాను రాను కూటముల ప్రభుత్వాలు ఏర్పడి మీ రాష్ట్రం వారే స్కాము చేసారు మా రాష్ట్రం వాళ్ళు చేసింది ఎంత పితకంత మీ రాష్ట్రం వారే ఎక్కువ నొక్కారు అని తప్పించుకుని ఎదుటివారి తప్పు ముందు తమ తప్పును తక్కువ చూపి పిచ్చి జనా లని నమ్మిస్తారు.

చ నా పిచ్చి కాకపొతే  జనం పిచ్ఛి వారేంటి వారు అతి తెలివైన వాళ్ళు అందుకే ఎన్నికల పండగప్పుడు దొరికినంత దండుకుని హాయిగా ఉంటారు(ఉంటాము అనుకుంటారు పెరిగే ధరలు త్యాక్సులు లెక్కలోకి రావు!). 

ఫేస్బుక్

ఫేస్బుక్ లో ఫూట్బాల్ వీడియో గేమ్ ఆడి  చెమటలు తెచ్చుకోవటం ఎంత అతిగా ఉంటుందో ..... అలాగే ఫేస్బుక్ కమెంట్లో  క్లాస్స్ పీకి ఎదుటి వాడికి జ్ఞానోదయం చేయటానికి ప్రయత్నించడం లేదా మార్చాలనుకోవడం అంటా అతిగా ఉంటుంది కనుక ఫేస్బుక్ లో నచ్చితే లైక్ /షేర్ .... నచ్చకుంటే తీసి పారేయి లేదా రిపోర్ట్ / స్పాం  .... అంతే  గాని ఎదుటో డు తెలిసినోడే కదా అని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే వర్చు వల్ లైఫ్ కాస్తా ఒరిజినల్ లైఫ్ ని కంగాళీ చెసి  పారేస్తుంది!

Tuesday, 12 March 2013

తెల్ల మోజు

కనీసం 10 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేము అని అన్ని పార్టీలకీ బాగా తెలిసినా అంతా  మోడీ ని విమర్శించి....సాధ్యమైనన్త విషం కక్కి భాజాపా కు వచ్చే కొన్ని ఓట్లని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు కానీ .... కాంగీ చెఅసిన దోపిడీని విమర్శించె ధైర్యం అటు మీడియా కి గానీ ఇటు వ్యక్తులకి గానీ లేదు కాంగీ కి ఇంత  బానిససలు ఉన్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది రక్తం పీల్చి స్విజ్ బ్యాంకు లు నింపుకున్నా స్కాములు చేసి టాక్సు లు పెంచినా కాంగీ కి మాత్రమె ఓటు వేస్తాం భాజాపా కానీ మరే పార్టీ కానీ వద్దు అనే వాళ్ళు ఉన్నంత కాలం స్కాములకి దేశాన్ని దోచే జి.ఒ లకీ కొదువేముంది రాజా..... !

మోడీ వద్దు మోడీ వద్దు అమ్మే ముద్దు అదేగా నర- నరాన జీర్ణించుకు పోయిన బానిసత్వపు బుద్ది తెల్లోడి దెబ్బ కావాలి తెల్ల తోలు పిల్ల కావాలి కానీ మనోడు వద్దు వాడి బూచీ చూపి, మరొకడు కూడా కావద్దు.....  బొమ్మ అమ్మా దొచుకొమ్మా.... అందుకే టాక్స్ కడతాము తీసుకెళ్ళి స్విజ్ బ్యాంకు నింపుకో ... !!.


మళ్ళీ UPA అభ్యర్థే ప్రధాని అయితే కాస్త దాక్కుని జరుగుతున్నా నియంత-తత్త్వం పురివిప్పుకుని ఆడుతుంది అప్పుడు దూల తీరుతుంది !.

Thursday, 7 March 2013

యు.పి.ఎ -తెలంగాణా

యు.పి.ఎ -తెలంగాణా
అసలు ముందుగా యు.పి.ఎ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అంచెలంచెల అధికార పంపిణీ విధానం గురించి చెప్తా.
అసలు రాజ్యాంగం లో మంచి కోసం కల్పించిన అధికార వికేంద్రీకరణ అనే అంశాన్ని అత్యంత నూతన పద్దతి లో దుర్వినియోగపర్చిన ఘనత ఈ యు.పి.ఎ ప్రభుత్వానికి దానికి అధికారం కట్టబెట్టిన ఈ తరం ఓటర్లకే చెందుతుంది!.

ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ నేతల పాట్లు చూస్తె ఇటు తెలంగాణా నేతలు గానీ, అటు సమైక్యాంధ్ర నేతలు గానీ ఎవరైనా, ఎపుడైనా రాష్ట్రానికి సంబందించిన అతి కీలకమైన విషయం  గూర్చి మాట్లాడేప్పుడు  ప్రధాని గారికి విన్నవించాము  అని గానీ ప్రధాని గారితో చర్చించాము అనిగానీ అన్నారా?, ప్రతిభాపాటిల్ గారి పేరు ఎన్నడైనా ఎత్తారా?,

 నేను బాగానే వార్తలు గమనించా ఎప్పుడు చూడు సోనియా అమ్మ కు చెప్పాం, సోనియా అమ్మకు రాజీనామాలు సమర్పించాము, సోనియా అమ్మకు ఫ్యాక్స్  ద్వారా లేఖలు-రాజీనామాలు అందించాము అంటారుగానీ రాజ్యాంగబద్దమైన విధంగా తెలంగాణా విషయం లో ప్రధాని-స్పీకర్-రాష్ట్రపతి పాత్రలు గుర్తుకురాలేదెందుకు?
ఇక్కడ రెండుప్రాంతాల నేతలు దొందు -దొందే అనా చందాననే ఉన్నాయి కానీ తెలంగాణా అంశంలో లోపం లెదు.

నా అభిప్రాయం జై తెలంగాణా .
విషయం లోకి వస్తె.... మరి ఇన్ని విధాలా అమ్మ తో పోరాక ఈ మధ్య నేతలు కాస్త హొమ్-మంత్రి గారి పేరు ఎత్తుతున్నారు అదీ అడగటానికి ఎందుకంటే షిండే గారు అలవాటులో పొరపాటుగా నెల అని మాటిచ్చారు కనుక  ,అంతకు ముందు చిదంబరం గారిని విమర్శించాడానికే గుర్తు చేసే వారు గాని పని గురించి కాదు!.

మరి అన్ని అధికారాలను కేంద్రీకరించి తన వద్ద పెట్టుకున్న  అమ్మ చేసిన నిర్వాకం అల్లుడిగారికి విమానాశ్రయాలల్లో తనికీలు చేయకుండా జి.ఒ జారీ చేసారు దానికి మిగతా వారు ఎలా సమ్మతం తెలిపారో ఏమనుకున్నారో తెలియదు ఒకవేళ ఈ జి.ఒ ని పార్లమెంట్ లో ఒతిన్గుకి పెట్టితే మన ఆంధ్రప్రదేశ్ నాయకులు పోటీ పది మరి అనుకూల ఒతేస్తారు ఇంట బానిసత్వం ఏమిటో?...కుదిర్తె 2...... 3... ఒత్లేసేరకాలు మన A.P నాయకులు.

స్కాములు అని గోల మొదలెడితే చాలు అధికార పార్టీ వాళ్ళు - ప్రతిపక్షం వాళ్ళు అటు-ఇటు గాని BSP ,SP నాయకులు  అంతా ప్రధాని ని సంజాయిషీ అడుగుతారు ఆయన నిన్నటి లాగే అడిగిన వారిని శాపనార్థలెట్టి  చేతులు దులుపుకుంటాడు .... "అధికారానికి అమ్మ, సమాధానానికి  -అవినీతి ప్రభుత్వానికి అతి నిజాయి తీపరుడైననామ మాత్రపు నాయకుడు ".ఇదెక్కది న్యాయం?

ఆ మధ్య కోల్గేట్ స్కాము విషయం పై  జరిగిన  చర్చలోనూ ఇదే విధంగా బ్లాక్ మెయిల్ ఉపన్యాసం అందులో కొన్ని శాపనార్థాలు ఇదేనా భాద్యత గల ప్రధాని విధానం .
అంటారు అనడానికే ప్రతిపక్షం ఉంది జరుగుతూన్న ఘోరాలు సాధారనమైనవా ?

రక్షణ లేదు, ఉగ్రవాదం , మాట్లాడితే చాలు లక్షల కోట్ల స్కాములు ఎక్కడి దా  డబ్బు అమ్మ ఒల్లోది కాదు కదా, మరి అడుగుతారు అక్షతలు వేస్తారు తుంటరి పిల్లగాల్ల గ్యాంగ్ కి నాయకుడంటే ఆ మాత్రం మాటలు పడాలి తన చుట్టూ ఉన్నది అతి నీతిపరులు కాదాయె!.

కొసమెరుపు అభిషేక్ సింఘ్వి ఘనుడు మళ్ళీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చారు కాంగ్రెస్ వారు చాలా గర్వపడుతున్నారు అతని సేవలు పొందడానికి . మరియు మన నారాయణ్ దత్ తివారీ గారు ఉత్తర ప్రదేశ  రాష్ట్రానికి 4 పర్యాయాలు ముఖ్యమంత్రి గా సేవలు అందించారు అందుకే ఇప్పుడు జరుగుతున్నా నేరాలు- ఘోరాలల్లో ఆ ప్రాంత పాత్ర ఎక్కువ ఉంది 

Tuesday, 5 March 2013

పుత్తడిబొమ్మ

పుత్తడిబొమ్మ ...ఈ సినిమా యూట్యుబ్ లో దొరికితే చూసా ఇడి  10 సారో 20 వ సారో అయ్యిండొచ్చు .....అసలు ఆ  సీరియస్ అంశం మీద సినిమా తీస్తూ మేక (మేధావి కవి ) కామెడీ తో చంపాలని ఆలోచన ఎలా వచ్చిందో మాష్టారు గారికి!.
వితంతు పునర్వివాహాలు- వరకట్న పిశాచం ఈ రెండింటి మీదా చాలా పదునైన  విమర్శ ఆసాంతం కొనసాగుతుంది  ఈ సినిమాలో.  అలానే  పోట్ట చేక్కలైపోయే హాస్యం.  ఇవి  నిజజీవితం లో మనం చూసే పాత్రల లానే ఉంటాయి (నిజంగా  ఒక్కరైనా ఎదురుపడతారండీ ఈ కవిత-తవికా జ్ఞానులు ).

ఒక సీన్ లో సుత్తి వేలుని కూతురు అరుణ అడుగుతుంది ఎందుకు తాగుతావు నాన్నా ఈ పాడు కల్లుని, ఏముంది దాన్లో?  అని, దానికి వేలు జవాబు "నేను అదే అనుకుంటానమ్మా ఏముంది దీన్లో చూసి తీరాలని అంతు చూడాలని  కానీ సగం తాగే సరికి  తలకెక్కి పోతుంది అని  " . ఎంత అమాయకంగా ఉంటుంది ఆ నటన -జవాబు తాగుబోతు తండ్రి తో చాలా సాధారణంగా జరిగే సంభాషణ అది అందులోంచి మనకు హాస్యరసం తీసి ఇచ్చారు మాష్టారు!.

ఇందులో డీల్ చేసిన విషయాలు అప్పట్లోనే కాదు నేటికీ తీవ్రమైన స్థాయి లోనే  ఉన్నాయి 80 వ దశకం లో ఈ విషయం పైన సినిమా తీసి జనం మెప్పు పొందటం అంత  తేలిక కాదు, అది వారి నరనరాన నిండుకుపోయిన ఆచారానని  ప్రశ్నిస్తూ దాని నిజ స్వరూపాన్ని దునుమాడుతూ కొనసాగుతుంది మూల కథ .

అయినా మధ్య మధ్యలో మేక-క్షురల హాస్యం, సుత్తి వేలు తాగుబోతు నటన తో ఆసాంతం హాయిగా కొనసాగుతుంది  ఈ కథ.  సినిమా నిడివి 2 గంటలే, కానీ 2 గంటల్లో వేసే ప్రశ్నలు చేసే విమర్శ అద్భుతం.

జంధ్యాల సినిమాల్లో ఎప్పటిలానే ఈ సినిమా కూడా వర్షం వెలిసాక తీసినట్టు  ఆహ్లాదకర గ్రామీణ వాతావరణం లో సాగుతుంది ఒక సీన్లో సుత్తి వేలు కల్లు  దుకాణం లో కల్లు  తాగుతుంటే అక్కడికి మేక గారు వస్తారు అక్కడ కల్లు  గుడిసె బయట నిలబడి సుత్తి వేలుని "నా కవిత విను "అని అడుగుతాడు అప్పుడు స్క్రీన్ చూస్తె నాకు భలే ఆనందంగా ఉంటుంది ఆ సీన్ లో నేల కాస్త బురదగా ఉండి దృశ్యం   అద్భుతంగా ఉంటుంది (వర్షం వెలిసిన తర్వాత ఉండే ఆ కొద్ది క్షణాలు కళ్ళముందు ఉంటాయి!).
సినిమా చివరి అంకం లో పూర్ణిమ పాత్ర చనిపోవడం అనేది ఆనాటి ఆలోచనా విధానాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేసినట్లుగా అనిపించింది నాకు !.

ఇప్పటికీ సమాజం మారలేదు వితంతువులకు పెళ్లి మాట ఏమో గానీ మామూలు గౌరవం దక్కడం కూడా కష్టం అయింది.  అనుమానపు చూపులు, పక్కకొచ్చి దారుణంగా మాట్లాడటం సాధారణం .

పరుగు

ఆశ, అవకాశం మనల్ని వెంటాడుతాయి
 మనం అవాకాశం వెంట పరిగేడతాం.

ఈ చక్రం లో ఇరుక్కునే.....  అంతా ఒకరికొకరు దూరం అవుతున్నారు.
కానీ ఈ పరుగులేవి లేని బాల్యం .....

ఆహా .... భుజానికి పుస్తకాల సంచీ వేసుకుని అలా పొద్దున్నే  వెళ్లి,
సాయంత్రం  దాకా కాలానికి నడక నేర్పి,
ఇంటికొస్తే ఉంటుంది హాయి....
అప్పుడు నేర్పిన నడక ఇప్పుడు పరుగు అయింది
..... కానీ ఆ హాయి రెట్టింపవ్వక పోగా అడుగంటుకు పోయింది! మ్ప్చ్ .