గెరిల్ల పోరాటం చేసిన రైతాంగం నేడు మళ్ళీ మరోపోరాటం చేస్తే గానీ మారని స్తితిలో ఉన్నారు మన నాయకులు. కానీ దురదృష్టవ శాత్తు పోరాడి రైతుగా నిలవాలనుకుంటున్న యువత నేడు దేశం లో లేదు. దేశం మొత్తం లో ఏ 15 ఏళ్ళ బాలున్ని పెద్దయ్యాక ఎమౌతావ్ అని అడిగితె రైతు ని అయ్యి బాగా పంట పండిస్తా అనే సమాధానం రాదు భూమి ఉన్నోడి కొడుకు అమెరికా, విదేశీ కలలు కంటాడు - భూమిలేని వాడి కొడుకు బ్రతుకుదెరువు కలలు కంటాడు.
అసలు వ్యవసాయ ఆధారిత దేశాన్ని స్కాముల ఆధార - విదేశీ మారకం ఆధారిత దేశంగా మార్చిన ఘనత మన నాయకులది కాదా?
FDI లు వస్తే రైతులకి మంచిది అని అనుకునే స్థితి ఎందుకు వచ్చింది ?
ఈ నాయకుల కక్కుర్తి కారణంగా కనుమారుగైన పొలాల భూముల్ని నేడు దేశ పఠం లో చూపగలరా? భూమి ని కూడా మింగుతూ ఉన్న వీరి ఆకలి కి అంతు లేదా?... పండిచే పంట లేనప్పుడు తినడానికి గింజలెలా వస్తాయి?
కాక్రీటు అడవులు డబ్బుల్ని కాయించ గలవు కానీ తిండి గింజలని కాదు ప్రపంచమంతా నగరాలైతే డబ్బులెన్ని పోసినా తిండి దొరకదు/ముట్టదు .
మరి మన నేతలు పల్లెలని మునిసిపాలిటీ లుగా -మునిసిపాలిటీలని నగరాలూ గా మార్చడానికి ప్రయత్నిస్తారు ఎందుకు ? నేడే పేపర్ లో చూసా వరంగల్లు చుట్టుపక్కల 42 గ్రామాలని గ్రేటర్ వరంగల్లు గా మారుస్తూ జి.ఒ జారీ చేసారని.
జి.ఒ లు జారీ చేసే వీరికిఓటరు కూడా నిండు సహకారం అందిస్తాడు ఏం కోరుకుని ..... ?
వ్యవస్థ పరుగు ఎటువైపు సగటు మనిషి చూపు దేని వైపు ఆకలి వైపా ...... సౌక్యాల వైపా ?
మునిసిపాలిటీలు గా మారితే వ్యవసాయ భూములకి వచ్చిన తిప్పలెంటనా డౌటు ..... వ్యవసాయ భూముల్ని ముఖ్యంగా చేరువులని ఆక్రమించి భూ కబ్జా అని ప్లాట్లు చేసి తినేస్తారు గదా.....!
పేపర్ లో చూడటం లేదా చెరువులు మాయం అయిన వార్తలు! మునిసిపాలిటీ అయ్యాక మెల్లిగా పంట పొలాలని ప్లాట్లు చేసి వ్యాపారాత్మక ప్రదేశాలు గా మార్చి రియల్ ఎస్టేట్ దండా పేరిట పంట భూములని స్వాహా చేస్తారు!.
అన్న దాత ఆకలి కేకలు పట్టని ఈ నేతల పాట్లు ఇంకేవరికోసం వీరి చట్టాలు దేనికి ?
ఒక ఆటగాడు కొన్ని సిరీస్ లలో విఫలం అయితే తీసేస్తారు ఒక నటుడికి విజయాలు లేకపోతె అవకాశం లభించదు మరి నా నాటి కీ దేశం లో రైతులు దీనావస్థ లోకి దిగజారుతుంటే .... 10 ఏళ్ళు గా ఆ మంత్రిత్వశాఖ ఒకే వ్యక్తీ ఆధీనం లో ఉండటం ఎందుకు దాన్ని వదలని ఆ వ్యక్తి ఉద్దేశ్యం ఏమిటి? తన విధానాలు రైతుల ఆత్మా హత్యలని తగ్గించాయనా....
ప్రతి ఏటా రైతుల ఆత్మా హత్యలు పెరుగుతూన్నా రైతుకు కనీసం న్యాయం జరగకున్నా ఒక వ్యక్తి మాత్రమె వ్యవసాయ శాఖా మంత్రిగా కొనసాగటం విడ్డూరం.
టెర్రరిస్టులు వచ్చి కొంతమందిని చంపుతారు ... 2 లేదా 3 దాడులకొక సారి భాద్యత వహించి హోంశాఖా మంత్రి -రక్షణ శాఖా మంత్రి రాజీనామా చేస్తారు లేదా తొలగిస్తారు .... మారాతారు కానీ, ఏళ్ల తరబడి లక్షల మంది రైతులు మరణించినా మంత్రి మారడేమి మీడియా అరవదేమి, గోలచేయదేందుకు?.
టెర్రరిస్టుల చర్యలకిచ్చిన ప్రాధాన్యత రైతు మరణాలకి లేదెందుకు?
గత 10 ఏళ్ల ల్లో ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్య గాయ పడ్డవారి సంఖ్యా కలిపినా - ఆత్మ హత్య చేసుకున్న రైతుల సంఖ్య నే అధికం కదా మరి రైతు మరణాలపై ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంత వేగంగా లేవెందుకు?
వికీ పీడియా లో వెతికితే కింది లైన్లు దొరికాయి ఈ పెద్ద మనిషి వివరాలు .
After 2004 Lok Sabha elections, he joined the United Progressive Alliance government headed by Manmohan Singh as the Minister of Agriculture.
On 29 November 2005, he was elected President of Board of Control for Cricket in India (BCCI).
He was appointed Union Minister of Agriculture and of Consumer Affairs, Food & Public Distribution on 28 May 2009.
No comments:
Post a Comment