Thursday, 24 January 2013
పేరడీ
ఓటర్ - మహెష్ బాబు అయ్యి,కాంగ్రేస్ - ఇలియన అయ్యి పోకిరి లో ఉప్మా సీన్ కి పేరడీ ఇలా ఉంటే....
ఓటర్(మహెష్ బాబు) :5ఏళ్ళ కోసారి వస్తారు...చేతి చూయించి పడగొడతారు అధికారం చేజిక్కించుకొని,ఉడాయిస్తారు ఎప్పుడైనా అధికారం రుచి చూపించారా?ఓ....ఫ్యామిలీ ఫ్యామిలీ అధికారం తినే బతికేస్తారే..!అరె పాపం ఓటర్ నమ్మి ఇది ఇచ్చాడు కాస్త వాడి బాగు చూద్దాం అని ఎప్పుడైనా అనుకున్నారా?
లేదు...మళ్ళే దాని టేస్ట్ అడిగితే విషం, చేదు అంటారు!అరె మీరంతా చేసే కష్టం దాని కోసమే గదా!జిమ్మిక్కులు, ఎత్తులు,పొత్తులు.
ఇలియనా(కాంగీ):అదేం లేదు మేమూ చాలా టెన్షన్స్ అనుభవిస్తాం మీకేం తెలుసు మా కష్టాలు!
ఓటర్(మహెష్ బాబు):ఆ..ఏముంటాయి మీ కష్టలు మా డబ్బు దొబ్బి ఏ బ్యాంకులో దాచాలి కొత్త స్కాముకు ఏం పెరుపెట్టాఅలి అనే కదా!...2జి,కామవెల్త్,...ఇలా వెతికి వెతికి ఎన్నికలంటేనే విసుగొచ్చేలా చేశారు.
ఇలియనా(కాంగీ):మేమేనా పాలించింది దేశం లో ఎన్ని లోకల్ పార్టీలు లేవు?
ఓటర్(మహెష్ బాబు):ఆ ఉన్నాయి...అన్నీ మీవే ఎన్.సి.పి,టి.ఎం.సి,ఎస్.పి బి.ఎస్.పి,అని ఎన్నికల ముందు ఒక ముఖం,ఎన్నికల తర్వాత మీ ముఖం మధ్యలో ఓట్లు వేసి మేం ఎదవలమైతాము ఇక్కడ,అరె 65 ఏళ్ళల్లో 55ఏళ్ళకు పైగా మీదేగా...అందులో మళ్ళీ 17+15+6+10 ఒకే ఫ్యమిలీ వి..అరే గోడకు బల్లి అతుక్కున్నట్టు అలా అధికారం కే అతుక్కుంటే మా జనం బాదలు తెలిసేదెలా.....ప్రతీ ఎన్నికలకు వస్తారు,మా బలహీనతలను పసిగట్టి మీకు కలిసొచ్చే విషయాలను ఎక్స్-పోసింగ్ చేస్తారు(గాంధీ,ఇందిరా.నెహ్రూ-గాంధీ అని!)మేం పడిపోతాం,ఇహ మీ దంచుడు మొదలెడతారు!!!!
వస్తుంది మాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు రోజులు మారాయి అని "మనుషులు మారాలి "సినిమా మీకు చూపిస్తాం!.(మనుషులు మారాలి సినిమా బాగుంటుంది వీలైతే చూడండి అది చూస్తే ఎలాంటి వారికి అయినా ఏడుపొస్తది!).
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment