Thursday, 28 February 2013

పంచభూతాల స్కాములు

1. బొగ్గు నుండి అగ్ని వస్తుంది----- కోల్గేట్ స్కాము .

2. ఆకాశం లో ఉన్న S -బ్యాండ్ కనిపించదు కానీ పని చేస్తుంది
       అలాగే 2G స్పెక్ట్రం ఆకాశం లో ఉంటుంది కానీ  కనిపించదు.

3. గాలి--- ఎన్నో ఫ్యాక్టరీ లనుండి ఫిల్టరు చేయని చెడు కాలుష్య వాయువులు ఎన్నో విడుదల అవుతున్నా                  పట్టించుకోని పర్యావరణ మంత్రిత్వ శాఖా -అధికారులు -మంత్రులు.


4. నీరు  కాస్త ఈ సెక్షను మాత్రం అలా మిగిలిపోయింది కానీ లోపల ఎన్ని జరుగుతున్నాయో ఎందుకంటే గంగా నది నాశనం అయిపోతుంటే చోద్యం చూస్తున్నారు ... కాలుష్య కారకాలని ఫ్యాక్టరీలు విచ్చల విడిగా వదులుతుంటే ఏమి చర్యలు తీసుకోవటం లేదు అంటే ఎంత మింగారో !.(రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలలో ఎంత స్కాము ఉందొ ఇంకోసారి అధికారం లోకి వస్తే దీని పని పడతారు ఖచ్చితంగా!)


5. భూమి మైనింగు భూతం ..... భకాసురుల్లా భూమిని మింగే మంత్రులకి కొదువలేదు .... (పాపం భకాసురుడు భూమిని మింగలేదనుకుంటా,  కానీ అంతా  పోలుస్తున్నారని పోల్చేసా సారీ భకాసురా!)ఇక సెజ్ పేరుమీద భాగస్వామ్యాలు ... ఆహా ఆ రియల్ దందా  చెప్పనవాసరం లేదు!


ఇవ్విదంగా మన కాంగీ లు  గత 10 సంవత్సరాలలో పంచభూతాలని చెరపట్టి విలయతాండవం చేసినా దేశం లో చాలా మంది కళ్ళు ఇంకా తెర్చుకొలెదంటే ఎంత బానిసత్వమో ఈ రక్తపు చుక్కలో ......
బానిసత్వం ఎందుకన్నానంటే 65 సంవత్స్తరాలలో 50 ఏళ్ళు కాంగీ పాలన అంటే ప్రజాస్వామ్యం లో అనధికారిక రాజ్య పాలన. అయినా ఏక -పార్టీ వ్యవస్థ కి ఇంతగా దాసోహం అన్న జనానికి స్వాతంత్ర్యం-స్వపరిపాలన  అవసరమా ......?

ఇది గమనిచే స్వామీ వివేకానంద గారు ఏనాడు స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన లేదనుకుంటా ఒక పుస్తకం లో చదివా స్వామీ వివేకానందులవారు అంటారు "భావ దాస్యం లో  నిండిపోయిన భారత జాతికి కావాల్సింది స్వపరిపాలన కాదు స్వాభిమానం -నేను ఉన్నతుడను అనే ఆత్మ జ్ఞానం" అని ... ఆ బుక్ ఈ సారి ఇంటికేల్లినప్పుడు తీసుకుని ఖచ్చితంగా ఇక్కడ పోస్ట్ చేస్తా!.
అందుకేనేమో మన దేశ యువతని ఉద్దేశించి "లే మేలుకో నీవు సింహానివి లక్ష్యం చేరేవరకు నిదురించకు" అని సింహానివి -సింహానివి అని తెగ అరిచాడు కానీ ఎం చేస్తాం ఆ బ్రిటీషు వాడు అంతా  గోర్రె లని  చేసి వెళ్ళాక కూడా ఈ గొర్రెలు తమ జన్యువులలో గోర్రేతనాన్ని మాత్రమే  నింపుకున్నారు  సింహాన్ని అన్న సత్యాన్ని మరిచారు! .

వెయ్  రాజా వెయ్  ఓటెయ్యి, నీ జన్మకి ఇంకోసారి కాంగీ కి వోటేసే అవకాశం వస్తుందో లేదో వెయ్.... జన్మకో శివరాత్రి అన్నారు నీ జన్మ కో కాంగీ  వోటు వేసి తరించి ఆ మిగిలిన నీటి స్కాము కూడా నింపించు  దగ్గరుండి.

కానీ నా డౌటంతా ఈ పంచ భూతాల మీదనే ఎందుకంటే 2004 లో సునామీ వచ్చి చిన్న పలకరింపు చేసి వెల్లిది వీరి రాకను చూసి పులకరించి!, మరి  వీరి పాలన నచ్చి మిగతా భూతాలూ ఊరుకుంటాయా? మీరు మాతో ఆడారు సరే మరి మేము మీతో ఆడుటాము అంటే మేమంతా కదా చచ్చేది ... ఓహో వారి మింగుడుకు ఓటు  ద్వారా పర్మీషను-అధికారము  ఇచ్చింది మేమే కనుక మేమే అనుభావవించాలా  సరే ..... ఏం చేస్తాం  చావక చస్తామా !!!.

ఇప్పటికే వీరికి అధికారం ఇచ్చి ముంబాయి,పూణే , హైదరాబాదుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సరస సల్లా పాలకు  అనుభవిస్తున్నాం కదా మరి ఈ ప్రకృతి  వైపరిత్యాలు బోనస్సేమో !

విండోస్ 8

మొట్టమొదటిసారి ఈ రోజు విండోస్ 8 వాడాను ... డెల్  లాప్టాప్ లో (కోనేంత  లేదండి ఆఫీస్ లో!)...ఇక్కడ  చూడగానే ఒక విషయం గమనించా  అదేంటంటే విండోస్ 8 లో స్టార్ట్ లోగో ఉండదు అక్కడ ఖాళీగా ఉంచాడు అంటే స్టార్ట్ లోగో ఉండేచోట ఖాళీగా ఉంది (చిదంబరం లో అదృశ్య లింగం లా...!) ఇలా చేసాడేంటి  అని ఆలోచిస్తే తట్టింది ఇంతకుముందు  విండోస్ వాడిచ్చిన స్టార్ట్ లోగో ని గూగుల్ వాడు కాపీ కొట్టాడు కదా  అందుకే  ఈ సారి ఏం  కాపీ కొడతావో ,ఎలా కాపీ కొడతావో చూస్తా అన్నట్లు ఖాళీ గా ఉంచాడు!
నాకైతే అది గమనించగానే సిల్లీ గా "భగవంతుడు నిర్గుణ-నిరామయ-నిరాకారుడు" కనుక ఖాళీ ఉంచాడు  స్టార్ట్ లోగో లేని  విండోస్ సిస్టం .....స్టార్ట్  లేదంటూనే అక్కడ మౌస్ ని ఉంచగానే వెంటనే తన మెనూ చూపించి నేనున్నానోచ్ !అంటుంది!హ హ హ ...... ఇప్పుడు గూగుల్ వాడు ఇక కాపీ కొట్టలేడని అనుకున్నాడు మైక్రోసాఫ్ట్ వాడు కానీ ఖచ్చితంగా ఏదోటి కాపీ కొట్టి ముందుకొస్తాడు అని నా ఊహ!


అయినా స్టిక్కీ  నోట్ లో కాపీ చేసిన కంటెంట్ పేస్టు చేసి ctrl +s  కొట్టే నా ఎదవ మైండ్ కి ఇలాంటి తింగరి ఆలోచనలు పరిశీలనలు కాక మంచివోస్తాయా! ఏమో?

Monday, 25 February 2013

ముఖపుస్తకం

ముఖపుస్తకం లో చూసా...   ఊరిలో ఏదైనా కార్యక్రమం ఉంటే గ్రామపంచాయతి వారు డప్పు చాటింపు వేసి  తెలియ పరిచేవారు దానికి బదులుగా  మైక్ వాడుతున్నారట ఇప్పుడు ఆ ప్ఫోతో ఒకటి పెడితే చూసి ఒక కామెంట్ పెత్త...గ్రామ వాతావరణం దూరమైపోతుంది,దప్పె బాగుండేది అని దానికి నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది వారి అభిప్రాయాలు కామెంటారు ...కానీ నేను వాటికి అంగీకారం తెల్పలేకపోతున్నాను,అక్కడ రాస్తే తెగ ఇది అయిపోయి పర్సనల్ జీవితం లో ముఖపుస్తక  మాటలని సీరియస్ గా తీసుకుని నాకు నెగటివ్ అవతారాని ఇక్కడ వెల్లకక్కుతున్నాను ..ఽసలు చాతిమ్పుకు మైక్ ఏంటి అది చెప్పడానికి మళ్ళీ ఒక బైకు.... ఇంతకుముందు ఇద్దఋ విడి విడిగా వేరు వేరు వీదులల్లో దప్పుతో చాటింపు వేసే వారు కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే బైకు మీద ఒకేసారి మైక్ తో చాటింపు వేస్తున్నారు ఇది కొంచె అతి అనిపించింది వారు చెప్తున్నా కారణాలు కాదనలేము ఇప్పటి వయసు వారు డప్పు కొట్టుటకు వీలు లేకుండా అయింది (సిద్ధంగా లేరు),ముసలి వాళ్లకి గొంతు పెద్దగా రావటం లెదు.... సరె...బాగానె ఉంది మార్పు సహజమే-అభివృద్ధి రావాల్సిందే కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే "టం టం టం....... ఇందు మూలంగా తెలియచేయునది ఏమనగా మన వూరి గ్రామ పంచాయతీలో చీన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారహో...... మీ ఇంట్లో ఉన్న 5ఏళ్ల లోపు పిల్లలకి తప్పకుండా వేయించాలని సర్పంచ్ గారి ఆజ్ఞ .... టమకు టం టం .....  "ఇలాంటి మాచి ట్యూన్ పోతుంది ..... ఆ డప్పు వాయించే "కళ" అంతరిస్తుంది ... అందుకే నాకు నచ్చాలే. 

ఒకరి మాట విని కాం ప్ర మైస్ అయ్యే రకం కాదు నేను, అయినా ఓ ..... పొలోమని  వచ్చి పడ్డాయి కామెంట్లు ..... (నా అభిప్రాయం తప్పు అని నొక్కి వక్కనిస్తూ ) నాకు అర్థం అయింది ఏమంటే నేను ముఖపుస్తాకానికి కొత్త ...... ఇలాంటివి సహజం ...అని, అంతే కాదు  నేను ఒకపట్టాన ఒప్పుకోనని, సో ఈ బ్లాగు వన్-వే లాంటిది కనుక నాకు నచ్చింది టపా అవుతుంది లేకుంటే టపా కడుతుంది ఒకరు చెప్పరు ...ఈ బ్లాగు చూడరు, కనుక హాయిగా మన అభిప్రాయాలు మనవే అంతే......
అక్కటా అని మాత్రం అనుకున్నా ...  వీరి చేత చెప్పించుకుంటినేమయ్యా  అని మాత్రం అనుకున్నా ఎందుకంటే వూళ్ళో ఉండగా మనం వారిని కన్సిడర్ చేసింది లేదు బాగా తెలిసింది లేదు ...ఏదొ ఈ మధ్య ఊరికి దూరంగా ఉన్నాం కదా ఊరి పేరుమీద నడుస్తున్న ముఖపుస్తక గ్రూప్ అని చేరితిని-చేరితిని పో ఏల కామెంట వలే -కామెంటి తిని పో ఎలా వ్యతిరేక అభిప్రాయం వేల్లడాయే- అయ్యెను పో ...నెనెల చింతించవలె .....హ..... 

నాకు ఉన్న ఒకే ఒక ఆశ ...ఒక పల్లెటూరిలో సెటిల్ అవ్వాలి అని నా కల కలలో కూడా తీరవద్దు అని మన ప్రభుత్వం పల్లెటూర్లని నాశనం  చేస్తూ వాటికి నగరాలు- కాలనీలు అని పట్నం రంగు పులుముతూ కాలుష్యం కోరల్లోకి నెడుతున్నారు ,మా గ్రామం వెళుతుంటే 3కి మీ ముందు ఒక చిన్న జామాయిలు చెట్ల అడవి మొదలయ్యి రెండువైపులా ఒక అడవి ఫీల్ తెప్పిస్తుంది. ఇప్పుడది పల్చపడిపోయింది ఇలాంటి కొండ మార్పులు వస్తే ఆ కాస్త ఇష్టం కూడా పోయి ఎక్కడో ఒక చోటికి వెళ్ళింది బెటర్ అనిపించేలా ఉంది అది నా భయం!

Friday, 22 February 2013

భయం

భయం...... భయం ఇదీ ఉగ్రవాదులు మన దేశ ప్రజలకి ఇవ్వలనుకునేది భయపెట్టాలి ఆ వికటాట్ట హాసాల మధ్య మనం భయం తో పరుగులు తీయాలి ...  మన ఆక్రందనలు నొప్పితో చేసే ఏడుపులు...  మరణించిన మనుషుల ఆత్మలు చేసే  ఘోష  ఏమాత్రం జాలిని కలిగించదా ?గాయాల తో నెత్తురోడుతూ సాగించే జీవన ప్రయాణం ఎంతవరకు...... ఎందుకోసం  ఈ పాపపు పని పాపాత్ములు చేస్తుంటే వారికి శిక్షలు వేయొద్దు శిక్షల్ని నిషేదించాలి అని రోడ్డెక్కె నేతలు ఎక్కడ?.... జరగాల్సిన నష్టం జరిగి కుటుంబాలు కూలిపోయినప్పుడు కలిగే బాధ ని కంట నీరుని చూసినప్పుడైనా అనిపించదా ఈ నీచులకి ఇంత  ఘోరాలకి పాల్పడిన వారు శిక్షార్హులే అని?

జనం ముందుకు ఇప్పుడొకసారి వచ్చి అనగలడా ఆ నొప్పిని పంచుకోగాలడా?బతకాలని ఆశ తో(కోటి ఆశలకి తావు లేదిక్కడ!) నగరానికి వచ్చికోచింగ్ తీస్కుంటూ భవిష్యత్తు కోసం తపిస్తున్న ప్రాణం గాలిలో కలిసింది ..ఆ భవిష్యత్తుకు చెప్పగలడా అఫ్జల్ గురు ని ఉరి తీయొద్దని?ఈ నీచ నికృష్ట ఉగ్రవాదులు రేపు దొరికితే వారికి కూడా శిక్ష ఉరి కావాలి ..... మరి అప్పుడు కూడా బ్యానర్లు పట్టుకుని రోడ్దేక్కుతారా ఈ నీచులు.

వర-వర రావు....  ఇప్పుడు ఎందుకు  మూగ బోయింది నీ  గొంతు .... అరువు అరువు.....  ఉద్యమం అని ఏంతో  మంది ప్రాణాలు బాలికోన్న నీకు ఈ ప్రాణాలు ఒక లెక్క కాదు కానీ ఆ కుటుంబాలకి అండ -నీడ భవిష్యత్తుకి మిగిలిన ఆశ మరి ఆ జీవితాల విలువ నీకు తెలుసా ఉగ్రవాదులు కనిపిస్తే కౌగిలించుకొని "నీ తప్పేమీ లేదు నీవైపు నేనున్నా అని భరోసా ఇస్తావా ఏంటి ?". నీలాంటి వాడు కూడా ప్రజాస్వామ్యం లో మానవతావాది అని పిలవబడుతున్నాడే అదీ నా దేశ రాజ్యాంగ గొప్పతనం నీ భాష లో చెప్పాలంటే ...రాజ్యాంగానికొ సలాం అది లాల్  అవ్వచ్చు కాలే అవ్వచ్చు!.

ఇది ఖచ్చితంగా ఉరితీతకి ప్రతీకార చర్యనే అనవచ్చు వారె అఫ్జల్ తమవాడు అని ప్రకటన విడుదల చేసినా నీవు అంగీకరిస్తావా ...... జనాల మధ్య నించొని ఉగ్రవాడికి జై కొట్టి ..... ఉపన్యాసాలిచ్చే నీలాంటి వారు ఉన్నంత వరకు ఉగ్రవాదులకోచ్చిన కష్టం ఏమి లేదు అది తెలిసే వారు రెచ్చిపోతారు.


Wednesday, 20 February 2013

చిరంజీవికి రాజకీయం బాగానే ఒంటబట్టింది

రాజకీయం .....చిరంజీవికి రాజకీయం బాగానే ఒంటబట్టింది ఎందుకంటే తను పొందిన పదవి పర్యాటక శాఖ అంటే మనదేశానికి -విదేశాలకి మధ్య రాకపోకల కు కాస్తవరకు సంబందించిన రాచ కార్యం!.

సో తన వంతుగా సినీ పరిశ్రమకి కాస్త "చేదోడు-వాదోడుగా"   ఉందామని అనుకుని ఒప్పుకున్నట్లున్నాడు (తీసుకున్నాడేమో !).
అసలే పర్మిషన్ల కోసం బాగా తిరిగి ఎక్కే-మెట్టు దిగే-మెట్టు  కనుక పర్యాటకం బాగానే ఉంటుంది బావా అని అరవింద్ చెబితే ఉ ...... అనేశాడేమొ .
అసలు ఈయన రాష్ట్ర కాంగ్రేసుకి పెద్దగా చేసింది పైకి కనబడుటలేదు(లోగుట్టు-పెరుమాళ్ళకెరుక)అయినా  పిలిచి పార్టీలో స్థానం ఇచ్చి- రాజ్యసభ లో  సీటిచ్చి- పదవిచ్చి -నెత్తిన పెట్టుకుంది కాంగిరేసు.  మరి ఆనాడు అంతా  వై.ఎస్ పథకాలవల్లే  కాంగిరేసు గెలిచింది-అన్నారు ప్ర. రా.పా కూడా ఒక కారణం అని భావించి ఇంత  పని చేసిందా!?!. ఏదేమైనా చిరు మంచి అవిడియా వేసి జనాన్ని(సారి నమ్మకాన్ని ) అమ్మాడు అనేది వాస్తవం.

ఈ మధ్య వార్తల్లో చదివా మన తెలుగు సినిమా షూటింగు వాళ్ళు  యూరపు...  అందులోనూ స్పెయిన్ లో కలియ తిరుగుతున్నారని బాగానే పంపుతున్నరనుకుంటా!.

సరేలే ఠాగూర్ డవిలాగులు బాగా పండి వోట్లిచ్చాయి సినిమా ఆడింది కదా అని తనూ ఆడితే ఇదిగో ఇలానే ఉంటుంది జనం ఈసడించుకున్నా- కాంగీ మాత్రం వదలలేదు అంటే చంద్రబాబు ని ఎదుర్కోవడానికి కాంగీ ికి  దొరికిన "బినామి" అన్నమాట!.
జరా బద్రంగా ఉండి  ఈసారైనా మేల్కోక పొతే కొత్త కొత్త పేర్లు పెట్టేసి కుంభ కోణాలు  చేసి పార దొబ్బుతారు ఈ కాంగీ నాయాళ్ళు! నా సంపాదనని ట్యాక్స్ రూపం  లో తీసుకుని  ఇటలీకి తరలిస్తారు ఇలాంటి బినామి నాయకులు ఓట్ల ని ఇస్తారు.

నిజంగా రాజకీయం మాత్రం బాగా అబ్బింది. కాని తెలుగు వాణ్ని మళ్ళీ మదరాసి గుంపులో కలిపి పారేశాడు హిందీ లో మాట్లాడడం రాక!, త్వరలో నేర్చుకుంటా అని ఒ....పెద్ద మైకు ముందు అనేసి మదరాసి టచింగ్ ఇచ్చాడు!


Tuesday, 19 February 2013

ఎన్నికల పండగ

ఎన్నికల పండగ .... ఎలాచ్చన్న్లు ఒస్తున్నాయహొ....!

అవునండి ఈ గ్రామపంచాయతి ఎన్నికలు అంటే మహా ప్రాధాన్యం ఎందుకంటే ఓటు హక్కు ఉన్న ప్రతోడూ తాగి తందానాలాడొచ్చని.

నిజం ...నిజ్జంగా నిజం 15ఏళ్ల పైబడ్డ వారికి ఈ కాలం లో మందు మహా  తేలికగా- తెరగా దొరుకుతుంది పైగా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్టు గదా ఇక పండగే అన్నమాట!.

నా గతానుభం ద్వారా ఇక్కడ చెప్పగలుగుతున్నాను(అంటే నేను బానిసనని కాదు నా ఫ్రెండ్స్ కొందరు ఇలాంటి సందర్భం లో చెడిపోయారు అలా!) ...కొత్తగా తాగుడు మొదలెట్టే కాలమిది, చాలామంది ఈ కాలం లోనే  మొదటిసారి మందు  ముడుతారు ఇక చూస్కో ఇప్పుడు మొదలెడితే సుమారు చచ్చే దాకా వదలరు ఇప్పుడు పడే బీజం మహత్తరమైనది మరి!!.

కాస్త సీరియస్ గా  రాస్తను....
నిజంగా ఎవరైనా సర్వ్యే  చేస్తే నిప్పులాంటి నిజాలు తెలుస్తాయి ఈ నిప్పులు  అడవిని కాల్చేవి కాదు కొంపలు కాల్చేవి ఇప్పుడు తేరగా వస్తుంది కదా అని అలవాటు లేని వాళ్లు కూడా తాగటం మొదలుపెడతారు,తర్వాత బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటారు .ఈ పాపం అన్ని పార్టీ లది.

చిన్న చిన్న గ్రామాల్లో యువత తాగుడు మొదలెట్టే కాలం ఈ ఎన్నికల ప్రచారం తో ప్రారంభమౌతుందిం. అన్ని పార్టీల  లోకల్ నాయకులు వారి బావుల కాడ  -పొలాల వద్ద రాత్రి పూట రంజుగా ఈ "వైతరణీ నదిని పారిశ్తారు!!@!".

ఎవరూ దీన్ని ఆపలేరు ఎందుకంటే ఎన్నికల సంఘం కనుక ఎవరినైనా నియమిస్తే  వాడు అన్ని పార్టీల వద్ద ఇంత  తీస్కుని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంతే .....  మిగతాది ఎప్పటిలానే.

మరి ఆపటం ఎలా..... హి హే  హె .... చెప్పటం కష్టం .
మీ కింద ఎవరైనా 15 ఎల్లా పైబడి ఇంకా మందేయటం నేర్వలేదంటే వారిని కాస్త 45 దినాలు కట్టడి చేస్తే చాలు.


లేదు మనమే మాచి ఎమ్.ఎస్ లము అయితే ఇంకేముంది నా రాజ కుమ్మిక ఎత్తే సీసకి దించే సీస కీ టైం గ్యాపు ఇవ్వకుండా .... పంచె నేతకి తాతలు గుర్తొచ్చేలా తాగింది ఎక్కడాని -దిగడాని కి కూడా కన్ఫ్యూస్ అయ్యేలా కుమ్మొదులు  అంతే !!!. 

Friday, 15 February 2013

ఒక వితండం

ఒక వితండం....బాగా చదివి మాంచి జ్ఞానం సంపాదించిన తలలు అన్ని ప్రైవేటు రంగం లో స్తిరపడితే  మరి ప్రభుత్వ రంగం లో  ఉండే వాళ్ళంతా నాసిరకంగా జ్ఞానులైనప్పుడు మాంచి సేవలు ఎలా దొరుకుతాయి?
బయట చాలా ఉదాహరణలు దొరుకుతాయి .......మంచిగా చదివి చేతికి  గవర్నమెంటు ఉద్యోగం వచ్చినా జ్ఞాన-సముపార్జన ఆగిపోతుందనే కారణంగా ప్రైవేటు ఉద్యోగానికే వెళ్ళేవాళ్ళు చాలామందే ఉంటారు!.
ఐ.ఐ.టి లలో చదివిన వాళ్ళు ఎంతమంది ప్రభుత్వరంగం లోకి వస్తున్నారు?
సరే ఐ.ఐ.టీ  ల కె తెలివుందా  మిగతా వారికి లేదా అంటే మరి కంపెనీలన్నీ ఐ.ఐ.టీ ల  నుండి వచ్చిన వారికి పెద్ద మొత్తాల్లో జీతాలు ఎందుకిస్తాయి ?.
మరి ప్రభుత్వ రంగంలో వారు ప్రైవేటు రంగం వారితో సమానంగా ఎదగాలంటే అడ్డదారులు తోక్కక తప్పటం లేదు అనే స్తాయికోచ్చే బదులు జీతాలు పెంచి జ్ఞానవంతులకె ఉద్యోగాలివ్వ వచ్చు గదా!అప్పుడు ఈ స్కాముల గొడవ ఉండదు.

 కానీ మన జనం  కూడా  అవినీతికి బాగా అలవాటు పడ్డారు-అందుకే అడ్డదారుల్లో పని కావాలని ప్రయత్నిస్తారు అందుకేనేమో మనకి ఇలాంటి నేతలున్నారు.

 ఇదేనేమో "యదా రాజా తథా ప్రజా "అంటే!.

Wednesday, 13 February 2013

దాస్యం

పరిగెడితే దొరికేది స్వేచ్చ కాదు భయం......నీకు స్వేచ్చ  స్వాతంత్ర్యాలు కావాలంటే నిలబడు, ఎదురుతిరుగు , ప్రశ్నించు ముందున్నది ఏదైనా ఎదుర్కో .

మన భారత దేశ ప్రజలు ఇప్పటికీ భావ దాస్యం తో ఉన్నారు, నా జీవితం లో .....ఆంగ్లేయులే కాస్త నయం మన దేశం విడిచి ప్రపంచం లో ఎక్కడో ఒక మూల బతికింది మేలు అని అనే వాళ్ళు ఎదురు పడుతున్నారు(ఈ మధ్య ఎందుకంటే.... ఈ మధ్యన్నే నేను బయటి ప్రపంచం తో కలిసాను అదేనండి చదువైపోయి సమాజం లో పడ్డాను !) .

వారందరికీ నే చెప్పేది పై మొదటి వాక్యమే!!!
అసలు మన రక్తం లో ఇంకా భయం పిరికితనం పోలేదు,ఎందుకంటే ఒక సారి ఊహించుకోండి మిమ్మల్ని ఒక చీకటి కొట్టం లో బందించి కంటికి ఏమికనిపించని విధంగా చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది అలాంటి దరిద్రం లో మిమ్మల్ని పొట్టు  పొట్టు  కొడితే ఎంత భయానకంగా ఉంటుంది!!.మరి మనపూర్వీకులు అలాంటి బాధలేన్నో ఓర్చుకుంటే గాని మనకి స్వాతంత్ర్యం దొరకలేదు మరి వారు అనుభవించిన భయం తాలూకు లక్షణాలు ఇంకా మన లో ఇంకా పోలేదు అందుకే ఇలా ఆలోచిస్తారు వదిలేల్లి పొతే ఎంతబాగుటుండు .....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది !!!!అని కాని బయటి దేశం లో వెళ్లి బ్రతికితే ప్రశాంతత దొరుకుతుంది కాని సార్థకత దొరకదు,(సర్లే నీకొస్తే నీవేల్లవా అంటారేమో వెళ్తా కాని పారిపోవాలని కాదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి!).చాలా మంది ఈ దేశం లో ఉంది నల్లదనం  పెంచడానికి శిస్తు కట్టేబదులు విదేశాల్లో సెటిల్ అయితే బెటర్ అనేలా తయారయ్యారు!.

మరి ఇది పారిపోవడమే కదా....దాస్యమే కదా!.జలియన్ వాలా భాగ్ ఉదంతం లో ప్రాణాలు పోతూ ఉంటే  ఒక మనిషిలో కలిగే భయాలు తరతరాలు అలా కొనసాగుతున్నాయేమో! అరె మనల్ని కొట్టే ప్రతివాడు గోప్పోడయిపోతాడు వాడికి చెక్క భజన గాళ్ళు పుట్టుకొస్తారు!

మరో విషయం అసలు ఈనాడు అఫ్జల్ గురు ని ఉరి తీస్తే అరిచేవాళ్ళు ఒక బులెట్ గాయం చేసే నొప్పి తెలుసా?
అయినా వీళ్ళు బాద   తో అరుస్తున్నట్లు లేదు భయం తో అరుస్తున్నట్లుంది.

ఔరంగ జెబ్ ..కత్తి  తో మతాన్ని మార్చాడని చరిత్ర ఘాట్టి గా అరుస్తుంటే..ఒకసారి విని అసలేం జరిగిందో తెలుసు కోవడానికి ప్రయత్నిస్తే .....తల తెగిన మొండేలని  చూపించి కుటుంబ సభ్యులతో మతం మార్పించారు, అవయవాలు కోసి బెదిరించి మతం మార్చారు,మరి అలాంటప్పుడు  కలిగిన భయం ఇంకా నేటి తరాల లో పోలేదనుకుంటా అందుకే లేని పోనీ సానుభూతి చూపిస్తారు ఆ దాస్యం నుండి విడలేదు కనుకే ఇప్పటికీ పరమతాలు గొప్ప ని వాగుతారు గొప్ప అంటే  పర్వాలేదు కాని నా దేశ సంస్కృతి ఇచ్చిన  పురుశ సూక్తం మీద పడి  ఏడిస్తే కాలిపోతోన్దిక్కడ ఇలాంటి కుక్కలా నాలుకలు తెగ్గొయాఅలనిపిస్తున్ది!.వీడి  పూర్వీకుడు పరమ పిరికి పంద  అయ్యి మతం మారి నేడు దేశ సంస్కృతీ ,ధర్మం మీద పడి  విచ్చలవిడిగా బతికేస్తున్నాడు ఆ తెగిన తలల నొప్పి వీడికి తెలిస్తే వీడిలా మాట్లాడుతాడా?

Sunday, 10 February 2013

మోసం

మోసం ....67 ఎళ్ళ నుండి చేస్తున్నా మారరు ఈ అమాయకులు ఇన్నేళ్ళ నుండి మేమే సెక్యులర్ మేమే సెక్యులర్ అంటూ మోసం చేస్తూంటే ఆ చేతి లో నలిగి పోతూ ఇప్పటికీ కనీస వసతులు  లేకున్నా.... ఇవ్వకున్నా అదే చేతిని నమ్మి "మేము హిందువుల కంటే అన్ని విషయాలలో వేరు కాని కాంగీ ని నమ్మి చేతిలో నాశనం కావడం లో వారితో సమానమే అని నిరూపిస్తున్నారు మన మైనారిటీ సోదరులు ".

 ఆ అఫ్జల్ దరిద్రున్ని ఉరి తీస్తే ఎర్రలు ధర్నా అని ఎగురుతున్నారట   న్యూస్ లో చూసా ఎందుకో తెలియదా .....వైఎస్ పుణ్యాన చచ్చిన ఎర్ర(ర్రి ) తనాన్ని మైనారిటీ ఓట్ల తో బతికిద్దామని కక్కుర్తి!.

అయినా అఫ్జల్ గాన్ని నెత్తికి ఎత్తుకుంటే ఓట్లేసే  విశ్వాస హీనులు రేపు పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే మన సైనికులదే తప్పు అంటారు గాని పాకిస్తాంది తప్పు అనరు అక్కడ చచ్చే భారతీయ  సైనికులని చూడరు కాని పాకిస్తాన్ సైనికున్ని జాలిగా చూస్తారు ఇక ........ మన అక్బర్ భాయి ..'నో'రెత్తుతాడు !!!.

అసలు ఆ పార్లమెంటు పై దాడి కార్గిల్ విజయం పై కక్ష తో చేసింది కాదా!ఇక్కడ లోపాలు కాదు చూడాల్సింది మళ్ళీ అలాంటిది చేయాలంటే భయం కలగడానికి ఘాట్టి జవాబివ్వాలి ఈ వరవర రావు గానిదేం   పోయింది చచ్చేది మన సెక్యురిటీ కోసం ప్రాణాలిచ్చే వారిది కదా!, ఆ కుటుంబాల  ముందు  ఈ ధర్నా చేస్తే తెలిసేది వాడికి  ఆ బాధ!
హ్యుమన్ రైట్స్ -తొక్క - తోలు అనే వాళ్ళు ఇక సైనికులు బార్డర్ లో ఉండనవసరం లేదని చెప్తారేమో ఎందుకంటే చావు ఎవరికైనా  చావే కదా వీరికి .....ఒక్క ఉగ్రవాది ఇలాంటి  వాణ్ని చంపితే తెలుస్తుంది ఆ చావు నొప్పి.
ఎదవలని ఎందుకు కాపాడుతున్నామా అని సైనికులు అనుకునేలా ఉన్నాయి ఈ ఓటు బ్యాంకు రాజకీయనాయకుల చేష్టలు.

ఉరి ఆన్ని విష యాలలో ఒకటి అనలేము వాడు పార్లమెంటు పై దాడి చేసాడు, రేప్  కి ఉరి కావాలి అందులో న్యాయం ఉంది - దేశం పై దాడి కి అవసరం లేదా? అలాంటప్పుడు ఈ దేశానికి సైన్యం ఎందుకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని వదిలేయవచ్చుకదా!   ఈడికి- ఈడి  పెళ్ళాం పిల్లలకి బాద  కలిగితే "చంపండి నా  యాల్లని" అని అనడా?  అయినా తప్పుకి తగిన శిక్ష లేకుంటే ఎందుకండీ ఇక చట్టం?.


ఎవడు కాపాడుతాడో ఈ దేశాన్ని...... నన్ను!

ఓపికుంటే వెళ్లి చూడండి వీడి ఆకృత్యాలని
"http://www.youtube.com/watch?feature=player_embedded&v=bZYm57XeYqU"

Wednesday, 6 February 2013

ఫోనులో ప్రేమ

ఫోనులోనే ప్రతిపాదనలు - ఫోనులోనే అమ్మా నాన్న లతో మాట్లాడడం ...ఫోనులోనే నిర్ణయాలు - ఫోనులోనే నిరాకరణ అన్నీ ఫోనులోనే ఏం  ప్రేమరా బాబు!........అవునండి నా కాళ్ళ ముందే కొద్ది రోజులుగా జరిగిన ప్రేమ వ్యవహారం అంతా  ఫోనులోనే మరీ పరాచికాలైపోయాయి ఈ రోజుల్లో పాపం ఆ అమ్మా నాన్న ఎంత కుమిలి పోయారో!ఎంత ఆలోచించారో! సడెన్ గా ఫోను చేసి ఇదీ సంగతి అని చెపితే ఎంత ఊహించుకుంటారు వీడికి ఆ సెన్స్ లేక అంతా  ఫోనులోనే.......... నాకైతే దిమ్మ తిరిగి పోయింది ఈ ఫోను వ్యవహారం చూసి......నా బాదేంటంటే?..నేను సలహాలివ్వాల్సిన గత్యంతరం రావడం!కాని నావరకు బానే నెగెటివ్ సలహాలిచ్చా!మరంతేగా ఈ ఫోను ప్రేమకి ప్రోత్సాహం అవసరమం?ఇది  నా అభిప్రాయం! సరే లెండి  వివరంగా తర్వాత రాస్తా గాని ఇప్పటికింతే.:-)

Saturday, 2 February 2013

జంధ్యాల

జంధ్యాల గారి హై  హై  నాయక  సినిమా మళ్ళీ ఓ సారి  చూసా ....ఆహా ఎం సినిమా అండీ మొత్తం సినిమా.....వర్షం వెలిసాక  తీసినట్టు ఉంది ఎంత బాగుంటుందో,అసలు ఈ సినిమా ని వర్షా కాలం లో చూస్తె ఇంకా బాగా ఉంటుంది.
మహానుభావుడు ఎంత మంచి సినిమాలు తీసాడు,అసలు ఈ సినిమా చూస్తూంటే భలే ఉంటుంది ఆ తెలుగు మాష్టారి కష్టాలు, బామ్మ చాదస్తం, ఆ పాటలు భలే గా ఉంటాయి ఆ లోకేషన్లు ఎక్కడివో గానీ కేక,పచ్చగా గడ్డి ,మచి పల్లె వాతావరణం.

ఇది సరిగమలెరుగని ........భాషే లేని భావము పాట ,  అచ్చులు పదహారు న వయసల్లె హల్లులు 32 పాట  ఇవ్వన్ని ఒక ఎత్తు.... గురువంటే గుండ్రాయి కాదు..పాట మస్తుగా ఉంటుంది.

ఒక్కొక్కరి నటన చాలా బాగుంది నరేష్ ఆక్టింగ్ సూపర్,ఆ బుడ్డోడి వేషం వేసింది ఎవరో గాని కెవ్వు అసలు,రాదా రాణి - మాష్టారి ప్రేమ- వారి మధ్య వచ్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి!
అసలు నాకు మనసేం  బాగాలేనప్పుడు  ఈ సినిమా చూస్తే ..ఎంత రిలాక్సింగా ఉంటుందో!ఆ సినిమా నాకు బాగా నచ్చిన సినిమాల్లో ముందుంటుంది.
జంధ్యాల గారికి పే..............ద్ద  అభిమానిని అంటే వయసులో కాదండి!చాల ఇష్టం అని నా భావం,ఆయన సినిమాలు సుమారు 15 చూసుంటా(దర్శకత్వం చేసినవి ) అవన్నీ నాదగ్గర ఉన్నాయి కాని బాధ కలిగించే విషయం ఏంటంటే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని అందుబాటులో లేవు అసలు వాటి లిస్టు పూర్తిగా ఎక్కడా దొరకదు వికీపీడియా  లో  ఉన్న సినిమాలల్లో కొన్ని మాత్రమె అందుబాటులో  ఉన్నాయి .

ఎం రాసినా తక్కువే .......ఎం రాయాలో తెలియడం లేదు ఇదెలా ఉందంటే ప్రేమలేఖ రాస్తున్నప్పుడుండేంత కఫ్యుశన్ గా ఉంది,పోలిక తప్పయినా భావం మాత్రం అదే అంత  ఇష్టం ఆయన సినిమాలు రచన,కనుక ఈ టపా ముగిస్తున్నాను.