నాది అనుకున్న సంస్కృతి నశిస్తోంది అని ఎవరో అంటుటే కలవరపడ్డాను కాని నాకుఎదురుగా వస్తున్నా పీర్ల పండగని చూసి మురిసిపోయా ఎందుకంటే నాది అని అనాదిగా గుహల్లొఅ చిత్రీకరించుకుని, గుళ్ళు కట్టి ఆరాదించిన విగ్రహారాధన ఇంకా పోలేదని,పైగా అది పరమతం లో ఇమిడిపోయి విలసిల్లుతోంది అని!
అరె.... బానిసత్వం తో పాటుగా అంటించిన పాపులమనే తత్త్వం - మూడత్వం కలవరపెడుతోంటే అప్పుడే అంతా కలిసి చేసుకుంటున్న ఆరోగ్యమాత ఉత్సవాలు చూసి మళ్ళీ నాదే గెలిచినిది అనుకున్నా...సేవ పేరులో చేసిన మోసం ఎన్నో ఏళ్ళు దాగదని తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం నా సంస్కృతికి బాగా తెలుసనీ అందుకే ఇన్నెళ్ళైనా అలా నెగ్గుకొస్తూనే ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నా!.
అసలు ఎవరన్నారండి ఈ దేశం లో సంస్కృతి కి ఆపద వచ్చింది అని,జిజియా పన్ను పేరు తో రక్తాన్ని ధనరూపం లో తాగిన శతాబ్దాల రాచరిక దాస్యం నుండి విముక్తిని పొంది సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం తో పోరాడి చివరికి స్వాతంత్ర్యం సాదించి సగర్వంగా నిలిచిన భూమి ఇది!
పోరాడి పోరాడి పోరాటం నాలో నిండింది కనుక ఈ అవినీతి నల్ల జీవులు ఆ తెల్ల(ఇటలీ ) జీవులతో కలిసి చేసే అరాచాకాలని కూడా పోరాటం తోనే కడిగేస్తాం...కాని ఈ పోరాటం వోటు తో చేసేది ..!
"అసలు దొంగలెవరు దోచుకోలేనిది విద్య" అనేది సత్యం అయితే లార్డ్ మెకాలే గారు విశ్వా ప్రయత్నం చేసినా మన రక్తం నుండి తొలగిపోనిది జ్ఞానమే కదా..అదే జ్ఞానం తో ప్రపంచాన్ని నడుపుతున్నాం ....శాంతి ని సహనాన్ని చేతకానితనం అనుకుంటే అది అనుకునే వాని పొరబాటు కాని మంది కాదు కదా...!
మీరు పాపులు,పాపపు మరకలు మేం క్లీన్ చేస్తాం అంటూ వచ్చే టాయిలెట్ క్లీనర్లకి సమాధానం ఇస్తూ తర తరానికి ఒక జ్ఞాన జ్యోతి ఈ గడ్డ మీద నిరంతరం వెలుగుతూనే ఉంది.ఒక రామకృష్ణ పరమ హంస, స్వామీ వివేకానంద ,ఒక రవి శంకర్ ,ఒక జిడ్డు కృష్ణ మూర్తి ....ఒక రమణ మహర్షి ...నేటికీ చాలా మంది తత్వ విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూనే ఉన్నారు,శాస్త్ర విజ్ఞానం లో తిరుగు లేని విదంగా రాణించే విద్యా కుసుమాలు విరబూస్తూనే ఉన్నాయి!అవార్డు లే జ్ఞానానికి ప్రమాణం అనుకుంటే పొరబాటే అవుతుంది ఎందు కంటే ఉత్తర కొరియా లో పని చేసే శాస్త్రవేత్తలకి అమెరికా అవార్డులివ్వడు కదా!అలానే మన వ్యవస్థ కూడా.
కాని మన రక్తం లో 1000 ఏళ్ళు గా నింపిన దాస్యాన్ని కడాగాల్సిన అవసరం ఉంది నీవు సింహానివి...జగద్గురువు అయిన భారతీయ జ్ఞాన జ్యోతివి బానిసవు కాదు.అని చైతన్యాన్ని దీపాన్ని దేశం నలుమూలలా ప్రకాశింపచేయవలసిన ఆవసరం ఉంది.
ఏంటో పచ్చకామెర్ల వాడికి అంటా పచ్చగా నెఅ కనబడుతుంది అన్నట్లు నా కు అంటా బాగానే కనబడుతోంది అంతా హిందూస్తాన్ లో హిందుత్వమే కనపడుతోంది ..ఎవరు మతం తెచ్చినా అది "HINDIVAISATION "(అదేనండి! INDIANAISATION ).
చివరాకర్ణ..................... "హిందువుగా జీవించు హిందువునని గర్వించు."
No comments:
Post a Comment