సరైన విషయం ఆఖరు పేరాగ్రాఫ్ లో ఉంది చివరిదాకా చదవండి :)
ఒక ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లు పెరిగిన నాడు దొంగల అంతా కలిసి వారికి అనుకూలమైన చట్టాలు చేసుకుంటారు. నడివీధిలో దొంగతనం చేసినా శిక్ష పడకుండా చక్కటి Exceptions తో దొంగ కి ఎటువంటి శిక్షణ లేకుండా చట్టాలు చేసుకుంటారు ఇది ప్రాక్టికల్ గా సాధ్యం....
పాకిస్తాన్ ఏర్పడినది ఇలాంటి ఆలోచన విధానం తోనే.
మొదటిసారి కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము షాదీ ముబారక్ అనే ఒక పథకాన్ని మొదలుపెట్టింది అది ఏమిటంటే ముస్లిం వివాహ వ్యవస్థ ప్రకారం పెళ్లికి ముందు ఆడపిల్ల, అబ్బాయి కుటుంబానికి కొంత ఆర్థిక రుసుము చెల్లించాలి...... వారి వివాహ వ్యవస్థ ఈ విధానం కలిగి ఉంది కాబట్టే కర్ణాటక సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు షాది ముబారక్ మేర లక్ష రూపాయల డబ్బు విడుదల చేసేవారు... ప్రతి ముస్లిం యువతి వివాహానికి ఒకటో పెళ్ళాం రెండో పెళ్ళాం మూడో పెళ్ళాం నాలుగు పెళ్ళాం.....నియమాలకతీతంగా :)
రిటైర్మెంట్ అయిన తర్వాత బడ్జెట్ పెన్షన్ కూడా నలుగురు పెల్లాల కి విభజించబడుతుంది 40 ఏళ్ల వరకు అయినా సరే ఆఖరిపెళ్ళాం బ్రతికున్నంత వరకు చెల్లించబడుతుంది ...ఆవరేజ్ ప్రకారము ఒక రిటైర్డ్ ముస్లిం వ్యక్తి ఎక్కువ పెన్షన్ డ్రా చేసుకుంటాడు ...అదే ఒక హిందూ వ్యక్తి ఒక పెళ్ళాం కారణంగా భార్య-భర్త లైఫ్ టైం ప్రకారం తక్కువ పెన్షన్ తీసుకోగలరు.....
ఎడ్యూరప్ప విపరీతంగా ప్రభుత్వం యొక్క మత సంతుష్టీకరణను విమర్శించడం కారణంగా సిద్ధరామయ్య కాస్త తగ్గి కళ్యాణ భాగ్య పేరిట కేవలం ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల నగదు ఇవ్వడం మొదలుపెట్టారు.
తర్వాత ఈ పథకం బాగుంది కదా అని మోదీ కూడా కళ్యాణ లక్ష్మి కి శ్రీకారం చుట్టి కొంత డబ్బును విడుదల చేయడం ఆరంభించారు ..... ఎడ్యూరప్ప వచ్చిన తర్వాత హిందువుల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏసీ/ఎస్టీల కీ ఓబీసీలకు కల్యాణ భాగ్యాని అమలు చేశారు.
ఇప్పుడు దేశమంతటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వివాహం సందర్భంగా కళ్యాణ లక్ష్మి పథకం అమలులో ఉంది లక్ష రూపాయల నగదు ఇవ్వబడుతుంది(కుల మతాలను బట్టి 1,50,000 నుండి 1,16,000 వరకు మారుతది).
90వ దశకంలో వరకట్నమనేది సమాజానికి పట్టిన పెద్ద శాపం ఎన్నో హత్యలు ఎన్నో కేసులు , Fake కేసులూ ...ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి ఈ వరకట్నం జాఢ్యం మూల కారణం.
2000 నుంచి 2005 మధ్యలో పాఠశాలల్లో కూడా వరకట్న వ్యతిరేక వ్యాసాలు ఉపన్యాసాలు పోటీ పెట్టేవారు అంటే సుమారు 2010 వరకు వర కట్నం అనేది ఒక సామాజిక దురాచారం.
( నాకు వ్యక్తిగతంగా వరకట్నం పట్ల వ్యతిరేకత ఏర్పడడానికి ఒకానొక కారణం జంధ్యాల గారి సినిమాలు... :) ఎన్నో సినిమాలలో తమాషాగా వరకట్నం కి సంబంధించిన సన్నివేశాలను చక్కగా సినిమాలో ఇమడిచేవారు ఆయన దర్శకత్వం వహించిన సొంత సినిమాలేకాకుండా ....మాటలు, కథ అందించిన సినిమాలలో కూడా !!).
కానీ ప్రజాస్వామ్యం ద్వారా ఈ వర కట్న దాహం కలిగిన ఓటర్లు సాధించిన పెద్ద విజయం ఏంటంటే 1985లో ఎన్టీఆర్ అనే సి యం వరకట్న వ్యతిరేక నియమాలను ఏర్పరిచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ వరకట్నానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన- ఆచరణ ను ముందుకు తోశారు.
2015 వచ్చేసరికి ప్రభుత్వమే వరకట్నం చెల్లిస్తోంది ఇది ప్రజాస్వామ్యం లో ఓటరు దిగజారితే వచ్చే మార్పులు.
వర కట్నం అనేది "దురాచారం"నుండి ప్రభుత్వ ప్రోత్సాహం గా మారడానికి పట్టిన కాలం కేవలం 30 సంవత్సరాలు మూడు దశకాలు ....6 ఎన్నికలు... కేవలం 6 ఎన్నికలలో ఒక దురాచారం కాస్త ..... "ప్రోత్సాహక పథకం" గా మారింది!!!
==== ఇటువంటిదే ఉచిత విద్యుత్తు కూడా!!!====
90వ దశకంలో మీటర్ పెట్టి విద్యుత్తు తీసుకుని నెలనెలా విద్యుత్తు రుసుము చెల్లించడం తలకు మించిన భారం... అందుకని మెయిన్ విద్యుత్ వైర్లకు దొంగ కనెక్షన్లు తగిలించి విరివిగా విద్యుత్తు వాడుకునేవారు ...అడపాదడపా విద్యుత్ శాఖ ఉద్యోగులు వస్తే, క్షణాల్లో వైరు లాగేసుకుని.. తప్పించుకునే వారు. కానీ ఓటర్ మహాశయుల పోరాటంతో ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇచ్చే స్థితికి దిగజారింది.
#######
వచ్చే పది సంవత్సరాలలో ఎన్నికలకు ముందు మద్యం, బిర్యానీ పంచడం ఓటు వేయడానికి ప్రోత్సాహక పథకం గా మారిన ఆశ్చర్యం లేదు.
అలాగే 15 సంవత్సరాలలో ఎన్నికలకు ముందు ఓటుకు ఇంత డబ్బు అని చెల్లించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రోత్సాహక పథకం మారిన ఆశ్చర్యపోనవసరం లేదు దిగజారుతున్న ఓటరు ప్రజాస్వామ్యంలో సాధించలేని అవలక్షణం అంటూ ఏమీ లేదు.
నేను జనాన్ని తిడుతున్నాను అనుకుంటే ఈ పోస్ట్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు!! నేను తప్పు పడుతోంది డెమోక్రసీ ని ...అవును ప్రజాస్వామ్యాన్ని!! ప్రజాస్వామ్యం అనేది విగ్నత కలిగిన తెలివైన పౌరులున్న సమాజానికి మంచిది..... అంతేకానీ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న అవినీతిమయమైన సమాజానికి ప్రజాస్వామ్యము మంచిని చేయదు.
పైగా భారతీయ సంతృష్టీకరమైన రాజకీయాల కారణంగా షరియా .. ఇస్లామీకరణ వైపు తోయబడుతుంది... ఒక చక్కటి ఉదాహరణ ఈ నెలలోనే పంజాబ్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పరచడం రంజాన్ కానుకగా !!
భారతదేశ పౌర సమాజానికి చైనా వంటి కమ్యూనిస్టుల పరిపాలన అవసరం చాలా ఉన్నది!!! కానీ అది భారత దేశం కోసం పని చేయాలి .....దురదృష్టవశాత్తు భారతదేశ కమ్యూనిస్టులు అందరూ చైనా మాతృదేశంలా భావిస్తారు... రష్యా వారికి పితృ దేశం!! భారతీయ కమ్యూనిస్టులు అందరికీ భారతదేశం అన్నా భారతీయ వ్యవస్థ అన్నా... ఏవగింపు..వెగటు... ద్వేశం....పగ.
""తెలంగాణ 90mlపింకీలు.... తెలియకపోతే మూసుకొని ఉండండి కళ్యాణలక్ష్మి మూలం సిద్ధరామయ్య... మీ కచర దొర కాదు. ఇదొక కాపీపథకం, మీదొర మొదలుపెట్టింది రైతుబంధు మాత్రమే"".