Thursday, 24 September 2015

గ్రామాల దత్తత - శ్రీమంతుడు

గ్రామాల దత్తత అనేది మూర్ఖమైన ఆలోచన  పనిదొంగ వెధవలు బాధ్యలనుంచి  తప్పించుకోవటానికి మొదలు పెట్టిన ఆలోచన ఇది.

ప్రజలు పన్నుల రూపం లో చెల్లించిన డబ్బు కొట్టేసి దానికి లెక్కలు చూపక  పోగా .... మళ్ళీ  ప్రజల నుండి  దొంగదారిలో డబ్బు వసూలు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు!!

ఏ సెలబ్రిటీ .... డబ్బుని అచ్చు వేయడు,  తీసే సినిమాని డబ్బుతోనే  తీసి లాభాలు చూసుకుంటారు గాని ఆకాశం నుండి  డబ్బుని కురిపించరు ఆ విధంగా జనం డబ్బుని సినిమా .... వ్యాపార .... క్రీడా కారుల మాధ్యమంగా వసూలు చేస్తున్నరు.

అసలు రాష్ట్ర బడ్జెట్ కోసం  వసూలు చేసే పన్నులు ఎవరి బొడ్లో తోస్తున్నరు? బడ్జెట్ లో  ప్రకటించిన పథకాలు వాటి ఖర్చుల కి కేటాయించిన డబ్బు ఎక్కడికి పోతుంది ?

60 ఏ ళ్ళుగా  తరతరాలు కూచుని మింగిన కాంగిరేసు ని ఏమీ  అనకూడదు మళ్ళీ జనమే డబ్బులు కూడబెట్టుకుని కొత్తగా ప్రాథమిక సౌకర్యాలని సమకూర్చుకోవాలి!!

రంకు మొగున్ని (కాంగిరేసు ని )కాపాడుకోవడానికి బాగా వచ్చింది ఆలోచన ఈ తోక పార్టీకి !!

మోదీ  గారు "సన్సద్ గ్రామీణ యోజన" మొదలుపెట్టింది పర్సు లోంచి తీసిన డబ్బు తో అభివృద్ధి చేయమని గాదు ... సెలబ్రిటీల డబ్బు తో కాదు ...
రాజ్య సభ, లోకసభ  సభ్యుల పేరిట ప్రతి టర్మ్ కి 50 కొట్లు కేటాయించ బడుతాయి వాటిని అంతకు ముందు సభ్యులు సద్వినియోగం చేసుకోలేదు కనుక ఒక్కొక్కరూ ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ 50 కొట్ల ని ఖర్చు చేస్తే ఆ గ్రామం బాగు పడుతుంది అలా 545 మంది 545 గ్రామాలని  బాగుచేయవచ్చు అని "దత్తత" అనే దానిని సూచించారు. అంటే  నిబద్దత కాన్సంట్రేషన్ ఒకే గ్రామం పై కేంద్రీకరించి పని చేయటం

దాన్ని ఎవరో ఒక వ్యక్తి  తన వ్యాపార లాభం కోసం సినిమాగా తీస్తే ఓ ఎగేసుకుని గ్రామాలని దత్తత ఇచ్చేస్తున్న చేతగాని ప్రభుత్వాన్ని చుస్తే చిరాకు వేస్తుంది!
ప్రభుత్వం ఏం  చేస్తుంది ... గ్రామా లు అన్నింటిని దత్తత ఇచ్చాక? ఫాం హౌస్ లో లిక్కర్ కొట్టి చుక్కలు లెక్క పెడ్తదా ?

అసలు కొరటాల శివ గారు మిడి మిడి జ్ఞ్యానం తో "సన్సద్ గ్రామీణ యోజన " అనే విషయాన్ని అపార్థం చేసుకున్నాడని తెలిసిపోతుంది . సరే "సినిమాకి కాదేది అనర్హం" అని వదిలేయక ఇదే అదను అని దత్తత ల కొనసాగింపు ఎంత తిక్క మాలిన పని??!!

ఈ రోజు ఒక మంచి వాడు దత్తత తీసుకుంటే పర్వాలేదు ... కాని ఒక వ్యాపార దృష్టి కలవాడు 4 గ్రామాలని దత్తత తీసుకుని వాటి పై అనధికార పెత్తనం చెలాయిస్తే ఎవడు దిక్కు?

ఇప్పటికే కాస్త ఆర్ధిక బలం ఉన్న వాళ్ళూ వారి ప్రాంతం లో అతి పెత్తనం చెలాయించటం  సర్వ సాధారణం అటువంటిది ఇక దత్త్తత తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేటు కంట్రొల్ చేస్తూ అక్కడి ప్రజల సౌకర్యాలని నియంత్రిస్తూ పొతే జనానికి దిక్కెవరు... బానిసత్వానికి ప్రభుత్వం కారణం కాదా?  అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అర్హత .... ఆస్కారం ఉంటుందా ??

 అసలే ఈ దిక్కుమాలిన ప్రజాస్వామ్యంలో ప్రతి వెధవకీ దిక్కుమాలిన అవకాశాలు, స్వేచ్చ ఏడ్చి చచ్చాయి  ఇక కాస్త పెట్టుబడి పెట్టాక వాడి స్వేచ్చ ని ...  నియంత్రించడం ఎవరి తరం?

అసలే మధ్యతరగతి కుటుంబాలు ఒక్కడు పని చేస్తే 4 బతికే సోమరితనం తో కొట్టు  మిట్టాడుతున్నరు ఇలాంటి సమాజం లో  ఒక సెలబ్రిటీ తన సొంత డబ్బు తో పని చేసి పెడతాడు అంటే  సోమరి పనిదొంగ లు పని చేయడం మానేసి  చెడి పొయే  అవకాశం ఉంది .
 గవర్నమెంటు పనిమంతులలొ పనిచేసే వారి సంఖ్య చాల తక్కువ ఇక ఇలా సెలబ్రిటీలు బాధ్యత తీసుకుంటే వారికి ఇక పనేమీ? అవినీతికి అంతేమి?

రామ్ గోపాల్ వర్మ గారు ... తేజ గారు అన్నట్లు పన్నుల కోసం  దత్తతలు అంటె ఇక చార్టెడ్ అకౌంటు వారి తెలివి కి అంతుండదు!!
ఒక దత్తత తీసుకున్న వ్యక్తి 15 లక్షల పని చేసి 25 లక్ష ల  లెక్క చూపి పన్ను బ్యాలన్స్ చేస్తే ఆ 15 లక్షల పని నాసిరకం అయి కొన్నాళ్ళకి  మట్టీ పాలు అయి కొందరి ఊరి జనం ప్రాణాల మీదికి ఇక్కట్లు తెస్తే ప్రభుత్వం ఎం చేస్తుంది?

కట్టిన పన్నుల నుండి నిజాయితీగా ప్రభుత్వం పని చేస్తే ఇలా దత్తత ల తో  పబ్బం  గడపాల్సిన దారిద్ర్యం నా సమాజానికి ఎందుకు?


 అప్పుడెప్పుడో దూరదర్సన్ తెలుగు (సప్తగిరి ) చానల్ లో ఒక సీరియల్/ 2 ఎపిసోడ్ల టెలి ఫిలిం  చూసిన గుర్తు ఒక నగర శివారు ప్రాంతం లో  ఒక సంపన్నుడు ఇల్లు కట్టుకుంటాడు అప్పటికి ఆ ప్రాంతం లో ఉన్న పేద మధ్యతరగతి జనులకి కుళాయి నీళ్ళు ... కరెంటు సౌకర్యాలు ఉండవు  ఆ చుట్టుపక్కల వాళ్ళ ని ఎగదోసి అధికారుల చుట్టు తిప్పించి ఆర్జీలు పెట్టించి వాడే  అన్నీ ముందుండి నడిపించినట్లు అతి చేసి  ఆ శివారు ప్రాంతానికి నీళ్ళు కరెంటు వచ్చేలా చేస్తాడు ఆఖరుకి ఆ కాలనీ లో ఉండె వారికి ఎండాకాలం లో  నీళ్ళు ఇవ్వడానికి నానా ఇక్కట్లు పెడతాడు వాడి ఇంటికి లావుపాటి పైపు లైను మిగతా కాలనీకి మోస్తారు పైపులైను  ... అందరికి ఒక కరెంటు లైను వాడి ఇంటికి ప్రత్యేకమైన కరెంటు లైను ఇలా పని కానిచ్చి బయటికి మాత్రం వాడు ఆ ప్రాంత అభివృద్దికి మూల పురుషుడని మోలశంఖ పురుషుడు అని బిల్డప్పు ఇస్తాడు .
\
అసలు వాడు ఒక్కడికే లైను అడగబొతె వాడి స్నేహితుడో . ... పెళ్ళామో ఒక ఆలోచన ఇస్తారు .. నువ్వొక్కడివే  ఆర్జీ ఇస్తే ఖర్చు మొత్తం ఒక్కడివే భరించాల్సోస్తుంది ... పైగా ఆలస్యం అవుతుంది అదే జనం పని అంటే  ఖర్చు తగ్గుతుంది త్వరగా పని జరుగుతుంది అని అ!!
సీరియల్ ఆఖరులో వాడు పెద్ద మనిషిగానే చాలా మణీ  అవుతుంటాడు జనం వాణ్ని పై లెవెల్లో చూస్తుంటారు కాని రచయితా/ దర్శకుడూ లొగుట్టుని మనకి తెలిసేలా చూపెడతారు ....

ఇప్పుడు చచ్చు పుచ్చు ప్రభుత్వం తెచ్చిన దత్తత ఆలోచన ఇలాంటి దారునాలకి స్థానిక పెత్తన వికేంద్రీకరణ దారితీయటం చాలా సులభం !!

ఎంతైనా మన భారతీయులు ఎ మంచి పనినైనా అతి దారుణంగా దుర్వినియోగ పరచటం లొఅ ఉద్దండులు కదా !!




No comments:

Post a Comment