కరిగి పోయిన సబ్బులు ....అరిగిపోయిన చెప్పులు ....తిరిగిపోయిన క్యాలండర్ ముక్కలు
అయిపోయిన మరొక సంవత్సరం .....
జీవితం మరీ వేగంగా అయిపోతున్నట్లు ఉంది....2010 డిసెంబర్ 4 మధ్యాహ్నం 2.45....ఆ 15 నిమిషాలు నా జ్ఞాపకాల నుండి చెరిగి పోక ముందే 2 సంవత్సరాలు గడచిపోయాయి ...... కాలం పరిగెడుతోంది ,నా జీవితం లో మార్పు....రాలేనంటొంది ....నిజానికి నాకే ధైర్యం లేదు మార్పుని ఆహ్వానించడానికి .
నేనేంటో తెలియక ముందే నేను తప్పిపోయాను .......కాని నేను నేనవ్వడానికి తగిన ధైర్యం లేక ఆగిపొయాను
గడచిన 24 సంవత్సరాలని మంచితనం అనే నాటకం లో పోసి దరిద్రం అనే ఫలాన్ని పొందినా కూడా...మారడానికి నాకు మనసొప్పడం లేదు .
ఒక్క సంవత్సరం నాకోసం ఆగి పోవచ్చు గదా!అత్యాశే.....కాని ఆశ మనసుకి ఊరట, ఊహలు .....కలలు ఇంధనాలు కదా!
ఇంతకీ గడచిన సంవత్సరాన్ని గమనిస్తే ...కలకత్తా చూసాను .....బెంగలూరు చూసాను .....మొదటి జీతం తీసుకున్నాను
బాగానే ఉంది కాని కలలో కూడా ఊహించని విధంగా ఇంటికి దూరం అయ్యాను.....నా అలవాట్లు, కోపం, నేను అనగలిగే అస్తిత్వాన్ని కోల్పోయాను ....
పోయింది..... గడచి పోయింది ...మరో సంవత్సరం,దూరాన్ని పెంచేస్తూ ,ఆశలని తుంచేస్తూ,.....
చూద్దాం వచ్చే సంవత్సరం తీసుకొచ్చే మరిన్ని మలుపులను ,తీరాలను,మజిలీలను .
నేస్తమా 2012 తిరిగి రాని కాలనివైనా.... ,తీపి జ్ఞాపకాలని మిగిల్చిన నీకు ఇవే నా వీడుకోలు,
పరిగెడుతున్న కాల చక్రమ్ లో కరిగి పోవడానికి సిద్దంగా ఉన్న 2013 కి ఇదే నా ఆహ్వానం .........

No comments:
Post a Comment