చాతుర్-వర్ణ విధానం లో శూద్రులను తక్కువ చూపారు అని తెగ విమర్శిస్తారు చాలా మంది.
మనుస్మృతి లో విష్ణువు భుజాల నుండి క్షత్రీయులు,తల నుండి బ్రాహ్మణులు తొడలనుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు పుట్టారు అంటారు కదా...ఇందులో తప్పేముంది?అసలు మన దేశాన్ని విడదీయాలని పొరుగు దేశస్తులు ఈ విధానం లో తక్కువలు ఎక్కువలు శృష్టించారు ,ఇందులో ఎక్కువ తక్కువ అనుకోవడానికి లేదు, ఎందుకంటే
" మనం గుడికి వెళ్తే దేవుడి తల పట్టుకుని మొక్కం భుజాలు తడిమి మొక్కం పాదాలు తాకుతాం దేవుణ్ణి మొక్కడం అంటే వంగి-పాదాలు తాకడం" అంటే ఇక్కడ శూద్రున్ని మొక్కుతున్నాం గాని క్షత్రీయున్ని కాదే ?.
మరి చిల్లరగా ఈ తెడాలేంటి.
అసలు రిజర్వేషన్లు ఇచ్చింది అభివృద్దికి గాని మన దేశ జనాభాని మన సంస్కృతిని చంపుకోవడానికి కాదే!మరి ఈ కులాలకి "కొలతలిచ్చి" వాటిని ఓట్ల సమూహం గా చూడడం ఎందుకు?.
తప్పు రిజర్వేశాన్లది కాదు- మతానిది కాదు ......................మనిషి ఆశది.
ఈ ఆశ అనేది ఎంత దరిద్రపు గొట్టు పనులనైనా చేయిస్తుంది అందుకే మన వేదాలు ఎప్పుడు ఘోషిస్తాయి నీలోనికి చూడు నిన్ను గుర్తించు అప్పుడు ఈ ఆశల నుండి దూరంగా దైవం వైపు నీ ప్రయాణం మొదలౌతుంది అని వింటామా లేదు నాకు ఇది కావాలి అదికావాలి పిచ్చి పరుగులు తీస్తాం!
కులం అనేది జన్మతః వస్తుంది అది నీకు ఒక కళ ని కూడా ఇస్తుంది మీరు ఒకసారి గమనించినట్లయితే... ప్రతి కులం లో ఒక కళ ఉంటుంది .....కుమ్మరి ,కమ్మరి,మంగలి (విదేశాల్లో కేశాలంకారణ కి మాంచి డిమాండ్ ఉంటుంది ) ఒక కళాకారుడు తన తండ్రి ద్వారా తాత ద్వారా కళని పొందుతాడు తరతరాలు గా కళలో జీవనాధారం వెతుక్కుని జీవిస్తారు!
"వేరే మతాలల్లో కులాలు లేవు అనేది గొప్ప విషయం కాదు" ...అది వారి దూరదృష్టి లోపం అరె ఇంత గొప్పగా జీవనాధారం ఇచ్చే ఈ కులం - కులవృత్తి కాన్సెప్ట్ కి కూడా మన వాళ్ళు వక్ర భాష్యాలు ఇచ్చి దుర్వినియోగం చేసుకుంటా రేమిటో అర్థం కాదు!.
మంగలి వాడు ప్రపంచంలో ఏ దేశం లోనైనా కులవృత్తి చేసుకుని బ్రతకగలడు అలాగే కమ్మరి, చెప్పులు కుట్టేవాడు ...ఇలా ఎవరైనా ఆర్ధిక మాంద్యం తో పని లేకుండా హాయిగా బతక గలరు!.
"కులవృత్తి మరవకురా గువ్వల చెన్నా!"
ఇదొక మాంచి నానుడి కాని మనిషి కులవృత్తి లొ లేని లోపాలని వెతికి చిన్న చూపుతో వాటికి దూరం అయ్యి సంఖనాకి పోతున్నాడు మాంచి కళ గల కమ్మరులు లేక నేడు ఏంతో మంది ఇష్టం లేకున్నా రెడీ మెడ్ నగల తో అడ్జస్ట్ అవుతున్నారు.
విదేశాలలో ఈ ప్రత్యామ్నాయ విధానం లేక ఎవడు ఎం చేస్తాడో తెలియక ప్రతి పదేళ్లకోసారి ఆర్ధిక మాంద్యానికి కారకులవుతున్నారు! అంతే గాని మన దగ్గర ఉన్నట్లు వీడు దీనికి బాగా పనికొస్తాడు అని ,వీడికి ఈ పనిలో ప్రావీణ్యం ఉంది అని లేదు.
అంటే మన పూర్వీకులు మన కులం లో ఒక కళ ని ఇన్-స్టాల్ చేశారు అన్నమాట!.
అసలు మనిషి ని తక్కువ చూడ్డం అనే కాన్సెప్ట్ మంచిది కాదు , దానికి కులం అనేది కొలతకాదు, కలిమి-లేమి అనే వాటి కారణంగా ప్రతీ మతం లో ప్రతీ దేశంలో ఉండేవే అంత మాటకి వస్తే మన హిందుత్వం లో కులం ద్వారా కళ- కళా కారులని గౌరవించాలి అనే మాట ద్వారా ప్రతి మనిషి గౌరవిన్చాబడుతాడు దానికి కలిమి లేములు బేస్ కాదు.
ఉదా:మన పూర్వీకులు "మాంచి పనితనం ఉన్నోడు " అని తక్కువ కులస్తులకి కూడా మర్యాద ఇచ్చి న సంఘటనలు చాలా ఉంటాయి. ఈ పని తనం ఎక్కడినుండి వస్తుంది కులం నుండే గదా!.
నేటి తిక్క భారతీయుడు అనుకున్నట్టు గా కులరహిత సమాజం ఒక కళని మనిషికి ఇవ్వలేక పోయింది,డబ్బు ఉంటె మర్యాద లేకుంటే లేదు అనే స్థితి వచ్చింది. అదే డబ్బు లేకున్నా పనితనం ఉన్న వాడు అని మర్యాదగా చూస్తున్నారా పనితనం ఉన్నావానికి మర్యాద దొరక్కపోతే వాడు పనిచేయడని వాడి తో కాస్త మర్యాదగానే వ్యవహరిస్తారు.
ఇక ఆస్తులు ఎదుగుదల...అంటే చేసే పనిని ఎంత విభిన్నంగా చేస్తావు అనే దాని తో నీ ఎదుగుదల ఉంటుంది ఉదా:నిక్ షూ ల కంపనీ ఒక శూద్రుడు (చెప్పులు కుట్టే వాడు) పెట్టి ఎదిగితే బాగానే ఉంటుంది కదా నీ ప్రోడక్ట్ ని నువ్వు ఎలా ప్రమోట్ చేస్తావు అనేది నీ తెలివి తేటలని బట్టి ఉంటుంది కాని కులం అడ్డుకోదు గదా!.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ కులాల కంపు ఎన్నికల ముందే లేస్తుంది మళ్ళీ 5 ఎళ్ళ వరకు బాగానే ఉంటుంది మరో 10-11 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అంటే ..కులం కంపు లేవ్వనుంది!!!!!!!.
No comments:
Post a Comment