Monday, 15 July 2013

సున్నా పుట్టుక

హైందవ సంస్కృతి, మానవ సమాజానికి దిశానిర్దేశంగా ఉండటానికి 4 వేదాలు ఇచ్చింది. మనిషికి అవి అర్దం 

కాలేదు .... సరే 4 వేదాలు తేలికగా అర్థం కావడానికి 6 వేదాంగాలని ఇచ్చింది మన హైందవ 

సంస్కృతి......అయినా అర్దం కాలేదు, సరే మట్టి బుర్రలు అనుకుని 16 ఉపనిషత్తులని ఇచ్చింది....... క్రతువుల 

గురించి సమూలమైన వివరణ తో కూడిన ఈ ఉపనిషత్తులు కూడా మనిషికి ఎక్కలేదు..... ఇలా కాదని 18 

పురాణాలు ఇచ్చింది..... ప్రకృతి లక్షణాల కాన్నుంచి వేద సారాన్ని నిజ జీవితం లో ఎలా పాటించాలొ 

తెలియడానికి కధలు కథలు గా వివరించింది... అయినా మనిషి మారలేదు వాటిని అర్థం చేసుకోలేదు... 

పాటించలేదు.

మరీ 18 అయితే ఎక్కువ అయాయి అనుకుని ...ఇలా కాదని రివర్స్ లో 2 ఇతిహాసాలిచ్చి మనుషుల ద్వారా 

చెపితే అర్త్దం అవుతుందని సీతారాములు.... ... భరత, శతౄఘ్న, లక్ష్మణ ... అనే మనుషులు వేద సారాన్ని 

చక్కగా పాటించి దేవతలు గా ఎలా మారారో రామాయణం ద్వారా .... భీష్ముడు, ధర్మరాజు, భీముడు,అర్జునుడు, 

నకుల సహదేవులు... శ్రీ కృష్ణుడు అని మహాభారతం ద్వారా మనిషి ఉన్నతంగా జీవించి సార్థకత ఎలా 

సాధించవచ్చో చెప్పింది.


ఊహూ ..... ఈ సారీ అర్థం  చేసుకోక అదే తీరు అదే అరిశడ్వర్గాలతో యుద్ధం  .... సరె ఒక్కటి  ఇస్తే 

సులువుగా అర్థం చేసుకు జీవితాన్ని సఫలం చేసుకుంటాడు .... అని ఈ సారి కన్ఫ్యూషన్ ఉండొద్దని 

శ్రీమద్భగవద్గీతా ఇచ్చింది మన హైందవ సంస్కృతి...... షరా మామూలే బాగా బలిసి మనిషి ఈ భగవద్గీతని 

కూడా అర్థం చేసుకోలేదు ... ఒకాటే అయినా సరళంగా ఉన్నా అరిశడ్వర్గాలు  ఆక్రమించిన 

కారణంగా గీతా సారం కూడా తెలియలెదు.

ఈ సారి చిరాకు వేసి మీ మనుషులు ఒట్టి వెధవలొయ్!(కన్యాశుల్కం గిరీశం లెవెల్లో!-వెధవలమే మరీ!) అని 

శూన్యం చూపించింది.... అంటే సున్నా ఇచ్చింది.

ఇదిగో ఈ సున్నాని పట్టుకుని మనిషి రకరకాలుగా వాడటం మొదలెట్టి ఈ డిజిటల్ ప్రపంచాన్ని శృష్టించాడు.... 

అత్యంత సరళమైన మానవ జీవితాన్ని సాఫీగా బతకమని భారత సంస్కృతి 4.....16....18....2.....1....0 అని 

సరళీకరిస్తే బాగా మతితప్పి కాంప్లెక్స్ ప్రపంచాన్ని మనిషి సృష్టించాడు!. 

ఇది దారుణం కదా!.

No comments:

Post a Comment