పుత్తడిబొమ్మ ...ఈ సినిమా యూట్యుబ్ లో దొరికితే చూసా ఇడి 10 సారో 20 వ సారో అయ్యిండొచ్చు .....అసలు ఆ సీరియస్ అంశం మీద సినిమా తీస్తూ మేక (మేధావి కవి ) కామెడీ తో చంపాలని ఆలోచన ఎలా వచ్చిందో మాష్టారు గారికి!.
వితంతు పునర్వివాహాలు- వరకట్న పిశాచం ఈ రెండింటి మీదా చాలా పదునైన విమర్శ ఆసాంతం కొనసాగుతుంది ఈ సినిమాలో. అలానే పోట్ట చేక్కలైపోయే హాస్యం. ఇవి నిజజీవితం లో మనం చూసే పాత్రల లానే ఉంటాయి (నిజంగా ఒక్కరైనా ఎదురుపడతారండీ ఈ కవిత-తవికా జ్ఞానులు ).
ఒక సీన్ లో సుత్తి వేలుని కూతురు అరుణ అడుగుతుంది ఎందుకు తాగుతావు నాన్నా ఈ పాడు కల్లుని, ఏముంది దాన్లో? అని, దానికి వేలు జవాబు "నేను అదే అనుకుంటానమ్మా ఏముంది దీన్లో చూసి తీరాలని అంతు చూడాలని కానీ సగం తాగే సరికి తలకెక్కి పోతుంది అని " . ఎంత అమాయకంగా ఉంటుంది ఆ నటన -జవాబు తాగుబోతు తండ్రి తో చాలా సాధారణంగా జరిగే సంభాషణ అది అందులోంచి మనకు హాస్యరసం తీసి ఇచ్చారు మాష్టారు!.
ఇందులో డీల్ చేసిన విషయాలు అప్పట్లోనే కాదు నేటికీ తీవ్రమైన స్థాయి లోనే ఉన్నాయి 80 వ దశకం లో ఈ విషయం పైన సినిమా తీసి జనం మెప్పు పొందటం అంత తేలిక కాదు, అది వారి నరనరాన నిండుకుపోయిన ఆచారానని ప్రశ్నిస్తూ దాని నిజ స్వరూపాన్ని దునుమాడుతూ కొనసాగుతుంది మూల కథ .
అయినా మధ్య మధ్యలో మేక-క్షురల హాస్యం, సుత్తి వేలు తాగుబోతు నటన తో ఆసాంతం హాయిగా కొనసాగుతుంది ఈ కథ. సినిమా నిడివి 2 గంటలే, కానీ 2 గంటల్లో వేసే ప్రశ్నలు చేసే విమర్శ అద్భుతం.
జంధ్యాల సినిమాల్లో ఎప్పటిలానే ఈ సినిమా కూడా వర్షం వెలిసాక తీసినట్టు ఆహ్లాదకర గ్రామీణ వాతావరణం లో సాగుతుంది ఒక సీన్లో సుత్తి వేలు కల్లు దుకాణం లో కల్లు తాగుతుంటే అక్కడికి మేక గారు వస్తారు అక్కడ కల్లు గుడిసె బయట నిలబడి సుత్తి వేలుని "నా కవిత విను "అని అడుగుతాడు అప్పుడు స్క్రీన్ చూస్తె నాకు భలే ఆనందంగా ఉంటుంది ఆ సీన్ లో నేల కాస్త బురదగా ఉండి దృశ్యం అద్భుతంగా ఉంటుంది (వర్షం వెలిసిన తర్వాత ఉండే ఆ కొద్ది క్షణాలు కళ్ళముందు ఉంటాయి!).
సినిమా చివరి అంకం లో పూర్ణిమ పాత్ర చనిపోవడం అనేది ఆనాటి ఆలోచనా విధానాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేసినట్లుగా అనిపించింది నాకు !.
ఇప్పటికీ సమాజం మారలేదు వితంతువులకు పెళ్లి మాట ఏమో గానీ మామూలు గౌరవం దక్కడం కూడా కష్టం అయింది. అనుమానపు చూపులు, పక్కకొచ్చి దారుణంగా మాట్లాడటం సాధారణం .

No comments:
Post a Comment