ముఖపుస్తకం లో చూసా... ఊరిలో ఏదైనా కార్యక్రమం ఉంటే గ్రామపంచాయతి వారు డప్పు చాటింపు వేసి తెలియ పరిచేవారు దానికి బదులుగా మైక్ వాడుతున్నారట ఇప్పుడు ఆ ప్ఫోతో ఒకటి పెడితే చూసి ఒక కామెంట్ పెత్త...గ్రామ వాతావరణం దూరమైపోతుంది,దప్పె బాగుండేది అని దానికి నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది వారి అభిప్రాయాలు కామెంటారు ...కానీ నేను వాటికి అంగీకారం తెల్పలేకపోతున్నాను,అక్కడ రాస్తే తెగ ఇది అయిపోయి పర్సనల్ జీవితం లో ముఖపుస్తక మాటలని సీరియస్ గా తీసుకుని నాకు నెగటివ్ అవతారాని ఇక్కడ వెల్లకక్కుతున్నాను ..ఽసలు చాతిమ్పుకు మైక్ ఏంటి అది చెప్పడానికి మళ్ళీ ఒక బైకు.... ఇంతకుముందు ఇద్దఋ విడి విడిగా వేరు వేరు వీదులల్లో దప్పుతో చాటింపు వేసే వారు కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే బైకు మీద ఒకేసారి మైక్ తో చాటింపు వేస్తున్నారు ఇది కొంచె అతి అనిపించింది వారు చెప్తున్నా కారణాలు కాదనలేము ఇప్పటి వయసు వారు డప్పు కొట్టుటకు వీలు లేకుండా అయింది (సిద్ధంగా లేరు),ముసలి వాళ్లకి గొంతు పెద్దగా రావటం లెదు.... సరె...బాగానె ఉంది మార్పు సహజమే-అభివృద్ధి రావాల్సిందే కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే "టం టం టం....... ఇందు మూలంగా తెలియచేయునది ఏమనగా మన వూరి గ్రామ పంచాయతీలో చీన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారహో...... మీ ఇంట్లో ఉన్న 5ఏళ్ల లోపు పిల్లలకి తప్పకుండా వేయించాలని సర్పంచ్ గారి ఆజ్ఞ .... టమకు టం టం ..... "ఇలాంటి మాచి ట్యూన్ పోతుంది ..... ఆ డప్పు వాయించే "కళ" అంతరిస్తుంది ... అందుకే నాకు నచ్చాలే.
ఒకరి మాట విని కాం ప్ర మైస్ అయ్యే రకం కాదు నేను, అయినా ఓ ..... పొలోమని వచ్చి పడ్డాయి కామెంట్లు ..... (నా అభిప్రాయం తప్పు అని నొక్కి వక్కనిస్తూ ) నాకు అర్థం అయింది ఏమంటే నేను ముఖపుస్తాకానికి కొత్త ...... ఇలాంటివి సహజం ...అని, అంతే కాదు నేను ఒకపట్టాన ఒప్పుకోనని, సో ఈ బ్లాగు వన్-వే లాంటిది కనుక నాకు నచ్చింది టపా అవుతుంది లేకుంటే టపా కడుతుంది ఒకరు చెప్పరు ...ఈ బ్లాగు చూడరు, కనుక హాయిగా మన అభిప్రాయాలు మనవే అంతే......
అక్కటా అని మాత్రం అనుకున్నా ... వీరి చేత చెప్పించుకుంటినేమయ్యా అని మాత్రం అనుకున్నా ఎందుకంటే వూళ్ళో ఉండగా మనం వారిని కన్సిడర్ చేసింది లేదు బాగా తెలిసింది లేదు ...ఏదొ ఈ మధ్య ఊరికి దూరంగా ఉన్నాం కదా ఊరి పేరుమీద నడుస్తున్న ముఖపుస్తక గ్రూప్ అని చేరితిని-చేరితిని పో ఏల కామెంట వలే -కామెంటి తిని పో ఎలా వ్యతిరేక అభిప్రాయం వేల్లడాయే- అయ్యెను పో ...నెనెల చింతించవలె .....హ.....
నాకు ఉన్న ఒకే ఒక ఆశ ...ఒక పల్లెటూరిలో సెటిల్ అవ్వాలి అని నా కల కలలో కూడా తీరవద్దు అని మన ప్రభుత్వం పల్లెటూర్లని నాశనం చేస్తూ వాటికి నగరాలు- కాలనీలు అని పట్నం రంగు పులుముతూ కాలుష్యం కోరల్లోకి నెడుతున్నారు ,మా గ్రామం వెళుతుంటే 3కి మీ ముందు ఒక చిన్న జామాయిలు చెట్ల అడవి మొదలయ్యి రెండువైపులా ఒక అడవి ఫీల్ తెప్పిస్తుంది. ఇప్పుడది పల్చపడిపోయింది ఇలాంటి కొండ మార్పులు వస్తే ఆ కాస్త ఇష్టం కూడా పోయి ఎక్కడో ఒక చోటికి వెళ్ళింది బెటర్ అనిపించేలా ఉంది అది నా భయం!
No comments:
Post a Comment