Sunday, 30 December 2012

కాలమా

కరిగి పోయిన సబ్బులు ....అరిగిపోయిన చెప్పులు ....తిరిగిపోయిన  క్యాలండర్ ముక్కలు
అయిపోయిన మరొక  సంవత్సరం .....


జీవితం మరీ వేగంగా అయిపోతున్నట్లు ఉంది....2010 డిసెంబర్ 4 మధ్యాహ్నం 2.45....ఆ 15 నిమిషాలు నా జ్ఞాపకాల నుండి  చెరిగి పోక  ముందే 2 సంవత్సరాలు గడచిపోయాయి ...... కాలం పరిగెడుతోంది ,నా జీవితం  లో మార్పు....రాలేనంటొంది ....నిజానికి నాకే ధైర్యం లేదు మార్పుని ఆహ్వానించడానికి .

నేనేంటో  తెలియక ముందే నేను తప్పిపోయాను .......కాని నేను నేనవ్వడానికి తగిన ధైర్యం లేక ఆగిపొయాను
గడచిన 24 సంవత్సరాలని మంచితనం అనే నాటకం లో  పోసి దరిద్రం అనే ఫలాన్ని పొందినా కూడా...మారడానికి నాకు మనసొప్పడం లేదు .
ఒక్క సంవత్సరం నాకోసం ఆగి పోవచ్చు  గదా!అత్యాశే.....కాని ఆశ మనసుకి ఊరట, ఊహలు .....కలలు   ఇంధనాలు కదా!
ఇంతకీ గడచిన సంవత్సరాన్ని గమనిస్తే ...కలకత్తా చూసాను .....బెంగలూరు చూసాను .....మొదటి జీతం తీసుకున్నాను
బాగానే ఉంది కాని కలలో కూడా ఊహించని విధంగా ఇంటికి దూరం అయ్యాను.....నా అలవాట్లు, కోపం, నేను  అనగలిగే అస్తిత్వాన్ని కోల్పోయాను ....
పోయింది..... గడచి పోయింది ...మరో  సంవత్సరం,దూరాన్ని పెంచేస్తూ ,ఆశలని తుంచేస్తూ,.....

చూద్దాం వచ్చే సంవత్సరం  తీసుకొచ్చే మరిన్ని మలుపులను ,తీరాలను,మజిలీలను .
నేస్తమా 2012 తిరిగి రాని కాలనివైనా.... ,తీపి జ్ఞాపకాలని మిగిల్చిన  నీకు ఇవే నా వీడుకోలు,
పరిగెడుతున్న కాల చక్రమ్ లో కరిగి పోవడానికి సిద్దంగా ఉన్న 2013 కి ఇదే నా ఆహ్వానం .........

Saturday, 22 December 2012

వాల్-మార్ట్ లాంటి విదేశీ సంస్థలు చిల్లర వర్తకం లోకి వస్తే....ఎగువ మద్యతరగతి ,స్థితిమంతులకైతే పర్వాలేదు కాని దిగువ మధ్యతరగతి,పేద వారి పరిస్థితి ఏంటి?
ఎందుకంటే కిరాణా షాపుల్లో డబ్బులిచ్చి (నగదు....) కొనే వారు అంటా ఖచ్చితంగా మాల్ల్స్ కె వెళతారు ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఆఫర్లు కూడా ఉంటాయి(ఆఫర్లతో గాలం వేస్తారు అది వేరే విషయం ) మరి ఉద్దేరకి కిరాణా షాపుల్లో కొనె వారి సంగతి ఏంటి?ఎందుకంటే నగదు గిరాకి పై వచ్చే అదాయం తో  షాపు వాడు ఉద్దేరా గిరాకి ని బ్యాలెన్స్ చేస్తాడు మరి నగదు గిరాకి తగ్గినప్పుడు డబ్బు రిసైకిల్ చేయలేక షాపు మోయవలసి వస్తుంది అప్పుడు ఉద్దేరా గిరాకి నోట్లో మన్ను పడ్డట్లే గదా....ఉద్దేరా అంటే అంటా ఎగదోబ్బెరకం ఉండరండీ వారం వరం డబ్బులోచ్చే పద్దతిన పని చే సవాలు చాలానే ఉంటారు వారు సరుకులని ముందు తీసుకెళ్ళి వారంతం లో డబ్బు చెల్లిస్తారు .మరి ఈ సంస్తల వాళ్ళ ఇబ్బందే గదా......
కిరాణా షాపు వాడే మాల్స్ లో తక్కువ ధరకి ఆఫర్ల తో కొని షాపు నడపవచ్చు కాని నగదు చెల్లించె వారి సంఖ్య బాగా తగ్గితే వాడికీ కష్టమే గదా  .....!?.
అసలు ఒకసారి ఊహించుకొండి ...ఒక తాత తలకి ఎర్రచెల్ల కట్టుకుని లుంగీ తోనో , ధోతి  తోనో ..... పెద్ద మాల్ కి వచ్చి పండక్కి సరుకులు తీసుకెళ్ళే సీన్ ఎలా ఉంటుందో ......కష్టం ఇప్పటికే మనం చూస్తాం బిగ్ బాజార్, మోర్ లాంటి షాపుల్లో యూత్, అంకుల్స్  లా మిడిల్ ఏజ్ పీపుల్ తప్ప ....మేస్త్రి లు ....చిన్న చిన్న పని చేసుకుని బతికే వారు రారు కొనరు...నిజానికి సెక్యురిటీ వాడిని చూసి మనకి ఇంత  పెద్ద షాపులో కొనడం అవసరమా అకుని వెళ్తారు ఆఫర్లు బాగున్నా సరే ...(ఇది కాస్త అబద్దం లెండి ఆఫర్ అని పెద్ద అక్షరాలలో రాసినంత మాత్రాన నిజానికి లాభసాటిగా ఎం ఉండదు ) .
అసలు బ్రిటీషు వారు వచ్చిందే వ్యాపారం పేరు తో ఇప్పుడు అదే బ్రిటీషు వాడి బ్రీడ్ అయిన అమెరికా వాడు వస్తున్నాడు....ఏమౌతుందో కాని ఈసారి స్వాతంత్ర్యం పొతే మళ్ళీ రాదు ఎందుకంటే స్వాతంత్ర్య యోధులని పిచ్చివాల్లు గా చేసి తరిమి చంపుతారు మన నాయకులు...సో కాల్డ్ విద్యావేత్తలు.


అసలు .....మన వాళ్లకి పక్కవాన్ని కాపీ కొట్టి బతికే బుడ్డి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు....
ఒకటి మాత్రం నిజం దేశం లో చాల మంది అవకాసం ఎప్పుడొస్తుందా దేశాన్ని ఎప్పుడు వదిలేద్దామా .........అని చూస్తున్నారు.
విన్స్టన్ చర్చిల్ అన్నట్లు  .....INDIANS ARE NOT TO RULE THEY ARE TO BE RULED  ని  నిరూపిద్దాం అని ప్రయత్నిస్తున్నారు మన నాయకులు ...............




Monday, 10 December 2012

మగాడు డబ్బులిస్తే తిట్టు,బూతు........... అదే ఆడది డబ్బులిస్తే(కట్నం) సంసారం ...................



కాస్త కటువుగా...A certified గా ఉన్నా నాకెందు కో అనిపించింది రాసేశా !


ఈ మధ్య  ఛీకట్లో   ప్రయాణిస్తున్నట్లుంది .అసలేం అర్థం కావటం లేదు నా ప్రయాణం ఏటో తెలియటం లేదు పరుగు మాత్రం ఆపే ఉద్దేశ్యం లేదు కాని వెలుగు దూరానైనా కనిపించటం లేదు ఆశ చావటం లేదు మ్..............ఏంటో ఎప్పుడు వేలుగోస్తుందో ఎప్పుడు చూడగలనో ..........

Friday, 16 November 2012

మళ్ళీ  ఒక సారి పరీక్షిస్తున్నాను ...........


పని చేస్తోంది ..................అసలు సొంత పేరు తో బ్లాగు పెట్టి తప్పు చేసానండి  .....కొన్ని నిజాలు రాయలేను ,కొన్ని అభిప్రాయాలని వేల్లడించలేను ఎందుకంటే  ఎంచెప్తాం ఫ్రెండ్స్,సంభందీకులు,అందరు చూస్తారన్న భయం..........సో నిర్ణయించుకున్నది ఏంటంటే కొత్త ID తో కొత్త బ్లాగు పెట్టి నాకు వచ్చే తిక్క ప్రశ్నలన్నింటినీ సంధించాలని ............కాని అప్పుడప్పుడు ఈ బ్లాగు లొఅ కూడా poast లు వేస్తూట....

Monday, 23 July 2012

ఒంటరినైపొయాను...ఇక ఇంటికి ఏలా.పోనూ....


జన్మమెత్తితిరా...అనుభవించితిరా....బ్రతుకు సమరంలో ఓడిపొయితిరా....
కలకత్తా.... నా జీవితం లో సర్వ విదముల అనుభవాల సమాహారం... కానీ  గుర్తుండిపొయెవి మనసుని చివ్వుక్కుమనిపించిన  ఙాపకాలే. ఉగాది పచ్చడిలా  అన్నిరుచులు కలబోసినట్లు ఈ కలకత్త అనుభవాలు కూడా అన్ని రకాల అనుభవాలను కలిగి ఉన్నయి వాటిని త్వరలొనె బ్లాగీకరిస్తా....